Meghasandesam Serial Today May 27th: ‘మేఘసందేశం’ సీరియల్: శరత్ చంద్ర ఇంటికెళ్లిన గగన్ ఫ్యామిలీ – ఇష్టం లేకుండానే పెళ్లికి ఒప్పుకున్న శరత్
Meghasandesam Today Episode: భూమి కన్వీన్స్ చేసి గగన్ వాళ్లను తమ ఇంటికి నిశ్చితార్థానికి తీసుకెళ్లడంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: భూమి శారద వాళ్ల ఇంటికి వచ్చి తమ పెళ్లికి శరత్ చంద్ర ఒప్పుకున్నాడని చెప్తుంది. దీంతో పూర్ణి హ్యాపీగా ఇప్పుడే అమ్మా అఏ విషయం చెప్తుంది. నువ్వు మీ నాన్నను ఒప్పిస్తావని ఇంతలో నువ్వే ఇచ్చి గుడ్ న్యూస్ చెప్తున్నావు భూమి అంటుంది.
భూమి: అత్తయ్యా దేవత లాంటిది తన నోటి నుంచి వచ్చే ఏ మాట పొల్లు పోదు. కదా అత్తయ్యా..?
శారద: అంత పెద్ద పోలిక ఎందుకు లేమ్మా.. మీరిద్దరు కలిసి ఉంటే బాగుంటుదని ఆశ కొద్ది అలా అన్నాను. ఏదో అలా జరిగిపోయింది.
భూమి: అదేంటి అత్తయ్యా నేను ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తే మీరు అంత డల్‌గా మాట్లాడుతున్నారు.
శారద: డల్‌గా ఏమీ మాట్లాడటం లేదమ్మా.. ఆనందంలో నోట మాట రావడం లేదు. అంతేనమ్మా..
భూమి: అంతేనా..? అయితే పటాపట్ రెడీ అయ్యి మీరు మా ఇంటికి వచ్చేయండి ఈ రోజే నిశ్చితార్థం పెట్టుకుందామని నాన్న చెప్పమన్నారు.
గగన్: మేము ఎక్కడికీ రావడం లేదు. నువ్వు వెళ్లొచ్చు..
భూమి: అదేంటండి మీరు ఆలా మాట్లాడుతున్నారు.
గగన్: నాకు ఒక్కోక్కసారి ఒక్కోలా మాట్లాడటం రాదు. కావాలనుకున్నప్పనుడు వస్తానని కాదనుకున్నప్నుడు రాదని చెప్పడం అస్సలు రాదు. నేను ఏమైనా బొమ్మను అనుకున్నావా..? డబ్బులిచ్చి కొనుక్కుని నచ్చకపోతే రిటర్న్ చేయడానికి నీతో నిశ్చితార్థం వద్దు పెళ్లి వద్దు.
అని చెప్పి గగన్ పైకి వెళ్లిపోతాడు. భూమి ఏడుస్తుంది. శారద, పూర్ణి ఓదారుస్తారు. భూమి పైకి గగన్ రూంలోకి వెళ్తుంది.
భూమి: బావ రాత్రి రానని చెప్పి మిమ్మల్ని బాగా డిస్సపాయింట్ చేశాను. సారీ బావ. నాతో మాట్లాడరా..? ఫ్లీజ్ బావ మాట్లాడండి కోపం ఉంటే కొట్టండి అంతే కానీ మీ మౌనంతో నన్ను కాల్చేయకండి.
గగన్: మాట్లాడటానికి మన మధ్య ఏం మిగల్లేదు. మరోసారి మోస పోయే శక్తి నాకు లేదు. నువ్వు వెళ్లొచ్చు.
భూమి: మోసమా..? నేను నిన్ను మోసం చేస్తున్నానా..? బావ.
గగన్: వస్తానని చెప్పి రాకపోవడాన్ని ఇంకేమంటారు మోసం కాదా..?
భూమి: ఎందుకు రాలేకపోయానో ఒక్కసారైనా ఆలోచించలేకపోయావా బావ.
గగన్: ఒక్కసారి జరిగితే ఆలోచించొచ్చు.. జరిగిందే రిపీట్ అవుతుంటే ఎలా ఆలోచించాలి.
భూమి: సరే బావ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. రాత్రి మా అమ్మను కూడా వదిలి వచ్చానని చెప్పారు కదా అదే అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంటే అలాగే వదిలేసి వచ్చేవారా..? నా పరిస్తితి కూడా అదే బావ. నాన్న ప్రాణం ప్రమాదంలో ఉంది. నిజానికి నేను నీతో వస్తాను అన్నప్పుడు నేను ఏమీ ఆలోచించలేదు. రావడానికి బట్టలు కూడా సర్దేసుకున్నాను. సూట్ కేసులో రెడీగా ఉండటం మీరే చూశారు కదా..? ఎందుకలా ఉంటాను.
గగన్: ఏమైంది…?
భూమి: బట్టలు సర్దుకునేటప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. నాన్నను చంపాలనుకున్న కిల్లర్ తనకు ఎవరా పని అప్పగించారో చెప్పకుండానే చచ్చి పడి ఉన్నాడు. కొత్తగా వచ్చిన ఏసీపీ వాడు సూసైడ్ చేసుకున్నాడని చెప్పాడు. కానీ ఏసీపీ నయని గారు ఫోన్ చేసి ప్లాన్‌గా చంపేశారని చెప్పింది. నాన్నని జాగ్రత్తగా చూసుకోమని నాన్నకు ప్రాణానికి ప్రాణాపాయం ఉందని హెచ్చరించిది. దాంతో నేను సందిగ్దంలో పడిపోయాను. నాన్న వదిలి రావడానికి మనసు ఒప్పుకోలేదు. అందుకే రాలేదు బావ.
గగన్: మరి ఈ విషయం రాత్రే చెప్పొచ్చు కదా..?
భూమి: రావాలి.. రాకూడదు అనే ఊగిసలాటలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు.
అంటూ భూమి ఏడుస్తుంది. గగన్ సరే ఊరుకో అంటూ భూమిని ఓదారుస్తాడు. మీ నాన్న చెప్పినట్టే మేము మీ ఇంటికి వస్తాము అని చెప్తాడు. భూమి హ్యాపీగా కిందకు వెళ్లి శారదకు చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత శారద వాళ్లు అందరూ కలిసి శరత్ చంద్ర ఇంటికి నిశ్చితార్థానికి వెళ్తారు. అందరూ హ్యాపగా ఉంటారు. శారద లోపల్లోపల బాధపడుతుంది. నక్షత్ర బాధపడుతుంది.
శరత్ చంద్ర: పెట్టిపోతల గురించి మాట్లాడుకుంటే మంచిదేమో..?
శారద: మా ఇంటి కోడలిగా పంపించడమే మా అదృష్టం. అంతకు మించి మీ దగ్గర నుంచి మేమేమీ ఆశించడం లేదు.
శరత్: బిందు, ఇందు అల్లుడు గారికి ఇల్లంతా చూపించండి అమ్మా..
బిందు: అన్నయ్యకు మేము చూపించడం కంటే భూమి చూపించడమే బాగుంటుంది మామయ్య.
అంటూ బిందు చెప్పగానే.. శరత్ చంద్ర, అపూర్వను చూస్తాడు. చూడనిలే అంటూ అపూర్వ సైగ చేస్తుంది. దీంతో శరత్ చంద్ర భూమిని ఇల్లు చూపించమని చెప్తాడు. సరేనని భూమి, గగన్‌ను తీసుకుని వెళ్తుంది. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















