Satyabhama Serial Today January 15th: ‘సత్యభామ’ సీరియల్ : సత్యకు సంతకం చేస్తానన్న భైరవి – చక్రవర్తి కొడుకు కోడల్ని చంపేస్తానన్న మహాదేవయ్య
Satyabhama Today Episode: పంతులు చెప్పినట్టు చేయకపోతే శాపం మరింత పెరుగుతుందని భైరవి, సత్యకు సంతకం చేస్తాననడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Satyabhama Serial Today Episode: క్రిష్ తనను అదోలా చూస్తుంటే సత్య టెన్షన్ పడుతుంది. ఏంటి అనుమానంగా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. నా ప్లాన్ తెలిసిపోయిందా ఏంటి అని భయపడుతుంది. అప్పుడే పంతులు వస్తాడు. బల్లి శాస్త్రం ప్రకారం మృత్యుంజయ హోమం చేస్తే చాలా మంచిది అని చెప్తాడు. మహదేవయ్యను టెన్షన్ పెడుతుంది భైరవి..
భైరవి: అయ్యో పెనిమిటి నాకు మీరు లేకుండా నేను అసలు ఊహించుకోలేను.. మీరు లేకపోతే నా జీవితం ఏం కావాలి.? అయినా హోమం చేయడానికి ఏంటి మీకు అభ్యంతరం
మహదేవయ్య: సరే మీ ఇష్టం హోమం చేసుకోకపోతే జపం కూడా చేసుకోండి.
పంతులు: హోమమే కాదమ్మా ఇందులో ఇంకో చిక్కు కూడా ఉంది.
బైరవి: పంతులుగారు ఇంకా ఏదైనా సమస్య ఉందా..
పంతులు: సమస్య కాదమ్మా ఈ హోమం తర్వాత మీరు ఇంట్లోని ఆడవాళ్ళ కోరికలు తీర్చాలి.
భైరవి: అదేం పెద్ద భాగ్యం కాదు అలానే పంతులుగారు మీరు ముందు హోమం చేయించండి ఈ బల్లి గురించి నాకు టెన్షన్ పట్టుకుంది. ఎలాగైనా ముందు ఈ గండం తొలగిపోతే చాలు వాళ్ళ కోరికల్ని తీరుస్తాను.
అంటూ చెప్పి భైరవి, మహదేవయ్య ఇద్దరు కలిసి హోమం పూర్తి చేస్తారు.
ఇక హోమం పూర్తయింది కాబట్టి పంతులు చెప్పినట్టు ఇంట్లో ఆడవాళ్ల అందరి కోరికలు తీర్చాలి అంటుంది భైరవి. అందరినీ పిలిచి ఒక్కోక్కరిని కోరికలు అడుగుతుంది భైరవి.
భైరవి: అత్తయ్య మీకేం కావాలో కోరుకోండి..
అత్తయ్య: నాకు ఒక రామాయణం బుక్కు కావాలి.
భైరవి: రేణుక నీకు ఏం కావాలో కోరుకో
రేణుక: నాకు ఒక పట్టు చీర కావాలి
భైరవి: సరే నీకు ఎటువంటి పట్టు చీర కావాలంటే అటువంటి పట్టుచీర తీసుకోపో.. సత్య నువ్వు చెప్పు నీకు ఏ కోరిక ఉంది…?
సత్య: నాకు నామినేషన్స్ లో సంతకం పెట్టడానికి ఒక మనిషి కావాలి. మీరు ఆ సంతకం పెడతారా అత్తయ్య.
అని సత్య అడగ్గానే.. భైరవి మనసులో ఎటువంటి కోరిక కోరుకున్నావు సత్య అనుకుంటూ మళ్లీ పంతులు చెప్పిన ఎవరి కోరిక తీర్చకపోయినా శాపం పెరిగిపోతుందని పంతులు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని సత్య నీ కోరిక నేను తీరుస్తాను అంటూ సత్యకు మాట ఇస్తుంది భైరవి.
భైరవి: సంతకం మాత్రమే నీకు సత్య.. నా ఓటు మాత్రం నీకే పెనిమిటి
అంటూ మహాదేవయ్యకు చెప్తుంది భైరవి. సత్య హ్యాపీగీ ఫీలవుతుంది. మహాదేవయ్యా ఇరిటేటింగ్ గా చూస్తుంటాడు. మరోవైపు సంధ్యకు కాల్ చేస్తాడు సంజయ్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు.
సంధ్య: మనిద్దరి మధ్య దూరం పెరిగేలా ఉంది సంజయ్. మా అక్కకు ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు.
సంజయ్: నువ్వేం టెన్షన్ పడకు ఆఖరి నిమిషంలో నువ్వు హ్యాండ్ ఇచ్చేయ్.. ఆ తర్వాత మీ అక్కకు ఇంకొక మనిషి తగ్గుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్ను ఏమన్నా నేనున్నాను కదా చూసుకోవడానికి
అని సంధ్యను ఓదారుస్తాడు సంజయ్. మరోవైపు సత్య చక్రవర్తిని కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంది.. మీరు నాకు గనక సంతకం చేయకపోతే మీరే కృషి అసలు తండ్రి అని చెప్తానంటుంది. దీంతో భయపడ్డ చక్రవర్తి కూడా నేను సంతకం చేస్తానని అంటాడు. ఇక సత్య ప్లాన్ వర్కవుట్ అయిందని సంతకం చేయడానికి పది మంది దొరికేశారని క్రిష్ మనసులో అనుకుంటాడు. ఈరోజు ఎలాగైనా సరే ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. ఇంతలో సత్య వచ్చి ఎన్నికలు అయ్యేంత వరకు మన మధ్య దూరం ఉండాలని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!