Karthika deepam 2 Serial Today August 28th: ‘కార్తీకదీపం 2’ సీరియల్: శౌర్య జబ్బు గురించి తెలుసుకున్న అనసూయ – ఊరిలో ఇల్లు అమ్మేస్తానన్న నర్సింహ
Karthika deepam 2 Today Episode: శౌర్యకు ఉన్న జబ్బు గురించి కార్తీక్ చెప్పగానే అనసూయ బాధపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Karthika deepam 2 Serial Today Episode: అనసూయ తానే స్వయంగా వెళ్లి శౌర్యకు మందులు తీసుకొస్తానని దీప డబ్బులు ఇస్తానన్న వద్దని తన దగ్గర ఉన్నాయని వెళ్తుంటే దీప హ్యాపీగా ఫీలవుతుంది. అనసూయలో వచ్చిన మార్పుకు సంతోషిస్తుంది. తర్వాత శౌర్య మందుల కోసం మెడికల్ షాపుకు వెళ్లిన అనసూయ అనుమానం వచ్చి ఆ మందులు ఎందుకు వాడతారని అడుగుతుంది. దీంతో ఇవి చిన్నపిల్లల గుండె జబ్బులకు వాడతారని షాపతను చెప్తాడు.
దీంతో అనసూయ షాక్ అవుతుంది. ఇంతలో అనసూయకు నర్సింహ ఎదురుపడతాడు. తనకు డబ్బులు అర్జెంట్ గా అవసరం ఉందని ఊరిలో ఉన్న ఇల్లు అమ్మేద్దామని ఊరికి వెళ్దామని అనసూయతో అంటాడు. అయితే అనసూయ అందుకు ఒప్పుకోదు. ఆ ఇల్లు తన తమ్ముడిది అని అది దీపకు మాత్రమే దక్కాలి అని చెప్తుంది అనసూయ.
నర్సింహ: ఇల్లు నాకు రాసివ్వకపోతే ఊరుకుంటానా? ఏ అర్థరాత్రో వచ్చి నా కూతురిని ఎత్తుకుపోతాను.
కార్తీక్: శౌర్య జోలికి వస్తే మర్యాదగా చెప్పడానికి నేను దీపను కాదు.
అనసూయ: ఓరే పాపిస్టోడా? ఇంకెన్ని రోజులు దీపను బాధపెడతావురా?
నర్సింహ: అయితే నువ్వు నీ కోడలు ఇద్దరు కలిసిపోయారన్నమాట.
అనసూయ: అవునురా.. నేనిప్పుడు దీప దగ్గరే ఉన్నాను. కానీ ఆ ఇల్లు మాత్రం నీకు దక్కనివ్వను.
నర్సింహ: ఆ ఇంటిని నన్ను దాటి మీరు ఎలా కాపాడుకుంటారో నేను చూస్తాను.
అంటూ వెళ్లిపోతాడు. ఇక అనసూయ, శౌర్యకు ఏమైందని కార్తీక్ ను అడుగుతుంది.
కార్తీక్, శౌర్య పరిస్థితి చెప్పడంతో అనసూయ షాక్ అవుతుంది. శౌర్య అతిగా భయపడితే తన గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని... అందుకే తను పరిగెత్తే ఆటలు ఆడకూడదని.. దేనికి ఎక్కువగా భయపడకూడదని.. ఎక్కువగా ఏడ్వకూడదని చెప్తాడు. కార్తీక్ మాటలకు అనసూయ ఏడుస్తుంది. మరోవైపు కాశీ, స్వప్న రోడ్డు మీద వెళ్తుంటారు. అప్పుడే అటుగా వెళ్తున్న శ్రీధర్ వాళ్లను చూస్తాడు. వారి వెనుకే ఫాలో అవుతూ వారు ప్రేమించుకుంటున్నారని నిర్ధారణకు వస్తాడు. మరోవైపు శౌర్య గురించి దీపకు చెప్పొద్దని అనసూయకు చెప్తాడు కార్తీక్.
కార్తీక: దీప బతకడానికి ఒకే ఒక్క కారణం శౌర్య. తన జీవితం నుంచి దేవుడు అన్నీ లాగేసుకున్నాడు. కానీ తను మాత్రం శౌర్య కోసమే బతుకుతుంది. శౌర్యకు గుండె సమస్య ఉందని తెలిస్తే ముందు దీప గుండె ఆగిపోతుంది.
అనసూయ: ఇలా తెలియకుండా ఎన్నాళ్ళు దాస్తారు బాబు.
కార్తీక్: ఎన్నాళ్లు దాస్తాను అంటే దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ నేను ఉన్నంత కాలం శౌర్యను జాగ్రత్తగా చూసుకుంటాను.
అనసూయ: ఇంత అపేక్ష చూపించడానికి మీరు దీపకు ఏమవుతారు. దీపను నేనే పెంచాను. తను నాకు మేనకోడులు.. అయినా నేను ఇంత ప్రేమ చూపించలేదు. అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీలాంటి చెట్టు అండ దొరికింది.
కార్తీక్: నేను ఇదంతా శౌర్య కోసం చేస్తున్నాను. తనను చూస్తే నాకు చాలా దగ్గర మనిషిగా అనిపిస్తుంది. అది నవ్వితే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. శౌర్య మంచి స్థాయికి ఎదిగే వరకు అండగా ఉండాలని అనిపిస్తుంది.
అనసూయ: అదే ఎందుకని అలా అనిపిస్తుంది.
కార్తీక్: కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. దీప మంచితనం, నిజాయతీ చూసి వారికి శ్రేయోభిలాషిలా ఉన్నాను.
అనసూయ: ఒకానొక సమయంలో నేను మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. చంటి దాని గురించి ఇంకేమైనా దాస్తున్నారా?
కార్తీక్: లేదు కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితిలోనూ దీపకు తెలియకూడదు.
అని కార్తీక్ చెప్తుంటే అప్పుడే దీప వస్తుంది. ఏంటి తెలియకూడదు అంటున్నారు అని అడుగుతుంది. ఇంతలో అనసూయ శౌర్య గురించి చెప్పబోతుంటే కార్తీక్ అడ్డుపడతాడు. వెంటనే అనసూయ ఊర్లో ఇల్లు కోసం నర్సింహ చేసిన గొడవ గురించి చెప్తుంది. ఆ ఇంటిని వెంటనే దీప పేరు మీద రిజిస్టర్ చేయించండి అని కార్తీక్ చెప్తాడు. దీప ఒప్పుకోదు. కానీ అనసూయ రేపే వెళ్లి ఆ పని చేద్దామని చెప్తుంది. తర్వాత కార్తీక్, దీప క్లోజ్ గా మాట్లాడుకోవడం జ్యోత్స్న చూస్తుంది. కోపంతో రగిలిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘జగధాత్రి’ సీరియల్: కీర్తిని స్టోర్ రూంలో బంధించిన నిషిక – కౌషికిని కస్టడీలోకి తీసుకుంటామన్న పోలీస్