Chiranjeevi lakshmi sowbhagyavati Serial Today August 28th: ‘చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి’ సీరియల్: మనీషాకు అన్నం తినిపించిన మిత్ర – లక్ష్మీ చేతికి కట్టు చూసి అనుమానించిన జున్ను
Chiranjeevi lakshmi sowbhagyavati Today Episode: మనీషా అనుకున్నట్లుగానే మిత్ర భోజనం తీసుకెళ్లి తినిపించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Chiranjeevi lakshmi sowbhagyavati Serial Today Episode: మనీషా తన చేతికి కట్టుకున్న బ్యాండేజ్ చూసుకుంటూ మిత్రను గుర్తు చేసుకుంటుంది. దేవయాని వచ్చి ఆశ ఉండొచ్చు కానీ మరీ అత్యాశ ఉండొద్దని చెప్తుంది. మీకు అంత డౌట్ ఉంటే కిందకు వెళ్లి నేను చెప్పింది చెప్పండి చాలు అంటుంది. సరేనని దేవయాని వెళ్లిపోతుంది. మిత్ర నాకోసం భోజనం తీసుకొస్తాడు. తనే తన చేతులతో నాకు భోజనం తినిపిస్తాడు. అదే చేయితో తాళి కూడా కడతాడని అనుకుంటుంది. మరోవైపు అందరూ భోజనం చేస్తుంటే జానును కూడా భోజనం చేయమంటుంది అరవింద. అయితే సంయుక్త చేతికి గాయం అయ్యింది కదా? తను తిన్నాకా తింటానని చెప్పగానే మీ చేతికి దెబ్బ ఎలా తగిలింది అని మిత్ర అడుగుతాడు. ఏదో ఒకటి చెప్తారు. ఇంతలో దేవయాని వచ్చి మనీషా కు తగిలిన గాయంతో పోలిస్తే సంయుక్త గాయం పెద్దదేం కాదు కదా? అంటుంది.
మిత్ర: మనీషా ఎక్కడ పిన్ని
దేవయాని: నిన్ను కాపాడబోయి తన చేతికి గాయం అయింది కదా. పైన నొప్పితో బాధపడుతుంది. చేతికి కట్టుతో అన్నం తినలేదు కదా? అందరం తిన్నాకా నేనే భోజనం తీసుకెళ్లి తినిపిస్తాను.
జయదేవ్: మిత్ర ఏం ఆలోచిస్తున్నావు.
మిత్ర: నా కోసం గాయపడిన మనీషా తినకుండా నేను తినడం కరెక్టు కాదు డాడ్.
అరవింద: ఎక్కడికి మిత్ర భోజనం ముందు నుంచి లేవకూడదురా..
మిత్ర: మనీషాకు భోజనం తీసుకెళ్తున్నాను అమ్మా..
అని మిత్ర భోజనం తీసుకుని పైకి వెళ్తాడు. దీంతో సంయుక్త ఏడుస్తూ వెళ్లిపోతుంది. జాను వచ్చి ఓదారుస్తుంది. మరోవైపు మనీషాకు భోజనం తీసుకెళ్లిన మిత్ర దగ్గర అమాయకంగా నటిస్తుంది మనీషా. మిత్ర భోజనం ప్లేట్ ఇవ్వగానే తినబోయి ప్లేట్ కిందపడేలా చేస్తుంది మనీషా. దీంతో మిత్ర ప్లేట్ తీసుకుని నేను తినిపిస్తాను తిను అని మిత్ర తన చేతితో మనీషాకు భోజనం తినిపిస్తాడు. ఇదంతా పైనుంచి చూస్తు్న్న సంయుక్త బాధపడుతుంది. భోజనం అయిపోయాక..
మనీషా: థాంక్యూ వెరీమచ్..
మిత్ర: కేర్‌ఫుల్ మనీషా.. నీ చేతికి గాయం అయ్యింది.
మనీషా: నా మీద నువ్వు చూపించిన ప్రేమ చూసి నా నొప్పంతా మర్చిపోయాను మిత్ర.
మిత్ర: టేక్ కేర్..
మనీషా: ఇప్పుడు చెప్తాను దీని సంగతి ( అని మనసులో అనుకుని పైన ఉన్న సంయుక్త దగ్గరకు వెళ్తుంది.) ఎలా ఉంది మనీషా మిత్రల ప్రేమయాణం. మిస్ సంయుక్త అలియాస్ మిస్సెస్ లక్ష్మీ.
సంయుక్త: ఎక్స్‌కూజ్ మీ..
మనీషా: అంత యాక్టింగ్ వద్దు. నువ్వు లక్ష్మీ అని నాకు తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే మిత్ర నాకు బాగా దగ్గరయ్యాడు. నా చేతికి ఈ కట్టు కట్టింది తనే.. నీ మెడలో తాళి కట్టబోయేది తనే..
సంయుక్త: ఆ పెళ్లి జరగదు మనీషా..
మనీషా: ఏం నువ్వే లక్ష్మీ అని నిజం చెప్పి అడ్డు పడతావా?
సంయుక్త: లక్ష్మీ సీత లాంటిది అయితే మిత్ర రాముడి లాంటోడు. వాళ్ల మధ్య మరో మనిషికి స్థానం లేదు.
మనీషా: ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట నువ్వే లక్ష్మీ అని ఒప్పేసుకోవచ్చు కదా?
అని సంయుక్తను తిట్టి వెళ్లిపోతుంది మనీషా.. తర్వాత జున్ను కృష్టుడి వేషం వేసుకుని ఉంటాడు. అర్జున్ చాలా బాగా ఉన్నావని ముద్దిస్తాడు. నేను ఎలా ఉన్నా అమ్మ లేదని బాధపడతాడు జున్ను ఇంతలో లక్ష్మీ వస్తుంది. జున్ను హ్యాపీగా ఫీలవుతాడు. లక్ష్మీని హగ్ చేసుకుని ఎమోషనల్ గా ఫీలవుతాడు. తర్వాత మిత్రకు జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తాడు. అంకుల్ ను కాపాడబోయి సంయుక్త చేతికి దెబ్బ తగిలిందని చెప్తాడు. దీంతో లక్ష్మీ తన చేతిని కొంగుతో దాచుకుంటుంది. ఇంతలో జున్ను లక్ష్మీ చేతికి ఉన్న కట్టు చూసి షాక్ అవుతాడు. నిన్న సామ్ ఆంటీ చేతికి కూడా సేమ్ కట్టు చూశాను. అంటే నువ్వే సామ్ ఆంటీవా? అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: శౌర్య జబ్బు గురించి తెలుసుకున్న అనసూయ – ఊరిలో ఇల్లు అమ్మేస్తానన్న నర్సింహ
Also Read: లోపలి నుంచి సమాచారం ఇచ్చిన అంజు – అంజు తెలివికి షాక్ అయిన జేడీ
Also Read: సంధ్యను కిడ్నాప్ చేసిన రాకేష్ మనుషులు – కిడ్నాపర్లను పట్టుకుంటామన్న శంకర్
Also Read: కీర్తిని స్టోర్ రూంలో బంధించిన నిషిక – కౌషికిని కస్టడీలోకి తీసుకుంటామన్న పోలీస్
Also Read: రేవతి, కిరణ్ పెళ్లి చేస్తానని సీత శపథం - మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటీ? రామ్ ఏమన్నాడు?
ALSO READ: మణియం పిళ్ల రాజు వేధింపులు నిజమే, మిను మునీర్ కు గాయత్రి వర్ష సపోర్టు