అన్వేషించండి

Meghasandesham Serial Today  October 1st: ‘మేఘసందేశం’ సీరియల్‌: వంశీకి సారీ చెప్పిన గగన్‌ – పెళ్లి జరుగుతుందన్న భూమి

Meghasandesham Today Episode: వంశీ వాళ్ల ఇంటికి వెళ్లిన శారదను వాళ్లు ఇంట్లోంచి గెంటి వేస్తుంటే గగన్‌ వెళ్లి పట్టుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesham Serial Today Episode:  శారదను గుడి దగ్గరకు పిలిచిన మీరా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా అంటూ  తిడుతుంది. నీ కొడుకు ఎందుకు ఈ పెళ్లి చెడగొడుతున్నాడు అంటూ నిలదీస్తుంది. రేపు ఈ పెళ్లి ఆగిపోయి నా కూతురు ఏమైనా ఆఘాయిత్యం చేసుకుని అది చనిపోతే దాని శవాన్ని తీసుకొచ్చి నీ ఇంటి ముందు పెట్టి నేను కిరోసిన్‌ పోసుకుని చనిపోతాను అని బెదిరిస్తుంది మీరా. దీంతో శారద భయపడుతూ వంశీ వాళ్ల ఇంటికి వెళ్తుంది.

వంశీ: మీకు మా ఇంటి దగ్గర పనేంటి?

శారద: మా అబ్బాయి కొట్టాడని ఈ పెళ్లి వద్దు అన్నారట కదా?

వంశీడాడి: మరి నీ కొడుకు వీధి రౌడీలా మీద పడి కొట్టినా కూడా ఈ సంబంధం కలుపుకోవాలా?  

వంశీ అమ్మ: ఈరోజు కొట్టాడు రేపు  ఇంకేం చేస్తాడో..

శారద: మా అబ్బాయి మీ అబ్బాయి మీద కోపంతో చేయి చేసుకోలేదండి. తన చెల్లెలుతో తప్పుగా  ప్రవర్తించాడట. అందుకే కొట్టాడట.

 వంశీడాడీ: ఎలా ప్రవర్తిచాలో మీరు చెప్పాలి. మేము వినాలి. అయినా కాబోయే భార్య కదా ఏలా ఉంటే మీకేంటి?

శారద: మా అబ్బాయి అలా కొట్టడం తప్పే అయితే వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మా వాడి వల్ల ఈ పెళ్లి ఆగకూడదు. అందుకే ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను.

వంశీ డాడీ: ఆగు నువ్వేంటమ్మా నా కాళ్లు పట్టుకునేది. నా కొడుకును కొట్టిన నీ కొడుకు వచ్చి మా వాడికి క్షమాపణ చెప్పాలి.

శారద: ఏవండి  వాడి తల్లిని నేను. నేను క్షమాపణ చెప్తున్నాను. కదా?

వంశీడాడీ: నువ్వు క్షమాపణ చెప్పి వెళ్లిపోతావు. కానీ వాడు మళ్లీ వచ్చి కొట్టడని గ్యారంటీ ఏంటి?

శారద: ఒక ఆడపిల్ల జీవితం మరీ అలా మాట్లాడితే ఎలా ఆలోచించండి.

వంశీడాడీ: నువ్వు మాకు నీతులు చెప్తే వినాల్సిన కర్మ మాకు పట్టలేదు. మర్యాదగా నడవు బయటకు

అంటూ శారదను బయటకు గెంటి వేస్తుంటారు. ఇంతలో అక్కడకు గగన్‌ వస్తాడు. శారదను పట్టుకుని వంశీ వాళ్ల అమ్మను ఆడదానివి కాబట్టి బతికిపోయావు అంటూ వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో గొడవ పెద్దదవుతుంది. వెంటనే శారద కోపంగా గగన్‌ ను వంశీకి క్షమాపణ చెప్పమంటుంది. తప్పు చేసింది వాడైతే నేనెందుకు క్షమాపణ చెప్పాలి అమ్మా నేను చెప్పను అంటాడు. దీంతో శారద నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను ఇటు నుంచి ఇటే ఆశ్రమానికి వెళ్లిపోతాను అంటుంది. దీంతో గగన్‌ నువ్వు లేకపోతే నా జీవితమే లేదమ్మా నీకోసం నేను క్షమాపణ చెప్తానమ్మా అంటూ తల్లి మాట కాదనలేక వంశీ చేతులు పట్టుకుని  గగన్‌ సారీ చెప్తాడు. తొందరపడి చేయి చేసుకున్నందుకు నన్ను క్షమించు అంటాడు. దీంతో వాళ్ల డాడీ చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పడం కాదు. నువ్వు మా వాడి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈ పెళ్లి జరగదు అంటాడు. దీంతో గగన్‌ మోకాళ్ల మీద కూర్చుని వంశీ కాళ్లు పట్టుకుని సారీ చెప్తాడు. మరోవైపు శరత్ చంద్ర ఇంట్లో అందరూ డల్లుగా కూర్చుని ఉంటారు. భూమి వస్తుంది.

భూమి: ఏంటి అందరూ అలా కూర్చున్నారు. డాన్స్‌ ప్రాక్టీస్‌ చేయరా..?

మీరా: ఈ పెళ్లే ఆగిపోతుందేమోనని భయపడుతుంటే ఇంకా డాన్స్‌ కూడా చేయాలా..?

భూమి: ఈ పెళ్లి జరుగుతుంది ఆంటీ..

మీరా: ఆ ఎలా జరుగుతుంది అమ్మా..

భూమి: అపూర్వ ఆంటీ ఉందిగా..? ఆమె జరిపిస్తుంది. ఆంటీ మాట అంటే వాళ్లకు ఎంత గౌరవం. ఆంటీ చెప్తే వాళ్లు వింటారు. అందుకేనేమో నేనున్నానుగా వాళ్లను పెళ్లికి ఒప్పిస్తాను  అంది. కదా ఆంటీ..

అపూర్వ: అవును నేను వాళ్లతో మాట్లాడి ఒప్పిస్తాను. మీరేం కంగారు పడకండి. సంగీత్‌ కు ప్రాక్టీస్‌ చేసుకోండి.

మీరా: మా వదిన చెప్పిందంటే ఇక జరిగిపోతుంది. రండి అందరం కలిసి సంగీత్‌ కు డాన్స్‌ ప్రాక్టీస్‌ చేద్దాం.

అనగానే భూమి  సాంగ్స్‌ పెట్టమని చెప్తుంది. చెర్రి సాంగ్స్‌ పెట్టగానే అందరూ డాన్స్‌ చేస్తుంటారు. చెర్రి భూమిని పక్కకు తీసుకెళ్లి  నా లవ్‌ కు  నీ హెల్ప్‌ కావాలని అడుగుతాడు. నీ లవ్వుకు నేను హెల్ప్ ఎలా చేయాలి అని అడుగుతుంది. దీంతో  ప్రభుదేవా డాన్స్‌ చూపించి నాకు ఆ డాన్స్‌ నేర్పించు అని అడుగుతాడు. మరోవైపు సాంగ్స్‌ పెట్టిన భూమి ఫోన్‌ ను కొట్టేయమని నక్షత్రకు  చెప్తుంది అపూర్వ. సరే అని నక్షత్ర ఆ ఫోన్‌ తీసుకురావడానికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Politics: సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
సంక్రాంతికి వస్తున్నాం- జగన్, కేసీఆర్‌ల జనం బాట.. కొత్త స్ట్రాటజీ హిట్టా ఫట్టా!
Dwarampudi Chandrasekhar Reddy Latest News: వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
2024 Layoffs: డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
డేంజర్ బెల్స్- ఆ ఉద్యోగులకు మాత్రం పీడకలగా మారిన 2024
Kickboxing: తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
తెలంగాణలో కిక్‌ బాక్సింగ్‌కు గుర్తింపు లేదు, సహకారం కోసం లేదని ప్లేయర్స్ ఆవేదన
Embed widget