Satyabhama Serial Today August 28th: సత్యభామ సీరియల్‌లో సీన్ రివర్స్- ఫీల్‌మై లవ్ అంటున్న సత్య- క్రిష్ మనసు మార్చే పనిలో తల్లి
Satyabhama Today Episode: ఇన్నాళ్లు ప్రేమ కోసం సత్య వెంట పడ్డ క్రిష్‌ను చూశారు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఫీల్ మై లవ్ అంటూ క్రిష్ణ వెంట సత్య పడుతోంది. దీంతో సీరియల్ ఆసక్తిగా మారింది.
Satyabhama Serial Today Episode: సత్య ప్రెగ్నెంట్ కాదని రచ్చ కావడంతో సత్య తల్లిదండ్రులు బాధత ఇంటికెళ్లిపోతారు. కుమార్తె సత్య జీవితం ఇలా అయిపోవడాన్ని చూసి తల్లిదండ్రులు చూసి జీర్ణించుకోలేపోతున్నారు. వద్దంటే కృష్ణను పెళ్లి చేసుకున్న సత్య ఇప్పుడు ఎందుకిలా చేస్తుందో అని అర్థం కాక తల పట్టుకుంటారు. ఇప్పటి వరకు అన్యోన్యయంగా ఉన్నారనుకుంటే కలిసి కాపురం చేయడం లేదని తెలిసి బాధేస్తోందని తల్లిదండ్రులు ఆవేదనలో మునిగిపోతారు. మనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న సత్య... ఇవన్నీ చెబితే బాధపడతామని ఇన్ని రోజులు చెప్పలేదని అనుకుంటారు. ఇప్పుడు ఈ విషయం అందరికి తెలిసిపోయిందని ఇక సత్యకు నిత్యం అత్తవారు నరకం చూపిస్తారని అక్కడ ఎలా ఉంటుందో అని తలుచుకొని బాధపడతారు.
సత్యతో మాట్లాడిన అమ్మమ్మ... హితబోధ చేస్తుంది. అసలు కృష్ణ విషయం నాకు కూడా చెప్పకుండా చాలా పెద్ద తప్పుచేశారని అంటుంది. ఏదో గొడవపడ్డారు అయినా కలిసి ఉన్నారే భ్రమలో నేను కూడా ఉన్నానని అంటుంది అమ్మమ్మ. లేని పెద్దరికం కొని తెచ్చుకొని మీకు సహాయం చేసినందుకు నాకు బాగా బుద్ధిచెప్పారని అంటుంది. దానికి అడ్డుపడ్డ సత్య మీరంటే గౌరవమని చెబుతుంది. అయితే ఇప్పటికైనా కృష్ణ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని చెబుతుంది. ఇకపై అయినా నీకు ఏం కావాలో తెలుసుకోమంటుంది. అలా తెలుసుకోలేనప్పుడు దేవుడు కూడా నిన్ని ఏం చేయలేడని క్లాస్ పీకుతుంది. క్రిష్ణ ఏమైనా తిట్టాడా అని అడుగుతుంది అమ్మమ్మ. లేదని చెబుతుంది సత్య. ఎప్పుడైన వేధించాడా అని ప్రశ్నిస్తుంది. లేదనే సమాధానం చెబుతుంది. మీ తల్లిదండ్రులను ఏమైనా అంటున్నారా అని అడుగుతుంది. తనకంటే బాగా చూసుకుంటాడని అంటుంది. అలాంటప్పుడు ఇంకా ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. నీకు నచ్చనప్పుడు కృష్ణ ఎలా పోయినా ఫర్వాలేదు.. కానీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందో ఆ నిర్ణయం తీసుకోమంటోంది.
అమ్మమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమె చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. ఇక ఆలస్యం చేస్తే లాభలేదని నా మనసులో కృష్ణ ఉన్న మాట చెప్పేయాలని అనుకుంటుంది.
అలా క్రిష్ దగ్గరకు సత్య వెళ్లేసరికి ఫోన్ మాట్లాడుతుంటాడు. ఆనందంతో నిన్ను హత్తుకోవాలని ఉందని, ఇన్నాళ్లు ఆపుకున్న ప్రేమను తెలియజేయాలని ఉందని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో క్రిష్ణ వచ్చి.. ఏంటని అడుగుతాడు. ఆనందంతో నిండిన మొహంతో నీకో శుభవార్త చెప్పాలని అంటుంది సత్య. నేనూ నీకో శుభవార్త చెప్పాలని అంటాడు క్రిష్ణ. ముందు నువ్వే చెప్పు అని క్రిష్ణను అడుగుతుంది. మరో వారం రోజుల్లో మన విడాకుల కేసు హియరింగ్‌కు వస్తుందని అంటాడు క్రిష్ణ. అది విన్న సత్య కళ్లు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోతాయి. విడాకులకు పెద్దగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదని రెండు వారాల్లో ప్రోసెస్ పూర్తి అవుతుందని చెబుతాడు.
Also Read: విశాల్ కు వైద్యం చేసిన గజగండ – ఏం అనర్థం జరగబోతుందేనని హెచ్చరించిన గురువు
ఇన్నాళ్లు అందర్నీ ఒప్పించేందుకు కలిసి ఉండేందుకు చాలా ఇబ్బంది పడ్డావని.. ఇప్పుడు నీకు ఆ అవసరం లేదని స్వేచ్ఛంగా ఉండొచ్చని చెబుతాడు కృష్ణ. ఉబికి వస్తున్న కన్నీళ్లను దాచుకొని సత్యను ఫేస్ చేయలేక వెనక్కి తిరిగి ఎమోషనల్‌గా మాట్లాడతాడు. అటు సత్య కూడా అటు తిరిగి కన్నీళ్లు తుడుచుకొని కృష్ణ మాట్లాడ వింటూ ఉంటుంది. ఇక్కడ సీన్ ప్రేక్షకుల గుండెలను పిండేసేలా డిజైన్ చేశారు.
నేను లేక నువ్వు ఉండగలవా అని అడుగుతుంది సత్య. కొన్నిసార్లు మన తప్పు చేయకున్నా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అదే పొజిషన్‌లో నేను ఉన్నానని అంటాడు. దోషులు భరించగలరా లేదా అని అడిగి శిక్షలు వేయరు కదా అంటాడు. దోషి అని ఎవరు అన్నారని అడుగుతుంది. నీతో విడిపోవాలని లేదని జీవితాతం కలిసి ఉండాలని తన ప్రేమను చెబుతుంది.
Also Read: మనీషాకు అన్నం తినిపించిన మిత్ర – లక్ష్మీ చేతికి కట్టు చూసి అనుమానించిన జున్ను
తల్లిదండ్రులు బాధపడతారనే ఇలా చెబుతున్నావని ఆ అవసరం నీకు లేదని సత్యకు సమాధానం చెప్తాడు కృష్ణ. నిజంగానే ప్రేమిస్తున్నాని అంటున్నా వినిపించుకోడు. కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. క్రిష్ణ సమాధానంతో షాక్ అవుతుంది సత్య. ఒక్కప్పుడు నీవు ప్రేమిస్తే నేను తిరస్కరించాను. ఇప్పుడు నేను ప్రేమిస్తే నువ్వు కాదంటున్నావ్. నా ప్రేమ పొందేందుకు నీవు ఎన్ని చేశావో నీ ప్రేమ పొందడానికి నేను అన్ని కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధమని చెబుతుంది.
ఇవన్నీ గోడ చోటుగా ఉంటూ వింటున్న క్రిష్ణ తల్లి... సత్య మాటలకు షాక్ అవుతుంది. వెళ్లిపోతుందని అనుకుంటున్న సత్య మళ్లీ ప్లేట్ ఫిరాయించడాన్ని తట్టుకోలేకపోతుంది. ఇదే విషయాన్ని పని మనిషి వద్ద చెప్పుకొని గిలగిల కొట్టుకుంటుంది. అయితే దాని ప్రేమను కాదని ఇంటి నుంచి తరిమేసేలా క్రిష్ణకు లేని పోనివి చెబుతానని అంటుంది. ఇద్దరూ విడాకులు తీసుకునేలా చేస్తానని శపథం చేస్తుంది. తర్వాత రోజు వంట చేసేందుకు వంటగదికి వెళ్లిన సత్య కాలికి గాయమైంది. అక్కడ జరిగిన రొమాంటిక్ సీన్ చూసిన తల్లి కుళ్లుకుంటుంది.
Also Read: శౌర్య జబ్బు గురించి తెలుసుకున్న అనసూయ – ఊరిలో ఇల్లు అమ్మేస్తానన్న నర్సింహ
Also Read: లోపలి నుంచి సమాచారం ఇచ్చిన అంజు – అంజు తెలివికి షాక్ అయిన జేడీ
Also Read: సంధ్యను కిడ్నాప్ చేసిన రాకేష్ మనుషులు – కిడ్నాపర్లను పట్టుకుంటామన్న శంకర్
Also Read: కీర్తిని స్టోర్ రూంలో బంధించిన నిషిక – కౌషికిని కస్టడీలోకి తీసుకుంటామన్న పోలీస్
Also Read: రేవతి, కిరణ్ పెళ్లి చేస్తానని సీత శపథం - మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటీ? రామ్ ఏమన్నాడు?