Meghasandesam Serial Today September 6th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమి మెడలో తాళి కట్టిన గగన్ - షాక్ లో పడిపోయిన శరత్, ఉదయ్
Meghasandesam serial today episode September 6th: తాగిన మైకంలో భూమిని ఎత్తుకుని వెళ్లి గుడిలో తాళి కడతాడు గగన్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: బ్యాచిలర్ పార్టీలో పోటాపోటీగా భూమి, గగన్ ఇద్దరూ మందు కొడతారు. మందు మత్తులో భూమిని ఎత్తుకుని గగన్ ఏవేవో మాటలు చెప్తుంటాడు. అంతా దూరం నుంచి గమనించిన ఉదయ్ ఫ్రెండ్స్ ఉదయ్‌ని వెటకారంగా మాట్లాడతారు. నీకు కాబోయే పెళ్లాం వాడితో కలిసి మందు కొడుతుంది.
ఉదయ్ ఫ్రెండ్: ఓరేయ్ మామ వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారని పెళ్లి వరకు వెళ్లారని తెలిసింది నిజమేనా..?
ఉదయ్ ఫ్రెండ్: అంటే వీడు సెకండ్ హ్యాండ్ అన్నమాట.
ఉదయ్: రేయ్ వాళ్లేమీ ప్రేమించుకోలేదు. పెళ్లి పెద్దలు కుదిరిస్తే.. అభిప్రాయాలు కుదరక దూరంగా ఉన్నారురా..?
ఉదయ్ ఫ్రెండ్: వాళ్లిద్దరిని చూడరా.. ఒకరి కళ్లలోకి ఒకరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో..
ఉదయ్: ఇప్పుడు చూడు వీణ్ని ఎలా ఫూల్ ను చేస్తానో..( మనసులో అనుకుని, గగన్ దగ్గరకు వెళ్తాడు) అరేయ్ నేనేదో క్యాజువల్ గా పిలిస్తే సిగ్గు లేకుండా వచ్చేస్తావా..?
భూమి: మీరే కాదు నేను కూడా పిలిచాను.
ఉదయ్: భూమి ఇది నేను నా ఫ్రెండ్స్‌కు ఇస్తున్న బ్యాచిలర్ పార్టీ. ఇతన్ని ఎందుకు పిలిచావు.
భూమి: ఫ్రెండ్స్ మీకే కాదండి నాకు కూడా ఉంటారు కదా..? మీరు మీ ఫ్రెండ్స్ ను పిలుచుకున్నప్పుడు నేను నా ఫ్రెండ్‌ను పిలుచుకున్నాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి..
ఉదయ్: నో నో అలాంటిదేం లేదు..
అంటూ ఉదయ్ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాడు. తర్వాత మందు మత్తులో గగన్, భూమిని ఎత్తుకుని వెళ్తుంటే.. ఉయద్ ఫ్రెండ్స్ చూసి వాడు నీ పెళ్లాన్ని ఎత్తుకుని పోతున్నాడురా.. అంటూ నవ్వుతుంటారు. ఉదయ్ కోపంగా గగన్, భూమిని ఎత్తుకుని వెళ్లడం వీడియో తీస్తాడు. అలాగే భూమిని ఎత్తుకుని బయట రోడ్డు మీదకు వెళ్లిపోతాడు గగన్.
భూమి: ఈ క్షణం మనం ఇలాగే ఆగిపోతే చాలు బావ
గగన్: కాలం ఇక్కడే ఆగిపోతే.. నా ప్రేమ నీకు ఇంతే దొరుకుతుంది. అదే కాలం ముందుకు జరుగుతుంటే.. జీవితాంతం మనం హ్యాపీగా ఉండొచ్చు..
అంటూ నడుచుకుంటూ వెళ్తారు. ఎదురుగా మర్రిచెట్టు ఉంటుంది. చెట్టు కింద అమ్మవారు ఉంటుంది. దీంతో గగన్, భూమిని ఎత్తుకుని అమ్మవారి దగ్గరకు వెళ్తాడు. అక్కడ వెళ్లి ఇద్దరూ కలిసి అమ్మవారికి మొక్కుకుంటారు.
భూమి: బావ ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందామా..?
గగన్: ఇప్పుడు ఎలా భూమి
భూమి: చెప్తాను.. కదా..?
అంటూ భూమి అక్కడే అమ్మ వారికి ఉన్న పూల దండలు తీసి ఒకటి గగన్‌కు ఇస్తుంది.. ఇంకొకటి తాను పట్టుకుంటుంది.
గగన్: ఎందుకు భూమి ఈ దండలు ఏం చేద్దాం..
భూమి: ఏం లేదు బావ ఈ దండలు మనం మార్చుకుందాం.. నువ్వు నా మెడలో దండ వేయ్.. నేను నీ మెడలో దండ వేస్తాను.
అని చెప్పగానే గగన్ తన చేతిలో ఉన్న పూలదండను భూమి మెడలో వేస్తాడు. భూమి కూడా తన చేతిలో ఉన్న దండను గగన్ మెడలో వేస్తుంది. ఇంతలో గగన్ ఆగలేక అమ్మ వారి ముందు ఉన్న పసుపు కొమ్ము తీసుకుని అక్కడే ఉన్న పసుపు దారం తీసుకుని రెండు కలిసి తాళిలా కట్టి.. అది తీసుకుని భూమి మెడలో కడతాడు. భూమి తన మెడలో గగన్ కట్టిన తాళి చూసుకుని ఎమోషనల్ అవుతూ ఏడుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















