Jagadhatri Serial Today November 20th: జగద్ధాత్రి సీరియల్: మీనన్‌కి జేడీ వేసిన ఇంజక్షన్ ఏంటి? వైరస్ ఏంటి.. 12 గంటల్లో మరణం!
Jagadhatri Serial Today Episode November 20th మీనన్ బాడీలోకి జేడీ వైరస్ ఎక్కించడం మీనన్ చావుతో పోరాడుతుండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode మీనన్ సిరిని తీసుకెళ్లిపోతాడు. మరో పోలీస్ జేడీతో సిరిని తీసుకెళ్లిపోతాడు అని చెప్తాడు. జేడీ, కేడీ ఇద్దరూ పరుగులు పెడతాడు. జేడీ కేడీలు కారులో ఫాలో అవుతారు. సిరి మీనన్‌తో నన్ను వదిలేయండి మీకే మంచిది అని చెప్తుంది. జేడీ చాలా టెన్షన్ పడుతుంది. ఏం కాదు అని కేథార్ చెప్తాడు.
సిరి వెనక్కి చూస్తే జేడీ కారు లేకపోవడంతో సిరి టెన్షన్ పడుతుంది. దేవా మీనన్‌తో ఇక మనల్ని వాళ్లు పట్టుకోలేరు భాయ్ అని అరుస్తాడు. జేడీ కేథార్‌తో వీళ్లు ఇలా చేస్తారు అనే సిరి ఇచ్చిన డబ్బుల బ్యాగ్‌లో జీపీఎస్ పెట్టాను అని అంటుంది. జేడీ ఆ లొకేషన్ ఫాలో అవుతుంది. ఇక మీనన్ దేవాతో జేడీ అంత ఈజీగా వదలదు.. ప్లాన్ బీ పెట్టుకొని ఉంటుంది. కావాలంటే ఆ బ్యాగ్ చూడు అందులో డబ్బు ఉండదు అని అంటాడు. దేవా చూసే సరికి అందులో డబ్బు బదులు గడ్డి ఉంటుంది. ఇక మీనన్ అందులో ట్రాకర్ కూడా ఉంటుంది చూడు అని అంటాడు. దేవా చూసేసరికి ట్రాకర్ ఉంటుంది. దాన్ని దేవా బయటకు విసిరేస్తాడు.
జేడీ, కేడీలు లొకేషన్ ఫాలో అయి జీపీఎస్ బ్యాగ్ పడేసిన చోటుకి వస్తారు. మీనన్ జేడీకి కాల్ చేస్తాడు. దాంతో జేడీ అమ్మాయిని అడ్డు పెట్టుకొని పారిపోయావ్ అని అంటుంది. నేను వచ్చింది నీకు పారిపోయి కాదు.. దొరికిన నీ చెల్లిని చంపేస్తా.. నా తమ్ముడిని నువ్వు చంపేశావ్ అంటాడు. నువ్వు అది చేస్తే నీ చావుని నువ్వే తెచ్చుకున్నట్లు అని అంటుంది. నాతో ఎదుర్కోలేక ఇలా అంటున్నావా అని మీనన్ అంటాడు. దానికి జేడీ ఇంకా కాసేపే నీ నవ్వు బాగా నవ్వు.. కాసేపట్లో చనిపోతావ్ అని జేడీ అంటుంది. నువ్వు నన్ను టచ్ చేయలేవు అని మీనన్ అంటాడు. మీనన్ ఇప్పటికే నేను నిన్ను టచ్ చేశాను.. సరిగ్గా 30 నిమిషాల క్రితం నా చేయి నిన్ను టచ్ చేసింది గుర్తు చేసుకో.. నీకు చీమ కుట్టినట్లు అనిపించింది కదూ.. నీ బాడీలోకి ఒక డేంజరస్ వైరస్ ఎక్కించా.. అది నిన్ను చంపేస్తుంది. సరిగ్గా ఇంకో 12 గంటల్లో నిన్ను అది చంపేస్తుంది. కుదిరితే నిన్ను నువ్వు కాపాడుకో తర్వాత నా చెల్లి సంగతి చూద్దువు.. బాయ్ మీనన్ అనిఅంటుంది.
మీనన్ చాలా టెన్షన్ పడతాడు. దేవాకి విషయం చెప్తే దేవా ఏడుపు మొదలు పెడతాడు. మీనన్ మధ్యలో హాస్పిటల్ దగ్గర దిగిపోతాడు. దేవాని సిరిని చూసుకోమని చెప్తాడు. సిరి సెటైర్లు వేస్తుంది. మీనన్ బ్లడ్ టెస్ట్‌లు చేయించుకుంటాడు. రిపోర్ట్స్ ఇంకా రాలేదు అని తెగ చిరాకు పడిపోతాడు. జేడీ, కేడీలు మీనన్ చాలా టెన్సన్ పడుతుంటాడని అనుకుంటారు. మీనన్ రిపోర్స్ కోసం డాక్టర్‌ని కలిసి అడుగుతాడు. డాక్టర్ మాత్రం నస పెడతాడు. మీనన్ చాలా ఇరిటేట్ అయిపోతాడు. డాక్టర్ రిపోర్ట్స్ చూసి చెప్పకుండా ఇరిటేట్ చేయడంతో మీనన్ గన్ చూపిస్తాడు. ఇక డాక్టర్ రిపోర్స్ చూసి మీ బాడీలో ఎవరో డేంజరస్ వైరస్ పెట్టారని యాండీ డోస్ ఇవ్వాలని అంటాడు. డాక్టర్ నీకు దండం పెడతా నన్ను కాపాడరా అని మీనన్ బతిమాలుతాడు. ప్రతీ గంటకి పావు లీటర్ బ్లడ్ ఎక్కించాలని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















