Meghasandesam Serial Today May 30th: ‘మేఘసందేశం’ సీరియల్: శారదకు వార్నింగ్ ఇచ్చిన శరత్ చంద్ర – విడాకులు అయ్యాకే పెళ్లి అన్న అపూర్వ
Meghasandesam Today Episode: శారదను పిలిచి కేపీతో విడాకులు తీసుకున్న తర్వాతే గగన్, భూమిల పెళ్లి చేస్తామని అపూర్వ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: శారద దగ్గరకు వెళ్లిన కృష్ణ ప్రసాద్ హ్యాపీగా ఫీలవుతాడు. తాంబూలాలు మనం ఇద్దరం కలిసి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తాడు. నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతున్నావు కదా శారద అని అడుగుతాడు.
శారద: ఇప్పుడు నా ఫీలింగ్స్ తో పనేం ఉంది లేండి. ఈ మాట చెబుదామనే ఆదరాబాదరాగా పరుగెత్తుకుంటూ వచ్చారా..?
కేపీ: లేదు శారద. ఒక నిర్ణయంతో వచ్చాను. శారద ఈ ఇంటి మంచి చెడ్డా నేను ఎప్పుడూ చూసుకోలేదు. కానీ ఇప్పుడు నీతో నిలబడతాను. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మనిద్దరం కలిసి దగ్గరుండి భూమి, గగన్ ల పెళ్లి జరిపిద్దాం శారద. అప్పుడు పెళ్లిలో మన గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడరు ఏమంటావు.
శారద: అనడానికి ఏముందండి.. మీరు చెప్పినట్టే జరిపిద్దాం..
కేపీ: శారద థాంక్యూ.. థాంక్యూ సోమచ్..
శారద: ఒక్క నిమిషం అండి ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు. పెళ్లి పత్రికల మీద మన కుమారుడైన గగన్ అని పేర్లు ముద్రించడంతో సహా పెళ్లి మొత్తం మన ఇద్దరి చేతుల మీదుగానే జరిపిద్దాం.
కేపీ: అదే కదా నేను చెప్తుంది.
శారద: పెళ్లి అయిపోయిన తర్వాత వధూవరులైన మన గగన్, భూమిలతో పాటు మనిద్దరం కూడా ఈ ఇంటికే వచ్చేద్దాం. ఇక్కడే మనం మన పిల్లలతో మన కోడలు భూమితో హాయిగా ఉందాం. ఇంక ఆ ఇంటివైపు చూడాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. ఏంటండి మాట్లాడరేం మనం ఇక్కడికి వచ్చేద్దామా..? చెప్పండి.
కేపీ: అంటే శారద అది..
శారద: ఓ మీరు వస్తానంటే గగన్ ఒప్పుకోడని భయపడుతున్నారా..? వాడికి ఈ అమ్మ మాటంటే వేదం. నేను గీచిందే గీత. నేను వాడికి నచ్చజెప్పుకుంటానులేండి.. సరేనా..?
కేపీ: శారద నేను ఇక్కడికి వచ్చేశానంటే శరత్ చంద్ర గారు నీ మీద పూరి మీదే కాదు. మన గగన్ మీద కూడా పగ పెంచేసుకుంటారు.
శారద: ఓ పెళ్లి తర్వాత మీరు నాతో రారు అన్నమాట. అత్తారింటికి మొగుణ్ని పంపేసినట్టు నన్ను ఇక్కడికి పంపేస్తున్నారు అన్నమాట.
కేపీ: అది కాదు శారద..
శారద: వద్దండి ఇంకేం మాట్లాడొద్దు. పెళ్లిలో నలుగురు నాలుగు విధాలుగా అనుకోకూడదని నా పక్కన నిలబడతారు. మీ బాధేంటి విడివిడిగా పెళ్లి పందిరిలో తిరుగుతున్న మనల్ని చూసి నలుగురు నాలుగు విధాలుగా అనుకోకూడదని అంతేనా..? అలా అనుకోకుండా ఉండటానికి ఇంకోక దారి ఉంది.
కేపీ: అంటే నన్ను పెళ్లిలోనే ఉండొద్దు అంటావా..?
శారద: మీరు ఉండకపోతే ఎలా..? మీరు భూమి మేనమామ. మీరు కచ్చితంగా ఉండాలి.
కేపీ: నేను ఉంటే పెళ్లిలో మన గురించి నలుగురు తప్పుగా అనుకోకుండా ఉంటారా..? అదెలా అవుతుంది.
శారద: అవుతుంది. మనం విడాకులు తీసుకుంటే.. అవుతుంది.
అని శారద చెప్పగానే కేపీ షాక్ అవుతాడు. విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని కరాకండిగా చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత శారద, శరత్ చంద్ర ఇంటికి వెళ్తుంది.
శారద: ఎందుకు పిలిచారు…
శరత్: విడాకుల గురించి మాట్లాడాలి అని పిలిచాం
శారద: ఒప్పుకున్నాను కదా..?
అపూర్వ: నువ్వు ఒప్పుకున్నావు మరి కేపీ ఒప్పుకోవద్దూ..?
శారద: మీరే ఏదో ఒకటి చెప్పి.. లేదా మీరాతో చెప్పించి ఒప్పించండి..
అపూర్వ: ఎవరు ఒప్పుకున్నది వాళ్లే చేయాలి శారద. నువ్వే కేపీని విడాకులకు ఒప్పించాలి.
శారద: ఒకవేళ ఆయన విడాకులకు ఒప్పుకోకపోతే
అపూర్వ: సింపుల్ ఈ పెళ్లి జరగదు. మీ విడాకులు అయ్యాకే భూమి, గగన్‌ల పెళ్లి
అని చెప్పి శారదను అక్కడి నుంచి పంపించేస్తారు. శారద వెళ్లిపోయాక అక్కడికి గగన్ వస్తాడు. గగన్‌ను చూసిన అపూర్వ, శరత్ చంద్ర షాక్ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















