Meghasandesham Serial Today September 18th: ‘మేఘసందేశం’ సీరియల్: పెళ్లికి ఓకే చెప్పిన గగన్ – శోభ కలలోకి వచ్చి నిజం చెప్పిందన్న శరత్‌చంద్ర
Meghasandesham Today Episode: శోభాచంద్ర తనకు రాత్రి కలలో కనిపించి నా బిడ్డ బతికే ఉందని చెప్పిందని భూమికి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesham Serial Today Episode: భూమిని తీసుకుని శోభాచంద్ర రూంలోకి వెళ్తాడు శరత్ చంద్ర. రూంలో ఉన్న శోభ ఫోటో, ఆమె వాడిన వస్తువులు చూసి ఎమోషనల్ గా ఫీలవుతుంది భూమి. ఇంతలో శరత్‌చంద్ర కూడా తనకు రాత్రి శోభ కనిపించి నా బిడ్డ బతికే ఉందని చెప్పింది. ఆరోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఇద్దరూ చనిపోయారు అనుకున్నాను కానీ నా బిడ్డ బతికే ఉందని నా కలలో చెప్పింది. అయినా ఆ కలను ఎలా నమ్మాలి. లేని బిడ్డ ఉందని పిచ్చివాణ్ని అయిపోతానేమో అంటూ బాధపడతాడు శరత్‌చంద్ర.
భూమి: ఇందుకే నాన్న నేను నిజం చెప్పలేదు. నేను బతికే ఉన్నాను అన్న నమ్మకం మీకు లేకపోతే నేను మీ కూతురిని అని చెప్పినా నమ్మకపోతే ఈ మాత్రం కూడా నేను మీకు దగ్గరగా ఉండలేనేమో అన్న భయంతోనే చెప్పలేకపోతున్నాను
( అని మనసులో అనుకుంటుంది.)
శరత్: తాను బతికి లేదన్నది నిజం. తాను ఇక తిరిగి రాదన్నది నిజం అందుకే తన జ్ఞాపకంగా నిండు గర్భిణీగా ఉండి తను చివరిసారిగా చేసిన నాట్యాన్ని ఒక వీడియో లో చేసి ఈ పెన్ డ్రైవ్ లో దాచుకున్నాను. నాలోని ఉన్న తన రూపానికి ఇదే చివరి జ్ఞాపకం.
అని చెప్పి శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు పెళ్లిచూపుల్లో కూర్చున్న గగన్ తల దించుకుని ఉంటాడు. అమ్మాయి మాత్రం గగన్ ను అలాగే చూస్తుంటుంది. అదేంటి అతను తల దించుకుని ఉన్నాడు అని అడుగుతుంది అమ్మాయి. దీంతో శారద మా అబ్బాయికి కొంచెం సిగ్గు ఎక్కువ అని సర్ది చెప్తుంది. దీంతో గగన్ లేచి నడిచి.. మాట్లాడి ఇక అంత ఓకేనా అంటాడు. మరోవైపు భూమి ఆంటీకి చెప్పకుండా వచ్చానని ఫోన్ చేస్తుంది. పూరి ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్యకు పెళ్లి చూపులు జరుగుతున్నాయని చెప్తుంది.
భూమి: ఏంటి పెళ్లి చూపులా..? నాకు చెప్పకుండా పెళ్లి చూసులు ఏంటి?
పూరి: అన్నయ్యకే చెప్పలేదు. ఇక నీకెలా చెప్తాం..
భూమి: మీ అన్నయ్యకు చెప్పకపోయినా నాకు చెప్పాలి కదా? ఇవతల నాకు ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో.. అవేవీ అర్థం చేసుకోరా?
పూరి: నీ ప్లాన్స్ ఏంటి?
భూమి: అంటే పెళ్లి చూపులు అంటే నేనేదో ప్లాన్ చేసుకుంటాను కదా? ఇంతకీ పెళ్లిచూపులు అయిపోయాయా?
పూరి: లేదు జరుగుతున్నాయి.
భూమి: అయితే వస్తున్నాను.
అని బయటకు వెళ్లిపోతుంది. కింద ఆ భూమిని ఎలాగైనా ఇంట్లోంచి పంపిచేయాలని భూమి రూంలోకి వెళ్తున్న నక్షత్ర, ఇందులను ఢీకొట్టుకుంటూ బయటకు వెళ్లిపోతుంది భూమి. మరోవైపు అమ్మాయి గగన్‌తో పర్సనల్ గా మాట్లాడాలి అంటుంది. దీంతో ఇద్దరిని మేడ మీదకు పంపిస్తారు. గగన్, అమ్మాయి పైకి వెళ్తారు. భూమి పరుగెత్తుకుంటూ వస్తుంది.
భూమి: మీ అన్నయ్య ఎక్కడ?
పూరి: అన్నయ్యతో మాట్లాడాలి అంటే అన్నయ్య ఆ అమ్మాయి పైకి వెళ్లారు.
భూమి: ఏం మాట్లాడుకుంటారు.
పూరి: ఏమో నాకేం తెలుసు
భూమి: ఈ తల తిక్కగారు మాటల్లో పడి పెళ్లికి ఓకే అంటారా?
అని భూమి పైకి వెళ్తుంది. అక్కడ గగన్, అమ్మాయి క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి ఇరిటేటింగ్ ఫీల్ అవుతుంది. భూమిని చూసిన అమ్మాయి ఎవరని అడుగుతుంది. దీంతో గగన్ మా చెల్లెలు వాళ్ల డాన్స్ టీచర్ అని చెప్తాడు. ఏంటి మాట్లాడుకుంటుంటే అని అడగ్గానే పైన బట్టలు ఆరేశాను అని చెప్పి పైకి వెళ్తుంది. మనిషి బాగానే ఉంది నా తలతిక్కగారు మాటల్లో పడి పెళ్లికి ఓకే అంటాడేమో అనుకుంటూ వాళ్లనే గమనిస్తుంది. వాళ్లు మాట్లాడుకునేది వినాలని తన ఫోన్ నుంచి కింది లాండ్ ఫోన్ కు కాల్ చేసి వెళ్లి కింద లాండ్ ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్లు మాట్లాడుకునేది వింటుంది భూమి. తర్వాత కిందకు వచ్చిన గగన్ తనకు పెళ్లికి ఓకే చెప్పడంతో భూమి షాక్ అవుతుంది. శారద, పూరి హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో మధ్యలో కల్పించుకున్న భూమి మీరు ఓకే అంటే సరిపోతుందా? అంటూ గొడవ పెట్టుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: డార్జిలింగ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ టైం అస్సలు మిస్ అవ్వద్దు