Meghasandesam Serial Today May 28th: ‘మేఘసందేశం’ సీరియల్: తాంబూలాలు మార్చుకున్న రెండు ఫ్యామిలీలు – హ్యాపీ మూడ్‌లో గగన్, భూమి
Meghasandesam Today Episode: గగన్, భూమిల పెళ్లితంతులో రెండు కుటుంబాలు తాంబూలాలు మార్చుకుంటాయి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: తాంబూలాలు మార్చుకోవడానికి శరత్‌చంద్ర వాళ్ల ఇంటికి గగన్ వాళ్లు వస్తారు. దీంతో భూమిని ఇందు, బిందు కలిసి రెడీ చేస్తుంటారు. ఇంతలో అక్కడికి నక్షత్ర వస్తుంది. గగన్ ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది పోటీ పడ్డారని కానీ ఆ అవకాశం నీకు వచ్చిందని బిందు అంటుంది. దీంతో నక్షత్ర కోప్పడుతుంది.
నక్షత్ర: ఏయ్ ఏంటో నీ ఉద్దేశం నువ్వు ఇన్‌డైరెక్టుగా నన్నే కదా అంటున్నావు.
బిందు: నిన్ను నేను ఏమన్నాను..?
నక్షత్ర: చాలా మంది మనసు పడ్డారు అంటే అందులో నేను ఉన్నాననేగా అర్థం.
బిందు: చాలా మందిలో నువ్వు ఉన్నావు.. భూమిలా అన్నయ్యకు దక్కే ఒకే ఒక్క మనిషివి కాదు కదా..?
నక్షత్ర: ఓ మీరందరూ ఎగిరెగిరి పడుతున్నారే అసలు ఈ పెళ్లి జరు..
అంటుండగానే.. అపూర్వ వచ్చి నక్షత్రను కొడుతుంది.
నక్షత్ర: ఎందుకు కొట్టావు మమ్మీ..
అపూర్వ: నిన్ను కొట్టాలా..? చంపాలా..? గగన్ నీకు దక్కలేదన్న ఉక్రోషంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ముందు నువ్వు వెళ్లు ఇక్కడి నుంచి
నక్షత్ర: నేను వెళ్లను..
అపూర్వ: వెళ్లు… వెళ్లు.. అమ్మా భూమి ఇవి మా శోభాచంద్ర అక్క నగలు ఇవి నువ్వు వేసుకుంటే అచ్చం తనలాగే ఉంటావు.
భూమి: ఒకసారి మీరు బయటకు వెళ్లండి నేను పిన్నితో పర్సనల్ గా మాట్లాడాలి.
ఇందు: అలాగే భూమి
అంటూ ఇందు, బిందు బయటకు వెళ్లిపోతారు. భూమి డోర్ క్లోజ్ చేస్తుంది.
భూమి: ఏంటి పిన్ని ఈ నాటకం. లేని ప్రేమంతా మాటల్లోనో.. నీ అద్బుతమైన నాటకంలోనో తెగ చూపించేస్తున్నావు.
అపూర్వ: చూపిస్తున్న ప్రేమంతా నటనే.. బాగానే కనిపెట్టావు. కానీ ఏం చేయాలే ఓడిపోతున్నాం అనుకున్నప్పుడు ఒక అడుగు వెనక్కి వేయాలి తప్పదు. నా బావ దృష్టిలో నేను ఎప్పటికీ చెడ్డదాన్ని అవ్వకూడదు. అది సరే రాత్రి వాడితో వెళ్లాలనుకుని ఎందుకు ఆగిపోయావే..?
భూమి: మా నాన్నను చంపాలనుకున్న కిల్లర్ చనిపోయాడని అప్పుడే తెలిసింది. మా నాన్నను వదిలేసి వెళ్లిపోతే.. నయన గారిని ట్రాన్స్ ఫర్ చేయించి.. ఆ కిల్లర్‌ను చంపించిన కిల్లర్ రేపు మా నాన్నకు ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తుకు వస్తే తనని చంపేస్తారని భయం వేసి ఆగిపోయాను. ఆ క్రిమినల్ నీ రూపంలోనే ఇంట్లోనే ఉంటే మరీ ప్రమాదం కదా అందుకే ఆగిపోయాను.
అపూర్వ: ఏయ్ ఏం మాట్లాడుతున్నావే.. ఇంతకు ముందు నన్నే అనుమానించావు. ఇప్పుడు నన్నే అనుమానిస్తున్నావు. ఒక్కటి గుర్తు పెట్టుకో నువ్వు చెప్పినట్టు నేను దుర్మార్గురాలినే.. కానీ నా ప్రాణానికి ప్రాణమైన నా బావను చంపుకున్నేంత దుర్మార్గురాలిని కాదే..
భూమి: నమ్మొచ్చు అంటావా..? పిన్ని..
అపూర్వ: నా బావ జోలికి వచ్చిన క్రిమినల్ ఎవరో నీకు కాదు నాకు దొరికితే అక్కడికక్కడే ఈ చేతులతోనే చంపేస్తానే..నేను తగ్గింది ఎందుకంటే నిన్న రాత్రి నువ్వు వెళ్తూ వెళ్తూ ఆగిపోయావు. కదా పాపం ఆయన గురించి ఆగిపోయావని నీ మీద ప్రేమ కారిపోవడం మొదలుపెట్టింది. అందుకే నీ ప్రేమని యాక్సెప్ట్ చేసి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. చూడు నువ్వు ఆ గగన్ గాడితో పోతూ పోతూ ఈ ఆస్తి మొత్తంపట్టుకుపోవు అని ఎంతో కొంత మాకు మిగిలేలా చూసుకుంటానని బావ నాకు హమి ఇచ్చారు అందుకనే నేను సైలెంట్‌గా పెళ్లికి ఒప్పుకున్నాను. చాలా వచ్చిందా క్లారిటీ
అని చెప్పి అపూర్వ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతుంది. బయట ఏడుస్తూ ఉన్న నక్షత్ర దగ్గరకు వెళ్లి తిడుతుంది. తర్వాత అందరూ కూర్చుని ఉంటారు. పంతులు తాంబూలాలు మార్చుకోవడానికి టైం వచ్చిందని ఇక కానివ్వండి అని చెప్తాడు.
అపూర్వ: ఎవరితో మార్చుకోవాలి పంతులు గారు తాంబూలాలు ఇవ్వడానికి ఇక్కడ మేము భార్యభర్తలం ఉన్నాము. పాపం తీసుకోవడానికి శారద పక్కన ఎవ్వరూ లేరు కదా
గగన్: మా తరపున ఇందు చెల్లి.. వంశీ బావ తీసుకుంటారు
అని చెప్పగానే ఇందు, వంశీ వచ్చి తాంబూలాలు మార్చుకుంటుంటే.. ఇంతలో చెర్రి పరుగు వచ్చి ఆగండి మా నాన్న వస్తున్నారు అని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో కేపీ వస్తాడు. శారద, కేపీ కలిసి తాంబూలాలు తీసుకుంటారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















