Meghasandesham Serial Today September 6th: ‘మేఘసందేశం’ సీరియల్: అపూర్వతో చాలెంజ్ చేసిన భూమి – చెర్రీని అనుమానించిన అపూర్వ
Meghasandesham Today Episode: భూమి చంపాడా లేదో తెలుసుకోవడానికి అపూర్వ, నాగు కు ఫోన్ చేస్తుంది. ఫోన్ భూమి లిఫ్ట్ చేయడంతో అపూర్వ షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesham Serial Today Episode: చెర్రీ చేతికి దెబ్బ తగిలించుకోవడం గురించి గార్డెన్ లో నిలబడి ఆలోచిస్తుంది అపూర్వ. తన కూతురు ఫోన్ తీసుకుని వచ్చి ఇచ్చి మమ్మీ చెర్రి గురించి ఆలోచిస్తున్నావా? అని పాపం చెర్రి చెయ్యికి దెబ్బ తగిలింది. అనగానే వాడు కావాలనే దెబ్బ తగిలించుకున్నాడని.. వాళ్ల నాన్న ప్రమాణం చేయకుండా ఆపేందుకే వాడు అలా చేశాడని అపూర్వ చెప్తుంది. మన ఇంట్లోకన్నా ఆ ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు. మనతో మాత్రం వాళ్లంటే పడదు అన్నట్లు నటిస్తాడు అని చెప్తుంది. ఇంట్లో నాకు మెల్లమెల్లగా శత్రువులు అవుతున్నారు.. వాడి నాన్ననే లెక్కచేయలేదు. వాణ్ని వదిలేస్తానా? అంటుంది. మరోవైపు భూమి హాస్పిటల్ లో బాధగా కూర్చుని ఉంటుంది. ఇంతలో అపూర్వ నాగు ఫోన్‌కు కాల్ చేస్తుంది. భూమి కాల్ లిఫ్ట్ చేస్తుంది.
అపూర్వ: ఏరా ఎక్కడ చచ్చావు. అసలు ఫోన్ చేస్తే తీయవు ఏంటి? దాన్ని చంపేశావా లేదా? జాగ్రత్తగా దాని శవాన్ని మాయం చేశావా? లేదా?
భూమి: ఓహో నా చావు కోసం ఎదురుచూస్తున్నావా?
అపూర్వ: ఎవరు?
భూమి: భూమి ఆత్మని..
అపూర్వ: ఏయ్ వాడి ఫోన్ నీ దగ్గర ఉందేంటి?
భూమి: ఫోన్ నా దగ్గర ఉండటం సమస్య కాదు. అసలు నీకేం కావాలి. ఎందుకు నీ మనుషులతో నన్ను కిడ్నాప్ చేయించావు. నా చావును నువ్వు కోరుకునేంత తప్పు నేనేం చేశాను. చెప్పు అపూర్వ ఏంటి నీ సమస్య. ఎందుకు నా వెంట పడుతున్నావు. నీకు నీకు ఏం శత్రుత్వం ఉందని నన్ను చంపాలనుకుంటున్నావు. సరే ఫోన్‌లో వద్దులే వస్తున్నాను నేరుగా మాట్లాడుకుందాం.
అపూర్వ: ఎక్కడికి వస్తావు..
భూమి: ఇంకెక్కడికి నీ ఇంటికే వస్తున్నాను. నీ సమస్య ఏంటో నీ వాళ్ల ముందే తేల్చుకుంటాను.
అని భూమి చెప్పి ఫోన్ కట్ చేయగానే అపూర్వ భయపడుతుంది. అది ఇంటికి వస్తే ప్రమాదం. దాన్ని కిడ్నాప్ చేసిన విషయం బావకు తెలిస్తే నా అసలు రూపం బావకు తెలిసిపోతుంది. దాన్ని చంపాలనుకున్న విషయం తెలిస్తే బావ చేతిలో నా చావు తప్పదు ఎలాగైనా ఆ భూమిని ఇంటికి రాకుండా ఆపాలని నక్షత్రను పిలుస్తుంది. భూమి ఇంటికి వస్తుంది. అది ఈ ఇంటి గేటు దాటి లోపలికి రాకూడదు. అని చెప్పగానే నక్షత్ర సరే దాన్ని గేటు దాటనివ్వను అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు ఇందు తన పెళ్లి పత్రిక తీసుకుని కాలేజీకి వెళ్లి పూరిని అవమానిస్తుంది. నా పెళ్లి పత్రికలో తండ్రి పేరు ఉందని.. నీ పెళ్లి పత్రికలో తండ్రి పేరు ఉండదా? అంటుంది. దీంతో పూరి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు భూమి ఇంటికి రాగానే కట్టె పట్టుకుని కోపంగా చూస్తుంది నక్షత్ర.
భూమి: చెల్లి..
నక్షత్ర: చెల్లా... చిన్నదాన్ని కదా అని చెల్లి అని కవర్ చేస్తున్నావా? నీ ఆటలు నా దగ్గర కాదు. పో బయటకు.
భూమి: నేను ఎవరో తెలుసా? తెలిస్తే ఇలా అనవు..
నక్షత్ర: ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నువ్వెవరైతే నాకేంటి? నేను అపూర్వ కూతురిని. ఇక్కడ నీకేం పని. ఎందుకొచ్చావు.
భూమి: నాన్నతో మాట్లాడాలని వచ్చాను.
అపూర్వ: నాన్నా.. ( చాటు నుంచి చూస్తుంది)
నక్షత్ర: నాన్నతో అంటే
భూమి: అదే మీ నాన్నతో మాట్లాడాలని వచ్చాను. అంకుల్ లేరా?
నక్షత్ర: ఉన్నారు కానీ నీతో మాట్లాడరు.
భూమి: నన్ను లోపలికి పోనివ్వు మాట్లాడతారో లేదో చూద్దాం..
అనగానే నక్షత్ర కోపంగా అమ్మా నాన్నలు ఎవరూ లేనిదానివి అంటుంది. దీంతో భూమి నేను ఎవరనేది లోపలికి వెళితే తెలుస్తుంది. అని భూమి లోపలికి వెళ్లబోతే నక్షత్ర కర్రతో కొట్టబోతే ఆ కర్రను లాక్కుని భూమి విరగ్గొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.