Rahul Sipligunj: సింగర్ మంగ్లీతో గొడవపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్ - పెళ్లికి పిల్లనిస్తలే!
Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్.. తన గాత్రంతో, ఎన్నో మాస్ సాంగ్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించిన సింగర్. ఇక ఇప్పుడు సూపర్ సింగర్స్ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Rahul Sipligunj About his Marriage: రాహుల్ సిప్లిగంజ్.. తన గాత్రంతో, ఎన్నో మంచి మంచి మాస్ సాంగ్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించిన సింగర్. నాటు నాటు అంటూ ఆస్కార్ స్టేజ్ పైన తెలుగు పాటను సగర్వంగా ప్రజెంట్ చేసిన సింగర్. ప్రస్తుతం ఆయన స్టార్ మా లో వస్తున్న సూపర్ సింగర్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ షో ఇప్పుడు ఫినాలేకి చేరుకుంది. ఈ సందర్భంగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటరవ్యూలో రాహుల్ సిప్లిగంజ్ షో గురించి, తన కెరీర్ గురించి పెళ్లిపై చాలా విషయాలు పంచుకున్నారు.
ఇదో కొత్త ఎక్స్ పీరియెన్స్..
ఇన్ని రోజులు తనని ఒకరు జడ్జ్ చేసేవాళ్లని, ఇప్పుడు తను జడ్జ్ సీట్ లో కూర్చుని అలా చెప్పడం గొప్ప ఎక్స్ పీరియెన్స్ అని అన్నారు రాహుల్ సిప్లిగంజ్. "స్టార్ మా సూపర్ సింగర్స్ లో జడ్జ్ గా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. నా లైఫ్ లో గొప్ప ఎక్స్ పీరియెన్స్ ఇది. ఇప్పటి వరకు మనల్ని జడ్జ్ చేసేవాళ్లు.. అంటే ప్లే బ్యాక్ లో పాడుతుంటే వాళ్లు నన్ను కరెక్ట్ చేసేవాళ్లు. అలాంటిది మనం అక్కడ కూర్చుని ఎదుటి వాళ్లకు చెప్పడం చాలా కొత్తగా అనిపించేది. ఎలా పాడాలో, ఎంతబాగా పాడాలో చెప్పలేను కానీ, నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం.. చిన్న మిస్టేక్స్ చెప్పగలుగుతాను. ఇప్పుడున్న ప్లే బ్యాక్ సింగర్స్ అంతా స్టార్ మా వచ్చిన వాళ్లే దాదాపు. నేను కూడా ఈ షోలో అప్పట్లో పాల్గొని ఉంటే బాగుండేది ఇంకా చాలా నేర్చుకునే వాడిని అనిపించింది. ఇక ఇప్పుడు ఈ సీజన్ హిట్ అవ్వడం ఆనందంగా ఉంది. గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది" అని చెప్పుకొచ్చాడు రాహుల్.
మంగ్లీతో గొడవ..
మంగ్లీతో గొడవపై స్పందిస్తూ.. "ఫన్ కోసం కావాలనే టీజ్ చేసేవాడిని అని అన్నాడు. మంగ్లీ నేను మంచి ఫ్రెండ్స్. ఎంటర్ టైన్మెంట్, ఫన్ కోసం కో - జడ్జ్ ని ఏదో టీజ్ చేస్తాను. అప్పుడప్పుడు అది ఎమోషనల్ అవుతుంది. నిజానికి అందరం చాలా ఫన్నీగా ఉంటాం. నలుగురం మా వర్క్‌ను ఎంజాయ్ చేస్తాం. అందరిలో కంటే శ్రీరామ్ గారు బాగా ఎంటర్‌టైన్ చేస్తారు. ఆయన చెప్పే విధానం చాలా నచ్చుతుంది. అందరికీ తెలిసిన విషయాన్నే చాలా ప్రత్యేకంగా చెప్తారు ఆయన. కో జడ్జస్ ప్రతి ఒక్కరి నుంచి చాలా చాలా నేర్చుకున్నాను. శ్రీముఖి చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. ఎంజాయ్ చేస్తాను ఆమె హోస్టింగ్" అని చెప్పారు రాహుల్.
పిల్లను ఇస్తలేరు..
పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు ఎవ్వరూ పిల్ల నిస్తలేరు అంటూ జోక్ చేశారు రాహుల్ సిప్లిగంజ్. పెళ్లి ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని, ప్రస్తుతానికి తన కెరీర్ మీద దృష్టి పెట్టానని చెప్పారు ఆయన. యాక్టింగ్, సింగింగ్ లో ఇంకా పర్ఫెక్ట్ అవుతున్నానని అన్నారు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అని తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు ఆయన.
ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ తో మ్యూజిక్ లవర్స్ కి పరిచయం అయ్యాడు రాహుల్ సిప్లి గంజ్. ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా మాస్ పాటలకు కేరాఫ్ అయిపోయాడు ఆయన. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా నుంచి ఆస్కార్ అందుకున్న 'నాటు నాటు' పాటను పాడారు ఆయన. కాల భైరవతో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ స్టేజ్ పై పాటను పాడారు రాహుల్.
Also Read: ఆ విషయం మైక్ పట్టుకుని చెప్పేది కాదు కదా? బ్రేకప్ పై స్పందించిన నిహారిక కొణిదెల