Guppedantha Manasu: ‘గుప్పెడంత మనసు’ ప్రోమో: పతనమవుతున్న DBST కాలేజ్, రిషిధారా ఎంట్రీతో కీలక మలుపు?
డిబిఎస్టి కాలేజీ తీరును మార్చటానికి రిషిధారా రంగంలోకి దిగటంతో కథ ఆసక్తిగా మారుతుంది. మరి రిషి రాకతో కాలేజీ మార్పు చెందుతుందా లేదా చూడాలి.
Guppedantha Manasu: స్టార్ మాలో గుప్పెడంత మనసు సీరియల్ గత కొంత కాలం నుండి ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. కథపరంగానే కాకుండా పాత్రల పరంగా కూడా ఈ సీరియల్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. తల్లికొడుకు మధ్య వచ్చిన అపార్థాల నేపథ్యంలో, చదువు నేపథ్యంలో వచ్చిన ఈ సీరియల్ కాన్సెప్ట్ అందర్నీ బాగా ఫిదా చేసింది.
మొదటినుంచి ఒకటే కథతో రన్నింగ్ కాకుండా మధ్య మధ్యలో ప్రేమ, ఎమోషనల్, చదువు వంటి సన్నివేశాలతో అద్భుతంగా చూపించాడు డైరెక్టర్. చెప్పాలంటే మొదటి నుంచి ఇప్పటివరకు ఈ సీరియల్ బోరింగ్ అనే ముద్రనే వేసుకోలేదు. మధ్యలో రిషి, వసు ల మధ్య ప్రేమ పుట్టించినట్లే పుట్టించాడు. కానీ ఏ రోజు కూడా వారి మధ్య ప్రేమ ప్రేమగా సాగలేదు. దీంతో ఇద్దరు విడిపోయారు. ఇప్పటికి వారి మధ్యలో ప్రేమ ఉన్నప్పటికీ కూడా అది చూపించుకోవడం లేదు.
ఇక మధ్యలో రిషి అన్నయ్య అయిన శైలేంద్ర ఎంట్రీ తో సీరియల్ కథ మొత్తం అడ్డం తిరిగింది. అతని రాకతో అన్ని గొడవలు ముంచుకొచ్చాయి. తమ్ముడని కూడా చూడకుండా రిషిని చంపడానికి ప్రయత్నించాడు శైలేంద్ర. దీంతో జగతి, వసు శైలేంద్ర అసలు రూపాన్ని తెలుసుకొని రిషి ని కాపాడే ప్రయత్నం చేశారు. రిషి ని డిబిఎస్టి కాలేజీలో లేకుండా చేశారు. దీంతో రిషి వాళ్ళను అపార్థం చేసుకొని వారికి పూర్తిగా దూరంగా ఉండటం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళాడు.
ఆ తర్వాత మరో కాలేజీకి వెళ్లి అక్కడ బాధ్యతలు చేపట్టాడు. డిబిఎస్టి కాలేజీలో రిషి లేకపోయేసరికి కాలేజీలో చాలా మార్పులు వచ్చాయి. స్టూడెంట్స్ అంత తప్పుదారికి అలవాటు పడ్డారు. కాలేజీ రూల్స్ మొత్తం మారిపోవటంతో భూషణ్ ఫ్యామిలీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో కాలేజీని మళ్లీ మంచి దారిలోకి తీసుకురావడానికి రిషి రంగంలోకి దిగడం ఖాయమని తెలుస్తుంది.
తాజాగా ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. అందులో న్యూస్ పేపర్ ప్రకటనలో కాలేజీ గురించి వచ్చిన ప్రకటన చూసి వసు రిషి తో కాలేజీ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉంది అని.. దానికి మీరే ఏదో ఒకటి చేయాలి అని అనటంతో అక్కడ జగతి మేడం ఉంది అనే రిషి అంటాడు. కానీ మీరు ఆ కాలేజీకి ఎండీ అని.. ఇప్పటికీ ఎప్పటికీ మీ స్థానం అలాగే ఉంటుంది అని అంటుంది. డిబిఎస్టి కాలేజీకి ఒకప్పటి పూర్వ వైభోగం రావాలి అని దానికి ఒకే ఒక మార్గం ఉంది అని అంటుంది. దానికి రిషి ఏంటది అని అడగటంతో.. మీరు కాలేజీకి రావాలి అని అంటుంది. మరి రిషి కాలేజీకి వెళ్లడానికి ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాల్సిందే.
Also Read: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: క్షేమంగా అను చేతిలోకి బాబు.. ఛాయాదేవితో మాన్సీ చేతులు కలపనుందా?