అన్వేషించండి

Nindu Manasulu Serial Today March 3rd: నిండు మనసులు: సిద్ధూకి నిజంగానే యాక్సిడెంట్ అయిందా! సిద్ధూ కోసం విలవిల్లాడిపోతున్న ప్రేరణ!

Nindu Manasulu Serial Today March 3rd సిద్ధూకి యాక్సిడెంట్ అయింది అని ప్రేరణ ఏడుస్తూ హాస్పిటల్‌కి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ కుమార్‌కి కాల్ చేస్తుంది. కుమార్‌ హాస్పిటల్‌కి రావడం.. ఇంతలో డాక్టర్ సీరియస్ అని మాట్లాడటం అన్నీ విన్న ప్రేరణ చాలా కంగారు పడుతుంది. సిద్ధూకి ఏమైనా జరిగిందా అని కంగారుతో హాస్పిటల్‌కి వస్తుంది. డాక్టర్‌తో మాట్లాడుతుంటే అతను కళ్లు తెరిస్తే తప్ప ఏం చేయలేం అని డాక్టర్ చెప్పడంతో ప్రేరణ ఏడుస్తుంది. పేషెంట్ ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అవ్వడం లేదు అనడంతో ఎంత ఖర్చు అయినా పర్లేదు తను బతకాలి అని చెప్పి సిద్ధూ అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. 

ప్రేరణ ఏడుస్తుంటే సిద్ధూ చూసి వచ్చి ప్రేరణ అనడంతో ప్రేరణ సిద్ధూని చూసి ఏడుస్తూ కంగారుగా సిద్ధూని తరుముతూ సిద్ధూ సిద్ధూ అని ఏడుస్తూ నీకు ఏం కాలేదు కదా అని అంటుంది. ఇంతలో కుమార్ వచ్చి ప్రేరణ కాల్ చేస్తే యాక్సిడెంట్ అయిందని  చెప్పాను అంటాడు. యాక్సిడెంట్ అవ్వడమే నిజం  కానీ అని చెప్తాడు. దాంతో ప్రేరణ కుమార్‌కి కొట్టి నా ఎమోషన్‌తో మీ ఇద్దరూ ఆడుకుంటున్నారు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. ఐశ్వర్య రంజిత్ దగ్గరకు వెళ్లి పిలుస్తుంది. ఎందుకు అరుస్తున్నావ్ అని రంజిత్ అడిగితే సైగ చేస్తుంది. ఏంటి అని గది క్లీనింగ్ అని చెప్తుంది. కేఫ్‌కి వెళ్లడం లేదా అని అంటే లేదు అని అక్కడ జరిగింది అంతా విషయం చెప్తుంది. ఎవరి పనులు వాళ్లే చేయాలి అని రంజిత్ అంటాడు. 

ప్రేరణ హర్ట్ అయి వెళ్తుంటే సిద్ధూ వెనకాలే ఫాలో అవుతాడు. ప్రేరణ నేను ఏ అబద్ధం చెప్పలేదు అని అంటాడు. నేను నిన్ను దూరం పెట్టాను అనే కదా.. నీతో మాట్లాడాలి అని కంకణం కట్టుకున్నావ్.. ఐశ్వర్య కేఫ్‌కి వస్తే తనని పంపేశావ్.. మా ఇంటికి వచ్చావ్.. ఇప్పుడు కుమార్తో అబద్ధం చెప్పించావ్.. అసలు నీకు ఏమైనా అయ్యుంటే అని ప్రేరణ అంటుంది. దానికి సిద్ధూ నాకు యాక్సిడెంట్ అయి నేను ప్రాణాపాయంలో ఉంటేనే నాతో మాట్లాడుతావా ప్రేరణ అని అడుగుతాడు. ప్రేరణ షాక్ అయిపోతుంది. అలా అంటావ్ ఏంటి సిద్ధూ.. యాక్సిడెంట్ వేరే వాళ్లకి అయింది చెప్పొచ్చు కదా.. అసలే మా నాన్నకి యాక్సిడెంట్ అయి మా జీవితాలు తలకిందులైయ్యావి.. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అనగానే నా ప్రాణం పోయినంత పని అయింది అని ఏడుస్తుంది. నాతో మాట్లాడటానికి ఇలా చేయాలా అంటుంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావ్ అని సిద్ధూ అంటాడు. ఆ రోజు ఇలాగే మీ నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు చెప్తే ఇలాగే అపార్థం చేసుకున్నావ్ ఇప్పుడు అంతే అని అంటాడు. సంబంధం లేకుండా అనుభవించే బాధ మాటల్లో చెప్పలేం ప్రేరణ అని సిద్ధూ అంటాడు. 

ఇందిర గణ బెదిరించిన విషయం గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటే రంజిత్ ఏమైందని అడుగుతాడు. ఐశ్వర్య వచ్చి గణ నన్ను మా అక్కని చంపేస్తా అని బెదిరించాడని చెప్తుంది. ప్రేరణ ధైర్యంగా ఉండమని చెప్పుంటుంది కదా. ఏ తల్లి అయినా ఆడపిల్ల విషయంలో భయపడటం సహజం కానీ మీ పిల్లలు ఏ పరిస్థితి అయినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిమంతులు, మంచివాళ్లు.. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు.. ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్తాడు. ప్రేరణ, ఐశ్వర్యల్ని వాళ్లని వాళ్లగా వదిలేయండి పిరికి వాళ్లని చేయొద్దు అంటాడు. మీరు మాకు చాలా సాయం చేస్తున్నారు.. మేం మీకు ఎప్పటికీ రుణ పడి ఉంటాం అని ఇందిర అంటుంది.

సిద్ధూ ప్రేరణతో నేను ఏ తప్పు చేయకపోయినా నువ్వు నన్ను దూరం పెడుతున్నావ్.. మనం వేరే వాళ్ల కోసం బతకడం లేదు కదా.. అనేవాళ్లు ఉన్నంత కాలం మనం ఎలా ఉన్నా మనల్ని అంటూనే ఉంటారు..అంటాడు. నేను పడే బాధ నీకు ఏం తెలుస్తుంది.. తెలిస్తే ఇలా అనవు అని ప్రేరణ అంటుంది. నీ బాధ అంతా మీ నాన్న గురించే కదా.. మీ నాన్నకి యాక్సిడెంట్ అవ్వడం వల్లే ఇదంతా జరిగింది అంతే కదా.. మీ నాన్నకి ప్రమాదం జరగకపోతే ఆయన జీవితంలో మీరు తప్ప ఆ గణ ఉన్నాడు అనే విషయం తెలిసేదే కాదు కదా.. ఏ నాటికైనా ఆ నిజం బయట పడి తీరాల్సిందే.. అలా అని మీ నాన్న తప్పు చేశారు అని కాదు.

నిజం మీ నాన్న చెప్పకపోయినా తర్వాత మీరు ఈ సమస్య ఎదుర్కొవాల్సిందే.. సమస్య తెలిసిన తర్వాత ఎదుర్కొవాలి.. లేదంటే భయంతో ఉండాలి.. భయపడితే మనకు విలువ ఉండదు ప్రేరణ అందుకే సమస్యని ఎదుర్కొవడానికి నీకు ధైర్యంగా ఉండమని అంటున్నా.. నువ్వు నీలా ఉండు.. నేను నాలా ఉంటాను  అని అంటాడు. నేను వెళ్లి ఆవిడను చూసి వస్తా అని సిద్ధూ అంటే నేను వస్తా అని ప్రేరణ అని సిద్ధూతో మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 13th: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
నువ్వులేక నేను లేను: విక్కీ రాకతో రౌడీలు మాయం...సుందరి అడ్రెస్ తెలుసుకునేందుకు రాధ ఏం చేసింది...?
Podarillu Serial Today August 13th:బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు
పొదరిల్లు: బావమరిదికి మాస్‌ వార్నింగ్ ఇచ్చిన నారాయణ...సత్రంలో తాయర్‌తో చక్రి గిల్లికజ్జాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
Embed widget