Paluke Bangaramayena Serial : నత్తి ఉన్నా అమ్మాయి లాయర్ అయితే? - సరికొత్త సీరియల్ 'పలుకే బంగారమాయెనా' ప్రోమో చూశారా?
నత్తి ఉన్నా.. సరిగ్గా మాటరాని అమ్మాయి లాయర్ అవ్వాలనుకుంటే.. నిజాయితీగా ఉంటూ ప్రాబ్లమ్స్ తెచ్చుకునే పోలీస్ కు ఆ అమ్మాయి పరిచయం అవ్వటంతో వారి మధ్య జరిగే కథే 'పలికే బంగారమాయేనా'?
![Paluke Bangaramayena Serial : నత్తి ఉన్నా అమ్మాయి లాయర్ అయితే? - సరికొత్త సీరియల్ 'పలుకే బంగారమాయెనా' ప్రోమో చూశారా? Paluke Bangaramayena new serial going stream in star maa full details inside Paluke Bangaramayena Serial : నత్తి ఉన్నా అమ్మాయి లాయర్ అయితే? - సరికొత్త సీరియల్ 'పలుకే బంగారమాయెనా' ప్రోమో చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/fb8f4b102435550339ac55d41e5bbbcd1692356905493768_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
paluke bangaramayena serial: సీరియల్స్ అంటేనే ఒక ఒక ఎమోషనల్ అని చెప్పాలి. అందుకే చాలామంది మహిళలు సీరియల్స్ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. పైగా సీరియల్స్ అన్ని ఒకే స్టోరీతో వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు సీరియల్స్ లలో విలన్స్ లదే పై చెయ్యి అన్నట్లుగా అనిపిస్తుంది. వీళ్ళ పని ఎప్పుడు అవతలి వాళ్ళని ఏడిపించడమే. కానీ కొన్ని సీరియల్స్ మాత్రం మంచి కంటెంట్ తో వస్తూ ఉంటాయి.
అంటే చదువు, పరువు, బాధ్యత అనే కాన్సెప్ట్ తో కూడా వస్తున్నాయి. చాలా వరకు ఇవి బాగా క్లిక్ అవుతున్నాయి. యువత కూడా ఇటువంటి కాన్సెప్ట్ ఉన్న సీరియల్స్ ను చూడడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఇటువంటి కాన్సెప్ట్ తో పలు సీరియల్స్ ప్రసారమవుతూ మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా సీరియల్ లను చూసి ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడంతో డైరెక్టర్లు కొత్త కథలతో ముందుకు వస్తున్నారు.
ప్రస్తుతం 'స్టార్ మా'లో మాత్రం చాలా వరకు మంచి కంటెంట్ ఉన్న స్టోరీస్ ప్రసారం అవుతున్నాయి. ఎక్కడ కూడా బోరింగ్ కొట్టించకుండా జనాలను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక త్వరలో 'మామగారు' అనే సీరియల్ కూడా కొత్త కాన్సెప్ట్ తో ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సీరియల్ త్వరలో స్టార్ మా లో ప్రసారం కానుంది. ఇక 'జానకి కలగనలేదు'కు త్వరలోనే శుభం కార్డు పడనుంది.
'జానకి కలగనలేదు' అనే సీరియల్ పరువు, బాధ్యత, చదువు అని ఇలా మూడు సమూహంతో ప్రసారమైంది. ఇక ఈ సీరియల్ చివరి దశకు చేరుకుంది. ఈ సీరియల్ పూర్తయిన వెంటనే 'మామగారు' సీరియల్ ప్రారంభం అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే త్వరలో మరో కొత్త సీరియల్ రావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఆ సీరియల్ ఏదో కాదు 'పలుకే బంగారమాయేనా'.
ఇక కొన్ని రోజుల నుండి ఈ 'పలుకే బంగారమాయేనా' సీరియల్ ప్రోమోస్ వస్తూనే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ కు నత్తి ఉంటుంది. ఇక ఆ నత్తి పోవడానికి తల్లి సంగీతం క్లాసులో జాయిన్ చేస్తుంది. కానీ ఆ సంగీతం టీచర్ కూడా తనకు నత్తి పోవడానికి సంగీతం పనికి రాదు అని అంటాడు. ఇక అప్పుడే తండ్రి వచ్చి తనకు నత్తి అన్న విషయం అందరికీ తెలియాలా? అంటూ.. కూతురిపై, భార్యపై ఫైర్ అవుతాడు.
కూతురు పెద్దది అయినా కూడా తండ్రి మాత్రం కూతురు మీద ఏ మాత్రం ప్రేమ చూపించడు. పైగా తనకు నత్తి కాబట్టి తను మాట్లాడుతుంటేనే చిరాకు పడుతుంటారు ఇంట్లో వాళ్ళు. కానీ మొదటిసారి తనను మాట్లాడమని అంటాడు హీరో. హీరో ఒక పోలీస్. ఇక అతడు మిస్సింగ్ కేసులను పట్టుకోలేకపోవటంతో పై ఆఫీసర్ తనపై అరుస్తూ ఉంటాడు.
కనీసం జేబుదొంగనైనా పట్టుకోమని అనడంతో.. ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. పైగా నత్తి తో బాధపడే అమ్మాయి లాయర్ అయితే ఇక తను కేసులను ఎలా డీల్ చేస్తుందో చూడాలి. అయితే తాజాగా ఈ సీరియల్ నుండి మరో ప్రోమో విడుదల అయింది. 'బ్రహ్మముడి' సీరియల్ హీరో మానస్ నాగులపల్లి (రాజ్ క్యారెక్టర్ చేసిన నటుడు) ఈ సీరియల్ హీరోను పరిచయం చేస్తాడు. తన బ్యాగు దొంగతనం చేసిన వాడిని పట్టుకొని బాగా కొడతాడు హీరో. వెంటనే రాజ్ అతడిని చూసి గుర్తుపడతాడు. ఇక అతడు తన చిన్నప్పటి ఫ్రెండ్ అభి అని.. తన నిజాయితే తనకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుందని.. అందుకు మీ బ్లెస్సింగ్స్ తీసుకోవటం కోసం పలికే బంగారమాయే సీరియల్ తో ముందుకు వస్తున్నాడు అని సీరియల్ గురించి ప్రమోట్ చేశాడు. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ అవుతుంది.
also read it : Janaki Kalaganaledhu August 18th: 'జానకి కలగనలేదు' సీరియల్: పెళ్లి హడావుడిలో జ్ఞానంబ కుటుంబం, ఉగ్రవాది కిషోర్ అని తెలుసుకున్న జానకి?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)