Darjeeling Trip: డార్జిలింగ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ టైం అస్సలు మిస్ అవ్వద్దు
Darjeeling Trip: మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన డార్జిలింగ్ ఏ టైంలో వెళితే ఆక్కడి ప్రకృతి అందాల నడుమ పరవశించిపోవచ్చో.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో సమ్మిళితం కావాచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.
Darjeeling Trip: ఇండియలోనే మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన డార్జిలింగ్ వెళ్లాలనుకుంటున్నారా? అక్కడి ప్రకృతి అందాలతో పాటు అక్కడ జరిగే పెస్టివల్స్ లో భాగస్వాములు కావాలనుకుంటున్నారా? అయితే డార్జిలింగ్ కు ఏ టైంలో వెళితే ఆక్కడి ప్రకృతి అందాల నడుమ పరవశించిపోవచ్చో.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో సమ్మిళితం కావాచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.
డార్జిలింగ్ అందమైన రోమాంటిక్ ప్రదేశాలకు కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాదు. తేయాకు తోటలకు.. ఆహ్లాదపరిచే అనేక ఇతర ప్రదేశాలు ప్రసిద్ది చెందింది. ప్రకృతి అందాలతో పాటు లోకల్ ఫెస్టివల్స్ తో మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా నిలిచింది. అక్కడి వాతావరణం ప్రశాంతంగా, అందమైన ప్రకృతి దృశ్యాలతో, పర్యాటకుల తాకిడితో సందడిగా కనిపిస్తుంది. చల్లని ప్రకృతి మధ్య సమయం గడపాలనుకునే వారికి ఇది సరైన గమ్యస్థానం. అలాగే మనదేశంలో చూడదగ్గ అద్భుతమైన హనీమూన్ డెస్టినేషన్ డార్జిలింగ్ హిల్ స్టేషన్. అటువంటి డార్జిలింగ్ ను మనసారా ఆస్వాదించాలనుకుంటే అక్కడికి పెస్టివల్స్ టైంలోనే వెళ్లాలట. అక్టోబర్ నుంచి అక్కడ పండుగలు మొదలవుతాయట. ఈ పెస్టివల్స్ టైంలో డార్జిలింగ్ మరింత శోభాయమానంగా వెలిగిపోతుందని అక్కడి టూరిస్ట్ గైడ్స్ చెప్తుంటారు.
ALSO READ: గరిక, పసుపు, నిమ్మకాయ ఉంటే మీ ఆర్థిక, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఇట్టే మాయమైపోతాయి!
దాసైన్ ఫెస్టివల్ : డార్జిలింగ్‌లోని నేపాలీ కమ్యూనిటీకి అత్యంత ముఖ్యమైన పండుగలలో దసైన్ ఒకటి. సెప్టెంబరు లేదా అక్టోబర్‌లో 15 రోజుల పాటు జరుపుకుంటారు. ఇది దసరా వేడుకలతో సమానంగా ఉంటుందట. ఈ సమయంలో డార్జిలింగ్ ప్రకృతి అందాలతో పాటు సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరుస్తాయట.
తీహార్ ఫెస్టివల్ : ఈ పండుగను ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని కూడా పిలుస్తారు, ఇది డార్జిలింగ్‌లో అత్యంత ముఖ్యమైన మరియు విస్తృతంగా జరుపుకునే పండుగలలో ఒకటి. ఈ తీహార్ పెస్టివల్ ఇక్కడ ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు కాకులకు ఆహారాన్ని అందిచడం. రెండవ రోజు కుక్కలకు అందంగా తయారు చేసి వాటికి రుచికరమైన ఆహారాన్ని అందించడం. మూడవరోజు ఆవులను పూజిస్తారు. లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటారు. నాలుగవ రోజు తమ పశువులకు పూజలు చేస్తుంటారు. తీహార్ చివరి రోజు అన్నదమ్ముల బంధానికి అంకితం చేయబడింది. సోదరులు తమ సోదరీమణుల రక్షణకు చిహ్నంగా బహుమతులు ఇస్తారు.
డార్జిలింగ్ కార్నివాల్ : నవంబర్‌లో నిర్వహించే వారం రోజుల ఈ ఈవెంట్‌లో సంగీత కచేరీలు, నృత్య ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు మరియు స్థానిక వంటకాలను ప్రదర్శించే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇది డార్జిలింగ్ లోని విభిన్న సంస్కృతి మరియు కళాత్మక వేడుకగా చెప్పుకుంటారు.
తీస్తా టీ, టూరిజం ఫెస్టివల్ : తీస్తా టీ, టూరిజం ఫెస్టివల్ అనేది డార్జిలింగ్, కాలింపాంగ్ మరియు సిక్కిం ప్రాంతాలలో జరిగే ఒక ప్రత్యేకమైన మరియు ఉత్సాహభరితమైన వేడుక. ఇది డిసెంబర్, జనవరిలో జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీ ఔత్సాహికులు, పర్యాటకులు మరియు సాంస్కృతిక అభిమానులను ఈ వేడుకకు హాజరవుతుంటారట.
లోసర్ ఫెస్టివల్ : డార్జిలింగ్‌లో ముఖ్యంగా టిబెటన్ మరియు బౌద్ధ సంఘాలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో లోసర్ ఒకటి. ఇది టిబెటన్ నూతన సంవత్సరాన్ని సూచిస్తుంది. ఈ పెస్టివల్ పిబ్రవరి, మార్చిలలో జరుపుకుంటారు. డార్జిలింగ్ ప్రజల మధ్య ఐక్యత మరియు బంధాన్ని పెంపొందించడానికి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు మరియు విందులు నిర్వహిస్తారట.
మరి ఇంకెందుకు ఆలస్యం డార్జిలింగ్ లోని అద్బుతమైన ప్రకృతి అందాలను వీక్షించడమే కాకుండా అక్కడ సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వాములు కావాలనుకుంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు డార్జిలింగ్ వెళ్ళండి. పనిలో పనిగా అక్కడి వంటకాలు రుచులు ఆస్వాదిస్తూనే అక్కడి ఆటపాటలతో హ్యాపీగా గడపండి.
ALSO READ: సాంబ్రాణి ధూపం ఉపయోగాలు తెలుసా? ఆ రోజు ధూపం వేస్తే మీకు లక్ష్మీకటాక్షమే