Brahmamudi Serial Today September 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ ట్యాబ్లెట్స్ మార్చిన రుద్రాణి – కళ్యాణ్ బర్తుడే సందర్బంగా అన్నదానం చేసిన రాజ్
Brahmamudi Today Episode: అపర్ణను చంపేందుకు రుద్రాణి ట్యాబ్లెట్స్ మార్చడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: రాహుల్, రుద్రాణి కలిసి ఎలాగైన అపర్ణను చంపాలనుకుంటారు. చంపిన తర్వాత ఆ నేరం కావ్య మీద పడేలా చేయాలనుకుంటారు. అందుకోసం రాహుల్, రుద్రాణికి ఏదేదో చెప్తుంటాడు. మరోవైపు కల్యాణ్ బర్తుడే సందర్భంగా పేపర్, పెన్ను గిప్టుగా ఇస్తుంది అప్పు. దీంతో కళ్యాణ్ ఎమోషన్ అవుతాడు. నన్ను ఇంట్లో వాళ్లు మర్చిపోయారని బాధపడతాడు. ఇంతలో తేరుకుని గుడికి వెళ్దామా అని అప్పును అడిగితే సరే అంటుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి బాధపడుతుంది.
ధాన్యలక్ష్మీ: నా కొడుకు బయటకు పోగానే వాణ్ని అందరూ మర్చిపోయారు. వాడి పుట్టిన రోజు ఎవరికీ గుర్తు లేదు.( అందరూ నవ్వుతారు.) ఎందుకు నవ్వుతున్నారు.
ఇందిరాదేవి: ఒంటికాలి తిన్నడు కథ తెలుసా ధాన్యలక్ష్మీ నీకు..
ధాన్యలక్ష్మీ: ఆ కథ నాకెందుకు..?
అపర్ణ: నిన్న రాత్రి నుంచి రాజ్ కళ్యాణ్ బర్త్ డే ఏర్పాట్లు చేశాడు.
రాజ్: అవును పిన్ని వాడి పేరు గుళ్లో అభిషేకం చేయించి.. అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు కోపంగా ఉంటావని నీకు చెప్పలేదు.
ఇందిరాదేవి: ఈ అన్నదానం ధాన్యలక్ష్మీ చేతుల మీదుగా చేయిద్దాం రాజ్. అందరం గుడికి వెళ్దాం పదండి.
అపర్ణ: నేను రాలేను అత్తయ్య నాకు ఆరోగ్యం సరిగా లేదు. నేను ఇక్కడే ఉంటాను.
అని చెప్పగానే అందరూ ఎవరికి వాళ్లే అపర్ణ తోడుగా మేముంటామంటే మేముంటాము అంటారు. అయితే ఎవరూ ఉండొద్దని కావ్య నేనుంటానని చెప్తుంది. దీంతో కావ్య ఉంటే సరి అందరం వెళ్లొచ్చు అనుకుంటారు. ఇంతలో రుద్రాణిని పక్కకు తీసుకెళ్తాడు రాహుల్. అపర్ణ వేసుకునే ట్యాబ్లెట్స్ మార్చమని రాహుల్ ట్యాబ్లెట్స్ ఇస్తాడు. దీంతో రుద్రాణి సరే అని వెళ్లి ట్యాబ్లెట్స్ మారుస్తుంది.
రుద్రాణి: నీ ప్లాన్ అదిరిపోయిందిరా రాహుల్.. ఈ దెబ్బతో వదిన పైకి వెళ్లిపోవడం ఖాయం.. కావ్య బయటకు వెళ్లడం ఖాయం.
రాహుల్: అంతేకాదు మామ్.. తల్లి చనిపోయిందని రాజ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. కంపెనీ మనచేతికి వస్తుంది.
అని ఇద్దరూ మాట్లాడుకుని నార్మల్ గా మళ్లీ అందరితో పాటు గుడికి వెళ్లడానికి రెడీ అవుతారు. అపర్ణ తీసుకునే ట్యాబ్లెట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటావని కావ్యపై రాజ్ సెటైర్లు వేస్తాడు. తర్వాత అందరూ గుడికి వెళ్తారు.
కావ్య: అత్తయ్య మీకోసం టిఫిన్ చేసి తీసుకొస్తాను నేను.
అపర్ణ: నా కోసమేనా.. నీకోసం వద్దా.. ఇకనుంచి నీ గురించి ముందు చూసుకో. నువ్వు ఎంత చాకిరి చేసిన ఇక్కడ నీకు కిరీటాలు పెట్టరు.
అని చెప్పగానే కావ్య నవ్వుతుంది. మరోవైపు గుడిలో దర్శనం చేసుకుంటారు కల్యాణ్, అప్పు. మెట్లపై కూర్చుని ప్రసాదం తింటుంటారు. ఇంతలో రాజ్ వాళ్లు అందరూ గుడికి రావడంతో వాళ్లకు కనిపించకుండా పక్కకు వెళ్తారు కళ్యాణ్, అప్పు. రాహుల్ వాళ్లను చూసి రుద్రాణికి చూపిస్తాడు. తర్వాత రాహుల్ ఎవరికో ఫోన్ చేసి తన వల్ల కంపెనీలో స్మగ్గింగ్ జరుగుతుందని కావ్యకు ఫోన్ చేసి చెప్పమంటాడు. ఆ వ్యక్తి సరేనంటాడు. మరోవైపు తనకు బోర్ కొడుతుంది.. వంట చేస్తానని అపర్ణ అంటుంది.
కావ్య: మీరు వంట చేయడం ఏంటీ అత్తయ్య. మీరు రెస్ట్ తీసుకోండి.
అపర్ణ: ఎంతసేపు ఉండాలి. చాలా బోర్ కొడుతుంది. ఇదిగో ఈ కత్తి చూశావా? నన్ను ఏం పని చేయనివ్వడం లేదేంటి?
కావ్య: కట్నం కోసం వేధించే అత్తలను చూశాను. కానీ, రెస్ట్ తీసుకోండని చెప్పిన కోడలిపై హత్యా ప్రయత్నాన్ని ఇప్పుడే చూస్తున్నాను.
అపర్ణ: ఇది కత్తా.. నేను అట్లకాడ అనుకున్నానే..
కావ్య: నేను ఒప్పుకోకపోతే వీపు వాయగొట్టేలా ఉన్నారే
అని కావ్య అంటుంది. అపర్ణ నవ్వుతుంది. మరోవైపు కల్యాణ్ పేరుతో గుడిలో అర్చన చేయిస్తారు. అది చూసిన కళ్యాణ్ ఎమోషనల్ గా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు పెరిగిన ఆశ్రమానికి తీసుకెళ్లిన అమర్ – ఆశ్రమం చూడగానే ఎమోషన్