అన్వేషించండి

Drishti Dosha Nivarana: గరిక, పసుపు, నిమ్మకాయ ఉంటే మీ ఆర్థిక, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఇట్టే మాయమైపోతాయి!

Small Remedies: మనం నిత్యజీవితంలో ఎదుర్కొనే పెద్ద పెద్ద సమస్యలకు ఖర్చు లేని లేదా తక్కు వ ఖర్చుతో కూడుకున్న రెమెడీస్ ను ఈ కథనంలో తెలుసుకుందాం.

Telugu News: నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. చిన్న సమస్యకైనా పండితుల దగ్గరకు వెళ్లినా.. జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లిన ఎన్నో రకాల పరిహారాలు చెప్తుంటారు. అయితే వాళ్లు చెప్పిన పరిహారాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి అయి ఉంటాయి. ఒక్కోసారి లక్షల్లో ఖర్చు పెట్టమని పండితులు చెప్తుంటారు. అయితే కోట్లలో ఆస్తులు ఉన్నవాళ్లు లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద కష్టం ఏమీ కాదు కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి? అందుకే మన సనాతన ధర్మంలో ఎటువంటి సమస్యకైనా ఖర్చు లేని పరిహారాలు సూచించారు. పెద్ద పెద్ద సమస్యలకు కూడా ఖర్చు లేని లేదా తక్కువ ఖర్చుతో పరిష్కారాలను కొందరు పండితులు సూచించిన చిన్న రెమెడీస్‌ను  ఈ కథనంలో తెలుసుకుందాం.

ALSO READ: రాధాష్టమి ఎప్పుడొచ్చింది..ఈ రోజు విశిష్టత ఏంటి - పూజావిధానం!

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ.. అన్ని అర్హతలు ఉన్నా ఎటువంటి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వాళ్లు మంచి రోజు చూసి 9 పసుపు కొమ్ములను తీసుకుని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను పారే నీటిలో కలిపితే త్వరలోనే కోరుకున్న ఉద్యోగం వస్తుందట. ఇక ఏదైనా పనిలో ఆటంకాలు ఎదురవుతుంటే దగ్గరలోని గుడికి వెళ్లి అక్కడి వినాయకుడిని రెగ్యులర్‌గా గరికతో పూజిస్తుంటే పనిలో ఆటంకాలు తొలగిపోతాయంట. అకారణంగా అవమానాలు ఎదురవుతున్నా.. చీటికి మాటికి గొడవలు జరుగుతున్నా.. ఎడమచేతికి ఎరుపురంగు కంకణం కట్టుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుందట. ఇక దాయాదులతో ఆస్తి, భూ తగాదాలు ఉన్నవాళ్లు సక్రమంగా పితృకర్మలను నిర్వర్తిస్తూ.. కాకులకు అన్నం ముద్ద పెడితే త్వరలోనే దాయాదులతో ఉన్న ఆస్తి, భూ తగాదాలు సమసిపోతాయట.

 ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని హాస్పిటల్స్‌ చుట్టు తిరిగినా పిల్లలు కానీ దంపతులు కాళికాదేవికి రెగ్యులర్‌గా నిమ్మకాయల దండ సమర్పిస్తూ ఉంటే త్వరలోనే వారికి సంతాన భాగ్యం కలుగుతుందట. అయితే ఆ నిమ్మకాయలు బేసి సంఖ్యలో ఉండేటట్లు చూసుకోవాలట. ఇక వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు తమ తల దువ్వుకున్న తర్వాత వచ్చే చిక్కును ( జుట్టును) జాగ్రత్తగా మూటకట్టి శనివారం నాడు పారే నీటిలో వేస్తే త్వరలోనే వారికి వివాహ ప్రాప్తి ఉంటుందట. ఇక భూ వివాదాలు తలెత్తి ఎప్పటికీ సమసిపోకుండా ఉంటే  ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతి వంట లేదా స్వగృహంలోనే భోజనం చేయడం కొంత వరకు వివాదాన్ని తగ్గిస్తుందట.

ALSO READ:అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, దసరా నవరాత్రులు సందర్భంగా ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే!

ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్న వారు ఇంటి లోపల ఏదో ఒక గదిలో పసుపు రంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరలో మంచి ధరకు అమ్ముడవుతుందట. ఎవరు హాని చేస్తున్నారో తెలియని రహస్య శత్రువులు ఉన్నవారు. రాహుకాలంలో శత్రునివారణ జరగాలని కోరుకుంటూ 7 ఎండు మిరపకాయలను తీసుకుని పసుపురంగు గుడ్డలో కట్టి వాటిని ఇంటికి దూరంగా ఎవరూ చూడని ప్రదేశంలో పడవేయాలట. ఏ కారణం చేతనైనా మీరు విదేశాలు వెళ్లే ఛాన్స్ మిస్ అయి పోతూ ఉంటే గణపతి ఆలయంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయడం వల్ల త్వరలోనే విదేశీయానం ఉంటుందట.

ALSO READ:దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!

 ఎంత సంపాదించిన నిలవకపోవడం. లేదా చాలీచాలని సంపాదన ఉన్నా 6 శుక్రవారాలు గులాబీ పువ్వును అత్తరులో ముంచి మీ పూజామందిరంలో ఉంచాలట.  ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే మీ సంపాదన  గతంకంటే కొంత పెరుగుతుందట. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీ వయసు ఎంతో అన్ని బొగ్గు ముక్కలను తీసుకుని పారే నీటిలో వదలితే త్వరలోనే మీకు అనారోగ్య బాధలు తగ్గిపోతాయట. 

NOTE: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక ఆంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు ఏడీపీ దేశం ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఏబీపీ దేశం, ఏబీపీ నెట్వర్క్ ఈ విషయాలను ధృవీకరించడం లేదు. 

టాప్ హెడ్ లైన్స్

పేదరాసి పెద్దమ్మ ఎవరు? ఆమె నిజంగా ఉండేదా? ఆమె గురించి పుస్తకాల్లో ఏముంది? 
పేదరాసి పెద్దమ్మ ఎవరు? ఆమె నిజంగా ఉండేదా? ఆమె గురించి పుస్తకాల్లో ఏముంది? 
మకర రాశి 2026 జూలై-డిసెంబర్: పదోన్నతి, ధనలాభం, కీలక మలుపు మీ కోసమేనా?
మకర రాశి 2026 జూలై-డిసెంబర్: పదోన్నతి, ధనలాభం, కీలక మలుపు మీ కోసమేనా?
Scorpio Half Year Horoscope 2026: జూలై - డిసెంబర్ మధ్య వృశ్చిక రాశివారి జీవితం కొత్త మలుపు తిరగబోతోందా!
2026 జూలై - డిసెంబర్ మధ్య వృశ్చిక రాశివారి జీవితం కొత్త మలుపు తిరగబోతోందా!
Dream Astrology: కలలో పాములు, దేవాలయాలు, నదులు కనిపిస్తే..దాని వెనుక కారణం ఏంటో తెలుసా?
కలలో పాములు, దేవాలయాలు, నదులు కనిపిస్తే..దాని వెనుక కారణం ఏంటో తెలుసా?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget