Meghasandesam Serial Today March 17th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమిని ఇంప్రెస్ చేసిన గగన్ – గగన్‌కు ఐలవ్యూ చెప్పిన భూమి
Meghasandesam Today Episode: హాస్పిటల్‌లో గగన్ కంగారు పడుతుంటే భూమి తన ప్రేమ విషయం చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode : నక్షత్రను గగన్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని అడగడానికి అపూర్వ, శారద దగ్గరకు వెళ్తుంది. అదే విషయం శారదకు చెప్తుంది. దీంతో శారద తనకు ఇష్టం లేదని చెప్తుంది. అయినా అపూర్వ వినకుండా శారదను కన్వీన్స్ చేయాలని చూస్తుంది.
శారద: చూడండి అపూర్వ గారు మీరు చెప్పాల్సింది అంతా చెప్పారు. ఒక తల్లిగా మీరు పడుతున్న వేదన మాకు అర్తం అవుతుంది. కానీ దయచేసి మమ్మల్ని క్షమించండి. మీ అమ్మాయితో మా గగన్ పెళ్లి జరిపించలేను.
అపూర్వ: మీ అమ్మాయి చెప్పినట్టు నేను ఇంత దిగొచ్చి అడుగుతున్నా కొంచెం కనికరం కూడా లేదా వదిన గారు.
శారద: మీ పరిస్థితి అర్తం అవుతుందండి.. కానీ నా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. వింటాడు కదా అని గగన్‌కు ఇష్టం లేని నక్షత్రను ఇచ్చి కట్టబెట్టి వాడి జీవితం నాశనం చేయలేను కదా..?
అపూర్వ: నాశనం ఎలా అవుతుంది. మా ఇంటికి ఏకైక వారసురాలిని మీ అబ్బాయి కట్టుకుంటే తన జీవితం నల్లేరు మీద నడక అవుతుంది కదా వదిన గారు.
శారద: సంబంధం కలుపుకోవడానికి వదిన గారు అంటున్నారని అర్థం అవుతుంది. కుదరదని చెప్పేస్తున్నాను కదా..? పదే పదే వదిన గారు అనడం వదిలేయండి. ఎప్పటిలాగే నన్ను శారద అని పిలవండి. అలాగే డబ్బుంటేనే జీవితం నల్లేరు మీద నడిచినట్టు కాదు. భూమి లాంటి మంచి మనసు ఉంటే పేదరికంలో కూడా జీవితం మల్లెతీగలా అల్లుకుపోతుంది. ముందు మీరు అది తెలుసుకోండి.
అపూర్వ: ఇక్కడ నేను నా కూతురు గురించి మాట్లాడుతున్నాను కదా..? మధ్యలో ఆ భూమి ఎందుకు వచ్చిందండి.
శారద: ఎందుకంటే భూమిని నా కోడలుగా చేసుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి.
అపూర్వ: అది చీ కొట్టి మిమ్మల్ని బయటకు పంపించేసింది కదా..?
శారద: పెళ్లి అయిపోలేదు కదా..? ఎలాగైనా కలొచ్చనే ఆశపడటంలో తప్పేముంది.
అపూర్వ: వదిలేసేయ్ శారద.. అలాంటి ఆశలు ఎవైనా ఉంటే వదిలేసేయ్.. మన నక్షత్రను గగన్‌కు ఇచ్చి పెళ్లి చేయ్ అందరం బాగుంటాము..
పూరి: చేయకపోతే..
అపూర్వ: మీ ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అయిపోతుంది.
శారద: ఏంటి అపూర్వ భయపెడుతున్నావా..? అయినా మీరెప్పుడు మమ్మల్ని మంచిగా ఉండనిచ్చారు. ఇంటికి వచ్చిన వారిని అవమానించ కూడదని ఇంతసేపు ఊరుకున్నాను వెళ్లండి.
అపూర్వ: ఎంత బలుపే..
పూరి: అపూర్వ..
శారద: చూడండి అపూర్వ గారు అవసరానికి కావాల్సింది ధైర్యం. మీలాంటి వాళ్లు చూపించేది బలుపు. ఇప్పుడు అవసరం వచ్చింది కనక ధైర్యంగా చెప్తున్నాను విను. నాకంటూ కోడలిగా వస్తే భూమి వస్తుంది.
అపూర్వ: నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ భూమిని నీకు కోడలిని కానివ్వను..
శారద: నా కంఠంలో ప్రాణం ఉండగా.. నీ కూతురిని నా కోడలిని కానివ్వను.. కానీ నీ కంఠంలో ప్రాణం ఉండగానే భూమిని నా కోడలిగా చేసుకుని చూపిస్తాను. చూస్తూ ఉండు..
అపూర్వ: ఏంటే నాతోనే చాలెంజ్ చేస్తావా..? ఈ అపూర్వతో పెట్టుకుంటే మీ బతుకులు ఏమవుతాయో చూస్తూ ఉండండి.
అంటూ చాలెంజ్ చేసి వెళ్లిపోతుంది అపూర్వ. మరోవైపు ఆఫీసులో కడుపునొప్పితో బాధపడుతుంది భూమి. గగన్ పిలిచి ఏదో లెటర్ రాయాలని చెప్పగానే కడుపునొప్పితో బాధపడుతుంటే గగన్ ఏమైందని అడగ్గానే.. కంగారులో పేపర్ వెయిట్ మింగుతుంది. దీంతో గగణ్ కంగారుగా హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. ట్రీట్‌మెంట్ జరిగాక గగన్ వెళ్లి ఎలా ఉన్నావని అడుగుతాడు. బాగానే ఉన్నాను కానీ నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు నేనంటే అంత ఇష్టమా అని అడుగుతుంది. నా ప్రాణం నువ్వు అని గగన్ చెప్తాడు. నువ్వు ప్రేమించడం లేదని చెప్పినప్పుడు చనిపోవాలనిపించింది అంటాడు. దీంతో భూమి నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ఆరోజు ఎందుకు ఇష్టం లేదని చెప్పావు అని గగన్ అడిగితే అది మాత్రం అడగొద్దని అంటుంది భూమి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















