Meghasandesam Serial Today May 26th:l‘మేఘసందేశం’ సీరియల్: శారద ఇంటికి వెళ్లిన భూమి – భూమిని ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్న గగన్
Meghasandesam Today Episode: శరత్ చంద్ర పెళ్లికి ఒప్పుకోవడంతో గగన్ ఇంటికి వెళ్తుంది భూమి తర్వాత ఏం జరిగిందనేది ఇవాళ్టీ ఏపిసోడ్ లో చూడాల్సిందే

Meghasandesam Serial Today Episode: భూమిని తన కొడుకు గగన్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని శారద, శరత్ చంద్ర ఇంటికి వెళ్లి అడుగుతుంది. మొదట శారదను తిట్టిన శరత్ చంద్ర తర్వాత అపూర్వ చెప్పడంతో భూమిని మీ ఇంటికి కోడలుగా పంపించాలంటే.. శారదను కృష్ణ ప్రసాద్‌కు డైవర్స్ ఇవ్వమని అడుగుతాడు. దీంతో శారద ఏడుస్తుంది. మీరు చెప్పినట్టే డైవర్స్ ఇస్తానని ఒప్పుకుంటుంది. దీంతో శరత్ చంద్ర షాక్ అవుతాడు. అయితే మేము ఇలా కండీషన్ పెట్టినట్టు ఎవ్వరికీ తెలియకూడదని తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని.. ఎలా ఆగిపోతుందంటే నీ ముద్దుల కొడుకు చనిపోవడం వల్ల అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. ఎవ్వరికీ చెప్పనని పెళ్లి జరిపించమని చెప్పి శారద వెళ్లిపోతుంది.
శరత్: ఏంటి అపూర్వ ఇలా జరుగుతుంది. ఇప్పుడ ఆ గగన్ గాడిని భూమికి ఇచ్చి పెళ్లి చేయాలా ఏంటి.?
అపూర్వ: జరిపించడం ఏంటి బావ. జస్ట్ మనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాము. కేపీతో ఈ శారద విడాకులు తీసుకునే మార్గం మనకు దొరికింది. అలాగే భూమి ప్రేమ కథలో విలన్ అయిపోతున్నాను అని బాధపడ్డావు కదా అలా కాకుండా వాళ్లంతట వాళ్లే ఈ పెళ్లిని వద్దనుకునేలా నేను చేస్తాను బావ. భూమి ప్రేమను అంగీకరిస్తున్నట్టు యాక్ట్ చేయ్ అంతే.. మిగతాది అంతా నేను చూసుకుంటాను బావ.
అని అపూర్వ చెప్పగానే శరత్ చంద్ర మౌనంగా వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లిన శారద ఏడుస్తూ కూర్చుని ఉంటుంది అపూర్వ పెట్టిన కండీషన్ గుర్తు చేసుకుని బాధపడుతుంది. మరోవైపు భూమి కూడా ఏడుస్తుంది. తర్వాత శరత్ చంద్ర హల్లో నిలబడి అందరినీ పిలుస్తాడు. అందరూ వస్తారు.
శరత్: మీ అందరికీ ఓ న్యూస్ చెప్పాలి. ముఖ్యంగా ఈ న్యూస్ భూమి గురించి..
కేపీ: భూమి రాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయిందని ఇప్పుడు మీ అన్నయ్య చెప్పబోతున్నాడు.
శరత్: తన గురించి చెప్పే న్యూస్‌కు తనే లేకపోతే ఎలా..? కృష్ణ ప్రసాద్ భూమిని పిలువు..
కేపీ: భూమి ఉందా బావగారు.
శరత్: అలా అడుగుతున్నావేంటి..? తన రూంలో ఉంది చూడు.
కేపీ: భూమి ఇంట్లోంచి వెళ్లిపోయిన సంగతి బావగారికి ఇంకా తెలియదు అనుకుంటా..?
శరత్: ఏంటి కృష్ణ ప్రసాద్ భూమిని పిలవమంటే మా చెల్లితో మాట్లాడతావేంటి..? వెళ్లి పిలువు.
అనగానే కేపీ వెళ్లి భూమిని తీసుకొస్తాడు. శరత్ చంద్ర పనిమనిషితో స్వీట్ తీసుకువచ్చి అందరికీ పంచమని చెప్తాడు. అలాగేనని స్వీట్స్ పంచుతుంది. అందరూ స్వీట్లు తింటుంటే భూమి పెళ్లి గగన్‌తో చేస్తున్నామని అందుకోసం తాను ఒప్పుకున్నట్టు శరత్ చంద్ర చెప్తాడు. ఆ మాటలకు భూమి హ్యాపీగా ఫీలవుతుంది. నక్షత్ర షాక్ అవుతుంది. శరత్ చంద్రను హగ్ చేసుకున్న భూమి.. ఆనందంగా ఈ విషయం వెంటనే గగన్‌కు చెప్పాలని భూమి శారద వాళ్ల ఇంటికి పరుగెత్తుకుని వెళ్తుంది.
భూమి: అత్తయ్యా మనందరికీ ఒక గుడ్ న్యూస్. మా నాన్న గారు మా పెళ్లికి ఒప్పుకున్నారు. మీరు పటాపట్ రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేయండి. నిశ్చితార్థం పెట్టుకుందామని నాన్న చెప్పమన్నారు.
గగన్: మేము ఎక్కడికి రావడం లేదు. నువ్వు వెళ్లొచ్చు. నాకు ఒక్కోక్కసారి ఒక్కోక్కలా మాట్లాడటం రాదు. కావాలనుకున్నప్పుడు వస్తానని కాదనుకున్నప్పుడు రానని చెప్పడం అసలు రాదు. నీతో నిశ్చితార్థం వద్దు పెళ్లి వద్దు.
అంటూ గగన్ కోపంగా పైకి వెళ్లిపోతాడు. శారద చెప్పినా గగన్ వినడు. గగన్ మాటలకు భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమిని, శారద, పూరి ఓదారుస్తుంటారు. పైకి వెళ్లిన గగన్ కూడా ఏడుస్తుంటాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















