Trinayani August 21st - 'త్రినయని' సీరియల్: బలవంతంగా కొత్తిమీర వాసన పిలుచుకొని రక్తం కంటచూసిన సుమన.. క్రూరమైన ప్లాన్ చేసిన తిలోత్తమా?
సుమన బలవంతం చేసి తన రక్తాన్ని తనే కంట చూడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం.
Trinayani August 21st: సుమన వినకుండా కొత్తిమీర వాసన పీల్చుకోవటానికి ప్రయత్నిస్తుండగా విశాలాక్షి వచ్చి చెయ్యి పట్టుకొని అడ్డు ఆపుతుంది. ఇక సుమన చెయ్యి తీయి అంటూ కోపంగా అంటుంది. ఇక కొత్తిమీర వాసన కూడా పీల్చుకోకుండా చేస్తున్నారేంటి అని వల్లభ అనడంతో.. అలా చేయకూడదని డమ్మక్క అంటుంది. చేస్తే ఏం జరుగుతుందని తిలోత్తమా అనటంతో కాన్పు అవుతుందని విశాలాక్షి అంటుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాకవుతారు.
ఇక కొత్తిమీర వాసన పీల్చుకుంటే ప్రసవం అవుతుందా అని అందరూ ఆశ్చర్యం అడగడంతో పల్లెటూర్లలో ప్రసవం కోసం ఇలా చేస్తారని అంటుంది నయని. వెంటనే విశాల్ ఇప్పుడు సుమనకు ఎటువంటి నొప్పులు లేనప్పుడు డెలివరీ అవుతుందా అని అడగగా వీళ్ళది తీసుకువచ్చిందే అందుకు అని విశాలాక్షి అనటంతో అందరూ షాక్ అవుతారు. దాంతో తిలోత్తమా వాళ్ళు వెటకారం చేస్తారు. ఇక విశాల్ వారిపై ఫైర్ అవుతాడు.
ఇప్పుడే డెలివరీ అయితే సుమన బిడ్డను చూసి సంతోషపడుతుంది అంటుంది తిలోత్తమా. కానీ విశాలక్షి చెప్పినట్లే చేయాలని విశాల్ అనటంతో నయని కూడా అదే అంటుంది. దాంతో సుమన కోపంతో ఆస్తి ఇవ్వడం కోసం మా అక్క వద్దు అంటుందని అనడంతో నయని కోపంగా రగిలిపోతుంది. విక్రాంత్ కూడా సుమన పై అరుస్తాడు. అయినా కూడా సుమన కొత్తిమీర వాసన పీల్చుకుంటానని బలవంతం చేస్తుంది.
అందరూ సుమనని తిడుతూ ఉంటారు. ఇక సుమన నోటికి వచ్చినట్లు విశాలాక్షిని అనడంతో ఎద్దులయ్య ఆవేశంగా కనిపిస్తాడు. ఇక మూర్ఖులు వినరని ఆ కొత్తిమీర కట్ట ఇచ్చేసేయ్ అని.. పోయేది కొత్తిమీర కట్టే కదా అని పావన మూర్తి అంటాడు. వెంటనే విశాలాక్షి కట్టే అయితే పరవాలేదు కానీ పొట్ట పోతే మళ్లీ మృత శిశువు పుడితే అనటంతో అందరూ షాక్ అవుతారు.
ఇక సుమన అంటే ఈ సారి కూడా ప్రాణం లేని బిడ్డను కంటాననా.. ఇప్పుడే బిడ్డను కని నువ్వు అన్న మాటలు పచ్చి అబద్దాలని నిరూపిస్తానని బలవంతంగా కొత్తిమీర వాసన పీల్చుకుంటుంది. ఇంట్లో వాళ్ళు వద్దని అరుస్తారు. అప్పుడే విశాలాక్షి తను ఎంత గాఢంగా పీల్చుకున్నా కూడా వాసన రాదు అని అనగా ఎందుకు రాదు అని తిలోత్తమా అడుగుతుంది. వెంటనే ఎద్దులయ్య.. మా అమ్మతో అంత పరుషంగా మాట్లాడినందుకు నాశకం పనిచేయటం మానేసింది అని అంటాడు.
దాంతో ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. ఇక సుమన ఎంత వాసన పీల్చుకున్న కూడా ఆ వాసన రాదు. తనకు వాసన రావట్లేదు అనటంతో.. మాకు వాసన తెలుస్తుంది నీకు వాసన ఎందుకు తెలియట్లేదు అని దురంధర అంటుంది. అప్పుడే సుమన ముక్కు నుండి రావటంతో అది చూసి తను స్పృహ కోల్పోతుంది. దాంతో అందరూ కంగారు పడతారు. బలంగా శ్వాస పీల్చుకున్నందుకు ఒత్తిడి వల్ల అలా జరిగిందని విశాలాక్షి అంటుంది.
ఆ తర్వాత సుమనను గదిలోకి తీసుకెళ్తారు. ఇక విశాలాక్షి నయనితో.. సుమన డెలివరీతో తనకు ఆనందం నీకు కలవరం మొదలవుతుంది జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత సుమన నిద్రలో బిడ్డ పుట్టింది అని లేచి నా బిడ్డ ఎక్కడ అని అంటుంది. వెంటనే విక్రాంత్ కల కంటున్నావ్ అని అంటాడు. ఇక తన నుదుట మీద విభూతి ఉండటంతో విభూతి ఎందుకు ఉంది అని సుమన అడుగుతుంది. అలా రాసినందుకే స్సృహాల్లోకి వచ్చావు అని అంటాడు.
ఇక సుమన విశాలాక్షి పై ఫైర్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా తన తల్లిపై కూడా ఫైర్ అవుతుండటంతో వెంటనే విక్రాంత్ కూడా అంతే కోపంతో తనకు సమాధానం ఇచ్చి అక్కడ నుంచి వెళ్తాడు. ఆ తర్వాత తిలోత్తమా, వల్లభ అఖండ స్వామి దగ్గరికి వస్తారు. సుమన డెలివరీ గురించి మాట్లాడుతారు. అంతేకాకుండా నయని, విశాల్ అడ్డు లేకుండా చేయమని అడుగుతుంది.
దాంతో స్వామి.. నయనికి మూగజీవులు సహాయం చేస్తున్నాయని.. ముఖ్యంగా పాము తనకు అండగా ఉందని అనటంతో మరి మార్గం ఏంటి అని తిలోత్తమా అడుగుతుంది. దాంతో స్వామి ఒక గరుడ వస్త్రాన్ని, పాలలో కలిపే పౌడర్ ని ఇచ్చి.. ఒక కుండలో పాలు పోసి అందులో ఈ పౌడర్ వేసి ఉంచితే అక్కడికి పాము వచ్చి కుండలోకి వెళ్తుందని.. వెంటనే పైన గరుడ వస్త్రాన్ని వేసి పాముని తీసుకొని రమ్మని అంటాడు. దాంతో తిలోత్తమా సరే అని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే తిలోత్తమా వల్లభ దగ్గర ఉన్న పౌడర్ తీసుకుంటుంది.
also read it: Janaki Kalaganaledhu August 19th: ఉగ్రవాది కిషోర్ ను అదుపులోకి తీసుకున్న జానకి.. సంతోషంగా శుభం కార్డు పలికించిన డైరెక్టర్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial