Janaki Kalaganaledhu August 19th: ఉగ్రవాది కిషోర్ ను అదుపులోకి తీసుకున్న జానకి.. సంతోషంగా శుభం కార్డు పలికించిన డైరెక్టర్?
ఉగ్రవాదిని జానకి పట్టుకోవడంతోపాటు సీరియల్ ముగియడంతో కూడా ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Janaki Kalaganaledhu August 19th: జానకి కారులో ఇంటికి వస్తూ ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని వెంటనే ఈ విషయం రామకు ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటుంది. మరోవైపు జ్ఞానంబ జానకి ఎప్పుడు ఇలాగే చేస్తుంది.. సమయానికి వస్తానని చెప్పి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు.. ఇప్పుడు కూడా రాలేదు.. అందుకే నేను పంపివ్వద్దు అనుకున్నాను. కానీ రామనే పంపించాడని గోవిందరాజులతో అంటుంది.
గోవిందరాజులు ఏం టెన్షన్ పడకు జానకి వస్తుందని అంటాడు. అప్పుడే రామ ఫోన్ కి జానకి ఫోన్ చేస్తుంది. ఇక ఆ ఫోన్ గోవిందరాజులు దగ్గర ఉండటంతో జ్ఞానంబ ఫోన్ తీసుకొని పక్కకు వెళ్లి మాట్లాడుతుంది. ఇక జ్ఞానంబ అందరూ నిన్నే అడుగుతున్నారు.. నేను కూడా నీ కోసమే ఎదురు చూస్తున్నాను త్వరగా రమ్మని అంటుంది. దానికి జానకి దారిలో ఉన్నానని చెబుతుంది. ఇక కిషోర్ తో వెన్నెల మెడలో తాళి కట్టించవద్దని అనటంతో జ్ఞానంబ ఆశ్చర్య పోతుంది.
ఇక జరిగిన విషయం మొత్తం జానకి తన అత్తతో చెప్పటంతో షాక్ లో ఉంటుంది జ్ఞానంబ. మరోవైపు కిషోర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి వచ్చిన జ్ఞానంబ అతని మాటలు విని అతడు నిజంగానే ఉగ్రవాదని తెలుసుకుంటుంది. ఇక నిజం తెలిసిపోయిందా అంటూ కిషోర్ అనడంతో వెంటనే జ్ఞానంబ అతడి చొక్కా పట్టుకోగా వెంటనే అతడు అక్కడున్న ఫ్లవర్ వాస్ తో జ్ఞానంబ తలపై కొడుతాడు.
ఇక తను చనిపోయిందనుకొని భయపడతాడు. ఎలాగైనా ఇప్పుడు వెన్నెలను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే రామ వచ్చి ఇంకా రెడీ కాలేదా అనటంతో.. ఇవి కూడా కొత్త బట్టలే అని రామను అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్తాడు. కిషోర్ వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోగా పెళ్లికూతురుని కూడా తీసుకొని రమ్మంటాడు పూజారి. జ్ఞానంబ కనిపించకపోయేసరికి గోవిందరాజులు అమ్మ ఎక్కడ రా అని రామను అడుగుతాడు.
ఇక్కడే ఎక్కడ ఉంటుందిలే అని రామ అంటాడు. ఇక జానకి తన అత్తయ్యకు నిజం చెప్పేశానని.. పెళ్లి ఆపేసి అతడిని గదిలో బంధించవచ్చని అనుకుంటుంది. ఇక పూజారి గోవిందరాజును బార్యతో సహా వచ్చి అక్కడ కూర్చోమని అంటాడు. ఇక కిషోర్ మాత్రం ముహూర్తం కి తొందర పెడుతూ ఉంటాడు. జ్ఞానంబ ఎక్కడ వెళ్ళింది అని అందరూ అయోమయంలో కనిపిస్తూ ఉంటారు.
జ్ఞానంబ కనిపించకపోయేసరికి టెన్షన్ పడతారు. ఇక పూజారి ముహూర్తం అయిపోతుంది మరో ముహూర్తం పెట్టాలా అని అనటంతో.. కిషోర్ మాత్రం ఇప్పుడే తాళి కడితే అయిపోతుందని అంటాడు. ఇక గోవిందరాజులు కూడా సరేలే కానివ్వమని అంటాడు. ఆ తర్వాత కిషోర్ వెన్నెల మెడల తాళి కడుతుండగా జానకి వచ్చి ఆపటంతో అందరూ షాక్ అవుతారు.
అతడు ఉగ్రవాదుల గ్యాంగ్ లీడర్ అని అతడు చేసిన తప్పులన్నీ చెబుతుంది జానకి. వెంటనే వెన్నెల అతడిని లాగి చంప పగలగొడుతుంది. అదే తాళిబొట్టు తీసుకొని అతని మెడకు గట్టిగా చుట్టుతుంది. ఇక జానకి ఆపగా వెన్నెల మాత్రం అతనిపై బాగా ఫైర్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో జ్ఞానంబ వెన్నెల దగ్గరికి వచ్చి తనను పట్టుకొని బాధపడుతుంది.
పెళ్లి జరగలేదు కదా అని.. ఈ దుర్మార్గుడు వెన్నెల మెడలో తాళి కట్టలేదు కదా అని అడగటంతో గోవిందరాజులు జరిగిన విషయం మొత్తం చెబుతాడు. వీడు గురించి జానకి నిజం చెప్పిందని ఇక వాడి దగ్గరికి వెళ్తే వాడు తనను పక్కకు తోసేయటంతో స్పృహ కోల్పోయాను అని చెబుతుంది. ఇక కొడుకు కోడళ్లు నీకేం కాలేదు కదా నీకోసం చాలా వెతికాము అని అంటుంటారు.
ఇక రామ కిషోర్ వైపు చూసి ఏంట్రా ఆ చూపు కళ్ళు పీకేస్తాను అని కోపంగా అంటాడు. జానకి కిషోర్ ను తీసుకెళ్లి జైల్లో వేస్తుంది. ఇక చీకటి పడ్డాక ఒక సభ ఏర్పాటు చేస్తారు. అందులో ఆఫీసర్ ఎస్పీ చాలాకాలంగా మన జిల్లాన్ని ఉగ్రవాదులు వెంటాడుతున్నారు అని.. ఇక జానకి వల్ల ఉగ్రవాదులు దొరికిపోయారని తనను పొగుడుతాడు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం తనకు అవార్డు ప్రకటించిందని చెప్పటంతో అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతారు. ఆ తర్వాత జానకి కుటుంబం ఒకరి తర్వాత ఒకరు వచ్చి వేదికపై జానకి గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. ఇక జ్ఞానంబ ఎప్పుడు కొడుకు గురించే చూశాను కానీ కోడలి గురించి చూడలేదు అని.. జానకి ఆశయాలను పట్టించుకోలేదు అని.. కానీ తన గొప్పతనం ఏంటో లోకానికి తెలిసేలాగా చేసింది అని పొగుడుతుంది.
అంతేకాకుండా జానకికి క్షమాపణలు చెప్పి.. అందరి అత్తలకు కోడలి పట్ల ప్రేమగా చూసుకోమని.. వారికి కూడా స్వేచ్ఛనివ్వమని కొన్ని డైలాగులు చెబుతుంది. ఇక జానకి కూడా తన అత్తమామలను అమ్మ నాన్నలతో పోలుస్తూ వారి గురించి గొప్పగా చెబుతుంది. ఇక ఎప్పటికీ తన ఫ్యామిలీకి అండగా ఉంటాను అని.. ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను అని చెబుతుంది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత కుటుంబమంతా సంతోషంగా గడుపుతున్న సన్నివేశాలు చూపించగా సీరియల్ శుభం కార్డు పలుకుతుంది.
also read it : Paluke Bangaramayena Serial : నత్తి ఉన్నా అమ్మాయి లాయర్ అయితే? - సరికొత్త సీరియల్ 'పలుకే బంగారమాయెనా' ప్రోమో చూశారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial