Meghasandesam Serial Today October 25th: ‘మేఘసందేశం’ సీరియల్: శారదకు నిజం చెప్పిన ప్రసాద్ – భూమి ఫోటోలు తీసిన చెర్రి
Meghasandesam Today Episode: శోభాచంద్ర డ్రైవర్ నాగరాజు కనిపించడంతో నిజం తెలుసుకుంటాడు ప్రసాద్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Meghasandesam Serial Today Episode: గగన్ దగ్గర నుంచి భూమిని తీసుకుని ఇంటికి వచ్చిన శరత్ చంద్ర, నక్షత్రను పిలిచి కొత్త బట్టలు తీసుకొచ్చానని ఇస్తాడు. భూమికి కూడా బట్టలు ఇస్తూ మీ ఇద్దరికీ ఒకేలాంటి డ్రెస్ తెచ్చానని శరత్ చంద్ర చెప్పడంతో నక్షత్ర ఇరిటేటింగ్ ఫీలవుతుంది. ఇద్దరికీ ఒకేలాంటి డ్రెస్ ఎలా తెస్తారని ప్రశ్నిస్తుంది.
శరత్: నాకు ఇద్దరు వేర్వేరు కాదమ్మా.. నువ్వెంతో భూమి కూడా అంతే..
నక్షత్ర: అలా ఎలా డాడీ.. నాకు తనకు పోలికేంటి..?
శరత్: నిన్న మీ మమ్మీని ఆ గగన్ గాడు చంపినంత పని చేశాడు. కానీ భూమి చూస్తూ కూర్చుందా? నాకు ఇద్దరూ సమానమే.. పెళ్లిలో మీరిద్దరూ ఈ డ్రెస్ వేసుకుని తిరుగుతుంటే చూసేవాళ్లందరూ మీ ఇద్దరూ సిస్టర్స్ అనుకోవాలి.
నక్షత్ర: అంటే ఏంటి డాడీ.. ఈ డ్రెస్ నాకోసం తీసుకురాలేదన్న మాట. తన కోసం తెస్తూ నాకు తెచ్చారన్నమాట. తనతో సమానంగా నన్ను చూసినప్పుడు నాకు ఈ డ్రెస్ వద్దు.
శరత్: నక్షత్ర..
భూమి: అంకుల్ మీరు ఉండండి. కన్నవాళ్లు తెచ్చే వస్తువుల్లో ప్రేమ ఉంటుంది కానీ వ్యత్యాసం ఉండదు.
నక్షత్ర: అమ్మానాన్నల ప్రేమ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు.
అంటూ కోపంగా నక్షత్ర వెళ్లిపోతుంది. శరత్ చంద్ర వచ్చి భూమిని తన మాటలు పట్టించుకోవద్దని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు డ్రైవర్ నాగరాజును రోడ్డు మీద చూసిన ప్రసాద్ దగ్గరకు వెళ్లి నిజం అడుగుతాడు. నాగరాజ్ భయంతో పారిపోతాడు. కృష్ణ ప్రసాద్ పరుగెత్తుకుంటూ వెళ్లి నాగరాజును పట్టుకుని కొడితే నిజం చెప్తాడు. ఫ్యాక్టరీ దగ్గరకు అపూర్వ వచ్చి తనకు డబ్బులిచ్చి పంపించిన విషయం చెప్తాడు. దీంతో ఇదే నిజం శరత్ చంద్రకు చెప్దువు పద అంటాడు. నాగరాజ్ భయంతో ప్రసాద్ ను తోసేసి పారిపోతాడు. మరోవైపు ఇందును పెళ్లికూతురుని చేస్తుంటారు.
బామ్మ: ఇందును పెళ్లికూతురుని కూడా చేసేశాం. కాసేపట్లో పెళ్లి మండపానికి కూడా వెళతాం. పెళ్లి మండపంలో అందరూ పెళ్లికూతురు తండ్రి ఎక్కడ అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి.
మీరా: అవును వదిన కూతురు పెళ్లికి తండ్రి లేకపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు.
అపూర్వ: అవును కదా? పెళ్లికి వచ్చి వాళ్లందరూ ఏమనుకుంటారు. వచ్చిన వాళ్లందరూ వాళ్ల బావ గురించి అడిగితే నా బావకు అవమానం. ( అని మనసులో అనుకుంటుంది.) మీరా మనం వెళ్లి కృష్ణప్రసాద్ ను తీసుకొద్దాం.
అని వెళ్లిపోతారు. మరోవైపు చెర్రి వెళ్తుటే.. భూమి కొత్త డ్రెస్ వేసుకుని బ్యూటిఫుల్ గా రెడీ అయి వస్తుంది. చెర్రి ఆగిపోయి అలాగే చూస్తుంటాడు. భూమి.. శోభాచంద్ర ఫోటో దగ్గరకు వెళ్లి మొక్కుతుంది. చెర్రి దగ్గరకు వెళ్లి ఫోటోలు తీస్తాడు. రోడ్డు మీద వెళ్తున్న కృష్ణప్రసాద్ దగ్గరకు మీరా, అపూర్వ వెళ్తారు.
మీరా: ఏంటండి మీరు అమ్మాయి పెళ్లిలో లేకుండా వెళ్లిపోతారా..? మీరు లేకుండా పెళ్లి జరగుతుంది అనుకుంటున్నారా? రండి..
ప్రసాద్: నేను వస్తాను నువ్వు వెళ్లు..
మీరా: మిమ్మల్ని వదిలేస్తే మీరు రారు..
ప్రసాద్: వస్తానంటున్నాను కదా నువ్వు వెళ్లు..
మీరా: అయన వస్తానని చెప్తున్నారు వదిన మాట చెప్పారంటే వస్తారు. ఏదో పని ఉందని కంగారుగా వెళ్లిపోతున్నారు.
అని మీరా చెప్పగానే అపూర్వ సరే ఇంటికి వెళ్దాం పద అని వెళ్లిపోతారు. కృష్ణప్రసాద్ భూమిని పిలుస్తూ శారద ఇంటికి వెళ్తాడు. భూమి ఎక్కడ అని అడుగుతాడు. ఇందు పెళ్లి కదా ఆ ఇంట్లోనే ఉందని చెప్తుంది శారద. దీంతో గగన్, భూమి మధ్య జరిగిన గొడవ గురించి చెప్పి భూమిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!