Trinayani Serial December 11th Episode - 'త్రినయని' సీరియల్: తిలోత్తమ ప్లాన్ అట్టర్ ఫ్లాప్, ఇంతకాలం వీడియోలు పంపింది అతనే!
Trinayani Today Episode : గాయత్రీ పాప పేరు మార్చాలి అనుకున్న తిలోత్తమ ప్లాన్ తిరిగి తన ప్రాణాల మీదకే రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Trinayani Serial Today Episode
వల్లభ: పేర్లు ఒకటే ఇద్దరు ఒకటి కాదు.. ఒకరే ఇద్దరు కాదు..
పావనామూర్తి: కన్ఫ్యూజ్ చేయకు అల్లడు. ఇప్పుడు ఏమంటారు. పేరు మార్చుతామంటారు అంతేనా
విశాల్: వద్దు బ్రదర్ వద్దు.. గాయత్రీ నామానికి మించినది ఈ భూప్రపంచంలో ఎక్కడా లేదు.
తిలోత్తమ: పేరు వేరు ప్రస్తావించే నామం వేరు విశాల్.. సప్తకోటి మహామంత్రాల్లో ఆది మంత్రం గాయత్రీ
నయని: వెయ్యి నాలుకలున్న ఆదిశేషుడికే సాధ్యం కాదు. మనుషులం మనం ఎంత. గాయత్రీ మంత్రం వివరించడం మన వల్లకాదు.
తిలోత్తమ: మేము మార్చాలి అనుకున్నది అమ్మవారి పేరు కాదు నాన్న.. మీ అమ్మ పేరుని. అది కూడా అనాథ పిల్ల అయిన ఈ పిల్లని మీరు దత్తత తీసుకున్నప్పుడే మీ పిల్ల అయినందుకు నిన్ను కన్న మీ అమ్మ పసి బిడ్డగా ఉన్న సరే ఇప్పటివరకు మిమల్ని చేరనందుకు ఇక్కడే మీ దగ్గరే మీ అమ్మ పేరు ఉన్న ఈ పిల్లకి గండం చుట్టుకుంది.
వల్లభ: ఒక్క ముక్కలో చెప్పనా మరదలు పిల్లా.. మీరు కన్న గాయత్రీ పెద్దమ్మ క్షేమంగా ఉండొచ్చుకానీ మీరు దత్తత తీసుకున్న పాపానికి సారీ ఇలా అన్నా అని ఏం అనుకోకండే..
సుమన: దత్తత తీసుకోవడం వల్ల మీ కూతురు అయినందుకు ఈ పిల్లకి ఇలా జరిగింది. పేరు మారిస్తే మళ్లీ చెంగు చెంగున జింక పిల్లలా ఆడుకుంటుందని అత్తయ్య, వల్లభ బావ గారు అఖండ స్వామి వారిని కలిశారు.
విక్రాంత్: ఈ చాటలో బియ్యం అందుకేనా
విశాల్: నయని పాప క్షేమంగా ఉండాలి అనుకోవడం నాకూ ముఖ్యమే. కానీ పేరు మారిస్తే తను క్షేమంగా ఉంటుంది అనేది ఎంతవరకు కరెక్ట్. చెప్పండి
విక్రాంత్: మన గురువుగారు చెప్తే పర్వాలేదు. మనకు సంబంధం లేని ఎవరో చెప్తే ఎందుకు చేయడం
తిలోత్తమ: మీ ఇష్టం ఈ రోజు పేరు మార్చి తనకు రేపు నయం అయితే అప్పుడు మళ్లీ గాయత్రీ అనే పిలుచుకోవచ్చు కదా. ఆలోచించండి.
సుమన: ఎక్కువ తక్కువ అయి చనిపోతే.. అయ్యో అత్తయ్య మాట వినుంటే బాగుండేది అని మాత్రం చెప్పకు అక్క
హాసిని: మీరు ఇలా మాట్లాడి కంగారు పెడితే చెల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది పాపం
తిలోత్తమ: పర్మినెంట్‌గా పేరు ఏం మార్చడం లేదు. ఈ ఒక్క రోజు మార్చి చూద్దాం. అఖండ స్వామి వారి సూచన మేరకు చేస్తే ఫలితం కనిపిస్తే మళ్లీ రేపటి నుంచి అందరం గాయత్రీ అని పిలుద్దాం.. ఇక పేరు ఏంటి అనుకున్నానో మీకు చెప్పను. బియ్యం మీద ఈ పాప తోనే రాయిస్తాను.
విశాల్: అమ్మా నువ్వు రాయిస్తావా
తిలోత్తమ: ఎవరికీ అభ్యంతరం లేదు కదా. హాసిని ఆ బియ్యాన్ని నాగులాపురం పెట్టెమీద పెట్టు. అది గాయత్రీ అక్కయ్య దాచి పెట్టిన పెట్టెకదా అందుకే ఆ పెట్టె మీద పెట్టి నామకరణం చేయమన్నారు. గాయత్రీ రా అమ్మా.. రా...
పావనామూర్తి: ఒక్క నిమిషం అక్కయ్య. ఇది కోరిక అనుకోండి లేక ఇంకేమైనా అనుకోండి. పెళ్లి అయిన మాకు ఏం సంబరం లేదు. ఎలాంటి వేడుక జరుపుకునే అదృష్టం లేదు అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు గాయత్రీ పాపకి మళ్లీ పేరు పెడుతున్నారు. అదేదో మా చేతి మీద జరిపితే బాగుండు కదా అని
తిలోత్తమ: పర్వాలేదు ఎవరు చేస్తే ఏంటి.. పిల్ల చేయి పట్టి బియ్యం తాకించండి అప్పుడు పేరు చెప్తాను.
ఇక పావనామూర్తి దంపతులు గాయత్రీపాపకి పేరు పెట్టేందుకు తనతో బియ్యం తాకించబోతే.. పెద్ద గాలి వీచి గాయత్రీ దేవి ఫొటో అటుఇటూ ఊగుతుంది. మరో వైపు నాగులాపురం పెట్టే దానంతట అదే తెరుచుకొని బియ్యం మొత్తం కేవలం తిలోత్తమ మీద మాత్రమే పడిపోతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇక హాసిని, డమ్మక్క తిలోత్తమ మరణానికి అది సంకేతమని చెప్పి అందర్న షాక్‌కు గురిచేస్తారు. ఇక విశాల్ ఎందుకు ఇలా జరిగిందా అని అనుకుంటే.. వాళ్లే అఖండ స్వామిని అడిగి తెలుసుకుంటారని హాసిని వెటకారంగా ఉంటుంది. ఇక తిలోత్తమ లోపలికి వెళ్లిపోతుంది.
హాసిని: విశాల్ మనం మానవ శక్తిని మాత్రమే కాదు దైవ శక్తిని కూడా చూస్తున్నాం. నున్ను కన్న గాయత్రీ అత్తయ్య విశాలాక్షి అమ్మవారికి పరమభక్తురాలు కావడం వల్ల పునర్జన్మలోనూ ఆ అమ్మ దయ కలిగి ఉంది.
విశాల్: అవును వదినా.. అందుకే అమ్మ పేరు మార్చనివ్వలేదు. (మరోవైపు ఈ సంభాషణను ఎవరో మళ్లీ వీడియో తీసి విశాల్‌కు పంపిస్తారు. ) మళ్లీ మెసేజ్ వచ్చింది వదినా.. మనం మాట్లాడినది అంతా ఎవరో రికార్డ్ చేశారు. ఇక వీడియో తీయాల్సింది ఎవరో తెలుసుకోవడానికి హాసిని ఒక్కర్తే మాట్లాడుకుంటూ ఉంటుంది. విశాల్ వీడియో తీసింది ఎవరో తెలుసుకోవడానికి వెళ్తాడు. ఇక పావనామూర్తే ఆ వీడియోలు తీయడం విశాల్ కనిపెట్టేస్తాడు. ఇక హాసిని, విశాల్ ఇద్దరూ పావనామూర్తికి చీవాట్లు పెడతారు.
పావనామూర్తి: కూల్ అమ్మ కూల్.. మిమల్ని అలర్ట్ చేయడానికి ఈ వీడియోలు తీసి పెడుతున్నాను. నాకు బదులుగా మీ ఆయన గానీ, మీ అత్తయ్య గానీ చూసుంటే.. బ్రహ్మ రహస్యాలు తెలుసుంటే ఇంకేమైనా ఉండేదా
విశాల్: థ్యాంక్స్ మామయ్య.. నువ్వు ఎవరికీ చెప్పవు అని మాకు బాగా తెలుసు. గాయత్రీని నువ్వు ఎత్తుకొని పేరు పెడతా అన్నావ్
హాసిని: అంటే బాబాయ్ తిలోత్తమ అత్తయ్య చేతిలోకి గాయత్రీ పాప వెళ్లకుండా తీసుకున్నారు అన్నమాట.
పావనామూర్తి: అవును అమ్మ తను ఎక్కడ పసిగట్టేస్తుందో అని మాకు పిల్లలు లేరు అన్నమాటని హైలెట్ చేసి విషయాన్ని డైవర్ట్ చేశాను. ఎంత దుర్మార్గం అల్లుడు. నిన్ను పెంచిన తల్లే నిన్ను కన్న తల్లిని చంపేసింది అంటే బాధ వేస్తుంది. అంతకు మించి కోపం వస్తుంది
విశాల్: నేనే ఓపిక పట్టాను అంటే కారణం మా అమ్మే ప్రతీకారం తీర్చుకోవాలి అని
హాసిని: గాయత్రీపాప అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉంది బాబాయ్. ఆరోజు రానే వస్తుంది. తిలోత్తమ అత్తయ్యకి దండ పడుతుంది.
పావనామూర్తి: ఈ లోపు మనం పాపకి హెల్ప్ చేయాలి అమ్మ.. ఇలా దగ్గరకు రండి అంటూ ఐడియా చెప్తారు. మరోవైపు తిలోత్తమ, వల్లభ అఖండ స్వామిని కలవడానికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.