Guppedantha Manasu August 7th: 'గుప్పెడంత మనసు' సీరియల్ - రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు.. కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?
రౌడీలు రిషిని చంపడానికి ప్రయత్నించటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది తెలుసుకుందాం.
![Guppedantha Manasu August 7th: 'గుప్పెడంత మనసు' సీరియల్ - రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు.. కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర? Shailendra burning with anger in Guppedantha Manasu August 7th eposide Guppedantha Manasu August 7th: 'గుప్పెడంత మనసు' సీరియల్ - రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు.. కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/07/2889ec18e430e16302549e4c09686d251691379188036768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guppedantha Manasu August 7th: వసు రిషిని ఫాలో అవుతుండగా రిషి కారు వెనకాలే నలుగురు వ్యక్తులు ఫాలో అవ్వడాన్ని చూస్తుంది. ఇక అందులో గతంలో రిషిని అటాక్ చేసిన వ్యక్తి ఉండటంతో మళ్లీ ఎటాక్ చేయబోతున్నారేమో అని భయపడి వాళ్లని ఫాలో అవుతుంది. ఇక వాళ్ళు మిస్ అవ్వటంతో ఫోన్లో ఎవరికో మెసేజ్ పెట్టి తను చెప్పిన అడ్రస్ కి ఆటో డ్రైవర్ని తీసుకెళ్ళమని అంటుంది.
మరోవైపు శైలేంద్ర రౌడీలకు ఫోన్ చేసి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. రౌడీలు కూడా రిషి వస్తే చంపేయటమే అని చెబుతారు. ఇక శైలేంద్ర మాత్రం ఎలాగైనా చంపేయాలి అని ఎటువంటి సాకులు చెప్పకూడదు అని గట్టిగా హెచ్చరిస్తాడు. ఆ తర్వాత రౌడీలు ఫేక్ ప్రెగ్నెంట్ అని ఒక ఆవిడను రిషి వచ్చే దారిలో కూర్చోబెడతారు. ఇక రిషి కారు రాగానే అందులో ఒక రౌడీ తన చెల్లెలు ప్రెగ్నెంట్ అని పెయిన్స్ వస్తున్నాయని నాటకాలు ఆడటంతో అది నిజమని రిషి కంగారుపడి ఆమెను కారులో ఎక్కిద్దామని తీసుకొని వెళ్తుండగా ఆవిడ వెంటనే కత్తి తీసి పొడవబోతుంది.
వెంటనే రిషి ఆ కత్తిని పట్టుకుంటాడు. ఇక రౌడీలు వచ్చి రిషి ని పట్టుకుంటారు. ఇక నిద్రలో ఉన్న జగతి రిషికి ప్రమాదం జరుగుతుందని కల కని లేచి కంగారుపడుతుంది. ఏం జరిగింది అని మహేంద్ర అడగటంతో.. రిషి ప్రమాదంలో ఉన్నాడు అని అంటుంది. దాంతో మహేంద్ర ఏమి జరగదు కంగారు పడకు అని ధైర్యం ఇస్తాడు. ఇక రిషి అందులో ఉన్న ఒక రౌడీని గుర్తుకు పట్టి ఆరోజు అటాక్ చేయడానికి వచ్చిన వాడివి నువ్వే కదా మళ్లీ ఎందుకు వచ్చావు ఎవరు నువ్వు అని అడుగుతాడు.
ఇక ఆ రౌడీ నిన్ను చంపడానికి వచ్చాను అని అనటంతో అప్పుడే అక్కడికి పాండే తన ఫ్రెండ్స్ తోని రాగా ఆ రౌడీలను కొడతారు. వసు కూడా అక్కడికి వస్తుంది. ఇక మహేంద్ర వసు కు ఫోన్ చేసి రిషికి ఏమైనా జరిగిందా జగతి ఇక్కడ కంగారుపడుతుంది అని తను బాగానే ఉన్నాడు అని వీడియో కాల్ చేసి చూపిస్తుంది. శైలేంద్ర మనుషులకు ఫోన్ చేయడంతో ఆ ఫోను అక్కడే పడిపోవడంతో ఆ ఫోన్ రిషి తీసుకుంటాడు. వసు ను డ్రాప్ చేస్తాను అని చెప్పి తనతోని తీసుకొని వెళ్తాడు.
ఇక తనను కాపాడినందుకు థాంక్స్ చెబుతాడు. ఇంతకుముందు కూడా నిన్ను రక్షించాను అని అనటంతో ఆరోజు మీరు నన్ను రక్షించలేదు చంపేశారు అని నొప్పించే మాటలు అని అక్కడినుండి వెళ్ళిపోతాడు. దాంతో వసు చాలా బాధపడుతుంది. ఇక వసు బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళగా ఏం జరిగింది అని తన తండ్రి అడుగుతాడు. దాంతో తను సార్ ఎందుకు తనను అర్థం చేసుకోవడం లేదు అని ఆయన బాగుండాలనే కదా ఇలా చేస్తున్నాను అని తండ్రికి చెప్పకుంటూ బాధపడుతుంది.
also read it : Janaki Kalaganaledhu August 5th: భార్యకు బహుమతి ఇచ్చిన రామ.. వెన్నెలపై అనుమానం పెంచుకున్న జానకి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)