అన్వేషించండి

Jagadhatri Serial Today August 28th: ‘జగధాత్రి’ సీరియల్‌: కీర్తిని స్టోర్ రూంలో బంధించిన నిషిక – కౌషికిని కస్టడీలోకి తీసుకుంటామన్న పోలీస్

Jagadhatri Today Episode: కౌషికిని మళ్లీ జైలుకు పంపించేందుకు దివ్యాంక, నిషిక, వైజయంతి ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  దివ్యాంక కౌషికి నెల తప్పడంపై తప్పుగా మాట్లాడటంతో సురేష్‌, దివ్యాంకను కొట్టి చంపేస్తానని వార్నింగ్‌ ఇస్తాడు. ఇంకోసారి నా భార్యను ఏమైనా అన్నా అవమానించినా ప్రాణాలతో వదలను. కౌషికి నా భార్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేనే తండ్రిని. ఇక్కడ అందరికీ వినిపించిందా? అంటాడు సురేష్‌. లైఫ్‌ లో ఇంకెప్పటికీ మర్చిపోలేనంత గట్టిగా వినిపించి ఉంటుంది అన్నయ్యా అంటుంది ధాత్రి. తర్వాత సురేష్‌, దివ్యాంకక వార్నింగ్‌ ఇచ్చి కౌషికిని తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు. దివ్యాంక ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. ధాత్రి, కేదార్‌ వెటకారంగా దివ్యాంకకు బర్తుడే విషెష్‌ చెప్పి వెళ్లిపోతారు. తర్వాత రూములో కూర్చున్న కౌషికి, పరంధామయ్య, దివ్యాంక మాటలను గుర్తు చేసుకుంటుంది.

ధాత్రి: ఏంటి వదిన ఆ దివ్యాంక అన్న మాటలకు బాధపడుతున్నారా?

కేదార్‌: అయినా బావ ఆ దివ్యాంకకు బాగా బుద్ది చెప్పాడు కద అక్క.

కౌషికి: ఈ బాధ ఈ కన్నీళ్లు నన్ను అన్నందుకు కాదు. ఇంకా ప్రాణం పోసుకోని నా బిడ్డను అన్నందుకు.

ధాత్రి: వదిన బాబాయ్‌ తాగిన మత్తులో మాట్లాడిన మాటలు అవి. ఇక దివ్యాంక చిన్న అవకాశం దొరికినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడుతుంది.

 అంటూ ధాత్రి, కేదార్‌ ఇద్దరూ కలిసి కౌషికిని ఓదారుస్తారు. మీకోసం కాకపోయినా మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా మీరు హ్యాపీగా ఉండాలని చెప్తారు. మరోవైపు వైజయంతి రూంలో కూర్చున్న దివ్యాంక సురేష్‌ ఇచ్చిన వార్నింగ్‌ గుర్తు చేసుకుంటు బాధపడుతుంటారు.

బూచి: నలుగురి మధ్య అవమాన పడి.. నాలుగు గోడల మధ్య చావడం.

వైజయంతి: వాళ్లిద్దర్ని విడగొడతానని వచ్చి సురేష్‌ నీతో తెగదెంపులు చేసుకునేలా చేశావు అమ్మి.

దివ్యాంక: వద్దనుకున్నా వదిలేసినా నేను చేయాలి కానీ సురేష్‌ కాదు ఆంటీ. నాతో నిశ్చితార్థం దాకా వచ్చి ఇప్పుడు వద్దు కాదు అంటే నేను ఊరుకుంటానా?

బూచి: ఊరుకోక వెళ్లి కొట్టించుకుని వస్తావా? ఏంటి? సారీ మైండ్‌ వాయిస్‌ బయటకు వచ్చేసింది.

వైజయంతి: ఆ తలతిక్క ఎదవ మాటలు మనకెందుకు కానీ ముందు చేజారిన పరిస్థితిని మళ్లీ మన చేతుల్లోకి వచ్చేలా చేయండి.

 అని వైజయంతి చెప్పగానే మనం అనుకున్నది జరగాలంటే మళ్లీ కౌషికి జైలుకు వెళ్లేలా చేయాలని ప్లాన్‌ చేస్తారు. మరోవైపు సురేష్‌ హాల్‌ లో కూర్చుని ఆలోచిస్తుంటాడు. కీర్తి బెలూన్స్‌ తో ఆడుకుంటుంది.  కీర్తిని స్టోర్‌ రూంలో వేసి బయట లాక్‌ చేస్తారు. అలాగే హాల్‌ లో ఉన్న వాచ్‌ టైం చేంజ్‌ చేస్తారు నిషిక, వైజయంతి. మరోవైపు రూంలో కీర్తి ఏడుస్తుంది.

నిషిక: అత్తయ్యా ఇప్పుడు మీరు వెళ్లి డ్రామా స్టార్ట్‌ చేయండి..

వైజయంతి: అమ్మా కీర్తి.. బాబు సురేష్‌.. కీర్తి ఎక్కడ జ్యూస్‌ తాగే టైం అయ్యింది.   

సురేష్‌: ఇక్కడే ఉండాలే.. కీర్తి..కీర్తి..

ధాత్రి: ఏమైంది..?

వైజయంతి: అమ్మీ జగధాత్రి కీర్తిని చూశావా?

ధాత్రి: లేదే..

సుధాకర్‌: ఏమైంది.. వైజయంతి?

వైజయంతి: బావా కీర్తి కనిపించడం లేదు బావ.

కౌషికి: కనిపించకపోవడం ఏంటి? నేను రూంలోకి వెళ్లినప్పుడు కూడా ఇక్కడే ఆడుకుంటుంది కదా?

 అని కౌషికి కంగారుపడుతుంది. వైజయంతి అందరూ వెతకండి అని చెప్తుంది. బూచి తాను స్టోర్‌ రూం సైడ్‌ వెళ్లి వెతుకుతాను అంటాడు. తలా ఒకవైపు వెళ్లి వెతుకుతారు. అందరూ కీర్తి ఎక్కడా కనిపించడం లేదని కంగారుపడతారు. ఇంతలో సురేష్‌ టైం అవుతుంది నువ్వు స్టేషన్‌ కు వెళ్లి సైన్‌ చేసిరా అంటాడు. ఇంకా రెండు గంటల టైం ఉంది కదా అని వైజయంతి చెప్తుంది. ధాత్రి, కేదార్‌, కీర్తిని వెతుక్కుంటూ  బయటకు వెళ్తారు. నిషిక, వైజయంతి ఇంకో అరగంట అయితే పోలీసులే వచ్చి కౌషికిని తీసుకెళ్తారు అని హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో ధాత్రి, వైజయంతి ప్లాన్‌ ను కనిపెట్టి లోపలికి రాగానే

కౌషికి: జగధాత్రి కీర్తి కనిపించిందా?

ధాత్రి: ఇంట్లోనే ఉంది మేము వెళ్లి తీసుకొస్తాము..

వైజయంతి: ఏంటమ్మీ.. ఇలా జరిగింది.. అయ్యో..

 అని వైజయంతి, నిషిక టెన్షన్‌ పడుతుంటారు ధాత్రి, కేదార్‌ కీర్తిని స్టోర్‌ రూం నుంచి  తీసుకుని వస్తారు. ఇంతలో కానిస్టేబుల్‌ వచ్చి కౌషికిని కస్టడీలోకి తీసుకోమ్మని మా ఎస్సై గారు చెప్పారని అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మనుకు నిజం చెప్పిన వసుధార – రిషి కోసం సిటీకి వచ్చిన రాధమ్మ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Embed widget