Trinayani October 10th: గంట తగిలి జారిపడ్డ తిలోత్తమ.. గాయత్రిని పొగిడేస్తున్న హాసిని!
అఖండస్వామి తిలోత్తమకి ప్రాణగండం ఉందని చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Trinayani October 10th Written Update: కొడుకంటే మీరు కాదు విశాల్లాగా ఉండాలి. ఎత్తుకొని కూర్చోబెట్టనా అమ్మ అని అంత బాగా అడిగాడు చూసి నేర్చుకోండి అని వల్లభతో అంటుంది హాసిని.
దురంధర: విశాల్ ది అంటే జిమ్ బాడీ. మరి వల్లభది కాదు కదా అని అనడంతో వల్లభ తన చొక్కా విప్పి చూపిద్దామని ప్రయత్నిస్తాడు. ఇంతలో అందరూ గట్టిగా ఆపమని అరుస్తారు.
హాసిని: బాబు ఐటెం రాజా ఇక్కడ మనుషులు జడుసుకుంటారు ఆపండి అని అంటుంది.
ఎద్దులయ్య: అమ్మ గాయత్రి గంటతో ఆడుకో అని తనకి ఒక గంటని ఇస్తాడు.
తిలోత్తమ: ఇంతకీ సుమన ఆ పది కోట్ల చెక్ డిపాజిట్ అయిందా?
సుమన: అయింది అత్తయ్య ఉదయాన్నే మెసేజ్ వచ్చింది
హాసిని: కోటీశ్వరురాలనే ధీమా వచ్చేసినట్టుంది చిట్టికి
విక్రాంత్: మా బ్రో ముష్టి వేస్తే తీసుకున్న డబ్బులు అవి
విశాల్: ఎందుకు రా తనని రెచ్చగొడుతున్నావు? వదిలే అని విక్రాంత్ ని తిడతాడు.
ఎద్దులయ్య: అమ్మ గాయత్రి ఇచ్చిన గంటతో ఆడుకోవద్దు వాడుకో అని అంటాడు.
సుమన: ఇంతకీ మమ్మల్ని కిందకి పిలిచిన విషయం ఏంటి అత్తయ్య?
తిలోత్తమ: విశాలాక్షి శివ భక్తురాలు కనుక తను ఏం చెప్పినా జరుగుతుంది. ఈ ఇంట్లో ఒకరోజు పిల్లలకి పాలు ఉండవు అని అన్నది కదా అందుకే నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఇప్పటినుంచే పిల్లలు అందరికీ పాలు అలవాటు తప్పిస్తే మంచిది. వాళ్ల చేతిలోకి వేపాకు రాస్తే చేదుగా ఉండడంతో రెండో రోజు నుంచి వాళ్లే పాలు తాగడం మానేస్తారు. అప్పుడు పాలు లేకపోయినా ఉండగలరు అని హాల్లో ఆ కాళ్లతో తిప్పలు పడుతూ నడుస్తూ చెప్తుంది తిలోత్తమ.
నయని: చెప్పుతో కొడతారు జనాలు ఈ విషయం తెలిస్తే
హాసిని: అవును. గాయత్రి, గానవి, పూనబాబులైన పండో కాయో తిని బతుకుతారు కానీ ఉలూచి నెలల పిల్ల. తనకి పాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతుంది?
తిలోత్తమ: మరింకేమైనా దారి ఉందా? లేదు కదా అనేలోగా గాయత్రి అటువైపు గంటని విసురుతుంది. దానిమీద కాలువేసిన తిలోత్తమ వెంటనే కింద పడిపోతుంది. దాన్ని చూసి కంగారుగా అందరూ తిలోత్తమని పైకి లేపుతారు. ఎలా పడ్డాను అని చూసేసరికి అక్కడ గంట కనిపిస్తుంది తిలోత్తమకి.
తిలోత్తమ: ఆ గాయత్రిని అనండి ముందు. తన చేతిలో ఉన్న గంట వల్లే నేను కింద పడ్డాను.
నయని: ఆపండి అత్తయ్య ముందు వరకు తిప్పలు పడుతున్న మీ కాళ్లు మళ్లీ నయమైపోయాయి చూసుకోండి. చిన్న పాప తెలిసో తెలియకో మీకు మంచే చేసింది అని అనగా దానికి తిలోత్తమా తన కాలు నయమైపోయాయి అని తెగ సంతోష పడుతూ ఉంటుంది.
హాసిని: నేను గాయత్రిని పైకి తీసుకెళ్లి తనతో ఆడుకుంటాను అని హాల్లో నుంచి గాయత్రిని ఎత్తుకొని పైకి వెళ్తుంది. అప్పుడు గాయత్రిని సోఫా మీద కూర్చోబెట్టి తనతో మాట్లాడుతుంది హాసిని.
హాసిని: మంచి పని చేశావు గాయత్రి. ఈసారి గంటలాంటిది కాదు పెద్దది ఏదైనా విసిరి డైరెక్ట్‌గా చంపేయ్. ఒక గోల వదిలిపోతుంది అయినా పాపం నువ్వు కాపాడావు అనుకుంటుంది, నీ చేతిలోనే ఆవిడ చావు ఉన్నది అని తెలిస్తే ఏమైపోతుందో అని నవ్వుకుంటూ ఉండగా సుమన అక్కడికి వస్తుంది.
సుమన: ఎవరు ఏమైపోతారు? చావు అని ఏదో అంటున్నావ్ ఏంటి అక్క?
హాసిని: చావు లాంటి పెద్ద పదాలు చిన్న పిల్ల ముందు మాట్లాడడం ఏంటి చిట్టి. నేను అలా అనలేదు నీకే తప్పుగా వినబడినట్టు ఉన్నది.
సుమన: అయినా నీ కొడుకు పూనా ఉండగా మా అక్క సొంత కూతురు గానవి ఉండగా ఈ గాయత్రి మీదే నీకు ప్రేమ ఏంటి? ఎక్కువ తినతోనే కనిపిస్తావు ఎందుకు?
హాసిని: మా గాయత్రి అత్తయ్య పేరు పెట్టుకున్నది కదా అందుకే తన స్వరూపం లాగే కనిపించి సేవలు చేసుకుంటున్నాను అని చెప్పి ఇంకా ఎక్కువ నోరు జారే లోగ అక్కడ నుంచి వెళ్లిపోతుంది హాసిని.
మరోవైపు విశాల్, నయనిలు హాల్లో కూర్చుని కావాల్సిన సరుకులకి పద్దు వేస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా తిలోత్తమా వల్లభని తీసుకొని అఖండ స్వామి దగ్గరికి వెళ్తుంది.
అఖండస్వామి: అదేంటి తిలోత్తమా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? కింద పడి ప్రాణాలు పోతాయి అనుకున్నాను? నువ్వు ఎలా వచ్చావు?
వల్లభ: కారులో వచ్చాము
తిలోత్తమ: అయినా నేను కింద పడడం ఏంటి స్వామి?
వల్లభ: ఇందాక గాయత్రి విసిరిన గంటను తగిలి కింద పడ్డావు కదా మమ్మీ దాని గురించి ఏమో.
తిలోత్తమ: ఆ గాయత్రి నామీద గంట విసిరినా కూడా అది నాకు మంచి పని అయింది. ఎందుకంటే పోయిన కాలు మళ్లీ తిరిగి వచ్చాయి.అది నాకు ప్రాణనష్టం ఎలా అవుతుంది స్వామి అని అఖండస్వామితో అంటుంది తిలోత్తమ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial