Jagadhatri Serial Today November 25th: జగద్ధాత్రి సీరియల్: జగధాత్రికి నిశి పెట్టిన శాపనార్థాలు ఏంటి..? కౌశికిని ఎందుకు నిలదీసింది..?
Jagadhatri Serial Today Episode November 25th: కౌసికీ కొత్తగా చేయబోయే బిజినెస్‌లో నిశి,యువరాజును తీసుకోనని చెప్పడంతో ఇంట్లో గొడవ మొదలవుతుంది. దీనికి జగధాత్రి ఏం చేసింది..?

Jagadhatri Serial Today Episode: జేడీ, కేడీ వద్దకు వచ్చిన మీనన్....ప్రాణభయంతో ప్రాధేయపడతాడు. తనను బతికించాలని వేడుకుంటాడు. అప్పుడు జేడీ నాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదురా.. నీ సామాజ్రం కూల్చడమే నా లక్ష్యమంటుంది. చట్టబద్ధంగా నీకు శిక్షపడేలా చేస్తానని చెబుతుంది. నీకు జరిగిన శాస్తి చూసి మరొకరు ఈ పనులు చేయాలంటేనే భయం రావాలని కేడీ హెచ్చరిస్తాడు. ఆ తర్వాత యాంటీ వైరస్ డోస్ ఉన్న ఇంజెక్షన్‌ను డాక్టర్‌కు అందించి...మీనన్ బతికించుకోవాల్సిందిగా చెప్పి జేడీ, కేడీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ ఇంజెక్షన్‌ను జాగ్రత్తగా పరిశీలించిన డాక్టర్....అలాంటి యాంటీ డోస్‌లు తనవద్ద చాలా ఉన్నాయని మీనన్‌కు చెబుతాడు. ఆ తర్వాత వెంటనే మీనన్‌కు డాక్టర్ యాంటీడోస్ ఇస్తాడు. వెంటనే లేచి నిలబడిన మీనన్...తన చేతులు,కాళ్లు పనిచేస్తున్నాయంటూ ఆనందంతో గెంతులు వేస్తాడు.ఆ తర్వాత జేడీ ముఖం చూసావు కదా ఆమె ఎవరంటూ మీనన్ డాక్టర్‌ను బెదిరిస్తాడు. దీంతో వైద్యుడు వారిద్దరూ మాస్కులు వేసుకుని వచ్చారని...తాను వారిని చూడలేదని డాక్టర్ మీనన్‌కు అబద్ధం చెబుతాడు.
హోటళ్లు, రిసార్ట్‌ల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి ఆతర్వాత బెదిరింపులకు పాల్పడి లక్షలాది రూపాయలు దండుకున్న మీనన్ మనుషులను అరెస్ట్ చేసి జేడీ,కేడీ మీడియా ముందు నిలబెడతారు. కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జేడీ అందరికీ విలువైన సూచనలు చేస్తుంది.
కౌసికి కొత్తగా ప్రారంభించబోయే బిజినెస్‌కు సంబంధించిన ఏర్పాట్లపై ప్రమోద్‌తో చర్చిస్తుండగా...అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ల బాబాయి ఈ బిజినెస్ చూసుకోవడానికి మేనేజర్లు, జనరల్ మేనేజర్లను ఎవరిని నియమిద్దామని అడుగుతాడు. అప్పుడు బయట నుంచి రిక్రూట్ చేసుకుందామని కౌసికి చెబుతుండగా అప్పుడే అక్కడికి నిశి ఆమె భర్త యువరాజు అక్కడికి వస్తారు. ఇంట్లో మీ తమ్ముడు,నేను ఉండగా...బయట నుంచి కొత్త వ్యక్తులను తీసుకోవడం ఎందుకు వదినా అంటూ నిశి కౌసికిని అడుగుతుంది. ఇది నీకు చెప్పినా అర్థం కాదులే అంటూ నిశిని కౌసికి వారిస్తుంది. టాలెంట్ ఇంట్లో ఉంటే బయట వెతుక్కోవాల్సిన అవసరం ఏముంటుందని అనడంతో....నిశికి కోపం వస్తుంది. ఏదో ఇంట్లో ఉంటున్నాం కదా అని మమ్మల్ని తీసిపారేయడం ఏం బాగాలేదని కోపగించుకుంటుంది. పడుతున్నాం కదా అని ఏలా అంటే అలా మాట్లాడటం మంచిది కాదని హెచ్చరిస్తుంది. దీంతో యువరాజు తండ్రి కలుగజేసుకుని వారిద్దరినీ లోపలకి వెళ్లాలని ఆదేశించడంతో నిశి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కన్నకొడుకుని,కోడల్ని కించపరుస్తున్నా మీకు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడుతుంది. దీంతో కౌసికి కలుగజేసుకుని ఇద్దరికీ గట్టిగా తిట్టడంతో....నిశి మరింత రెచ్చిపోతుంది. మీకు మేమంటే ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతామని అంటుంది.
గొడవ పెద్దదవుతుండటంతో యువరాజు తల్లి వచ్చి సర్దుకుపోవాలని సలహా ఇస్తుంది. భార్యను లోపలికి తీసుకు వెళ్లాలని యువరాజుకు చెప్పగా...అతను నిశిని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. దీంతో నిశి మరింత రెచ్చిపోతుంది. ఆవిడ మాటలు మనం వినాల్సిన పనిలేదని గట్టిగా అరుస్తుంది. అప్పుడు జగధాత్రి వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంట్లో అందరూ మీకు విలువ ఇస్తున్నా...మీరే అది చెడగొట్టుకుంటున్నారని అంటుంది. నీ భర్త మూలంగానే మీకు ఇంట్లో విలువ లేకుండా పోయిందని...దాన్ని మళ్లీ సంపాదించుకునే ప్రయత్నం చేయాలని సూచిస్తుంది. దీంతో ఆమెపై నిశి తీవ్రంగా మండిపడుతుంది. కేదార్ ఇంట్లో అడుగు పెట్టిన నాటినుంచే తమకు అవమానాలు ఎక్కువయ్యాయని తిట్టిపోస్తుంది. మా ఉసురు తగిలి మీ భార్యాభర్తలు ఇద్దరూ సర్వ నాశనం అయిపోతారని నిశి శాపనార్థాలు పెడుతుంది. మమ్మల్ని కాదని ఎండీ,మేనేజర్‌గా ఎవరిని పెడతారో చూస్తామంటూ ఛాలెంజ్ విసిరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
యువరాజు తప్పు చేశాడు కాబట్టి అతన్ని దూరం పెట్టడం సబబే కానీ...నిశికి అవకాశం ఇవ్వొచ్చు కదా అంటూ కేదార్ భార్య జగధాత్రి కౌసికీకి చెబుతుంది. ఒకసారి కోట్లరూపాయల వ్యాపారం చేతిలో పెడితే ఏంచేసిందో మర్చిపోయావా అని కౌశికీ అంటుంది. అలాంటి నిశి చేతిలో మళ్లీ బిజినెస్ ఎలా పెట్టగలమని అంటుంది. తాను నీతిగా, నిజాయితీగా వ్యవహరిస్తుందన్న నమ్మకం తనకు లేదని ఖరాఖండీగా చెబుతుంది. వాళ్లు బాధపడుతున్నారని చెప్పి వ్యాపారం వాళ్ల చేతుల్లో పెట్టలేనని చెబుతుంది. దయచేసి ఈ విషయంలో ఎవరూ బలవంతం పెట్టొద్దంటూ కౌసికీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
నిశీ మాటలు తలుచుకుని ఆమె మామయ్య చాలా బాధపడుతుంటాడు. యువరాజు చేసిన తప్పు వల్ల ఇంట్లో ఎవరికీ మనశ్శాంతిలేకుండా పోయిందని అనుకుంటాడు. ప్రతిరోజూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని బాధపడతాడు. ఎవరికి వారే అయిపోయి ఇళ్లు ముక్కలవుతుందని ఆలోచిస్తుండగానే ఆయనకు గుండెనొప్పి వచ్చి కిందపడిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పనిమనిషి ఇన్‌హెల్లర్ ఇవ్వడంతో అది పీల్చుకుని ఊపిరి తీసుకుంటాడు. పనిమనిషి శ్రీవల్లి ఆయన్ను మంచంపై పడుకోబెట్టడంతో ఈరోజు ఏపీసోడు ముగిసిపోతుంది.





















