Meghasandesam Serial Today July 17th: ‘మేఘసందేశం’ సీరియల్: చెర్రితో భూమి పెళ్లి – శారదను ఓదార్చిన గగన్
Meghasandesam Today Episode: భూమి పెళ్లి జరిగిపోతుందని శారద ఏడుస్తుంటే.. కొడుకు పెళ్లికి తల్లి సంతోషించాలని గగన్ చెప్తూ ఓదారుస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: చెర్రి ప్లాన్ ప్రకారం అందరూ పడుకున్నాక భూమి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. పోతూ పోతూ శరత్ చంద్ర రూంలోకి వెళ్లి కాళ్లు మొక్కి గగన్ బావకు తప్పా తన మనసులో ఇంకొకరికి చోటు ఇవ్వలేనని అనుకుంటూ వెళ్లిపోతుంది. మరోవైపు చెర్రి తనను ఎవరో కొడుతున్నారని ఫోన్ చేయడంతో గగన్ కారులో కంగారుగా వెళ్తాడు.
గగన్: చెర్రి నీకేం అవ్వలేదు కదా..? రేయ్ ఎవడ్రా వాడు నా తమ్ముడి జోలికి వస్తే..
చెర్రి: అన్నయ్యా ఎవ్వరూ లేరు అన్నయ్యా.. నువ్వు ఇక్కడికి రావాలనే నేను ఇలా అబద్దం చెప్పాను.
గగన్: రేయ్ నీకు కామన్ సెన్స్ లేదా..? నేను ఎంత బాధపడ్డానో తెలుసా..? ఇంకోసారి ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తే చంపేస్తాను.
చెర్రి: జోక్ కాదు అన్నయ్యా లైఫ్ మాటర్ అందుకే రమ్మన్నాను. రేపు భూమితో నా పెళ్లి అన్నయ్య..
గగన్: తెలుసు..
చెర్రి: అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను.
గగన్: అలా అనుకుంటే ఇదే మాట వెళ్లి మీ మామయ్యతో చెప్పు భూమికి ఇంకో సంబంధం తెస్తాడు.
చెర్రి: భూమిని ఎవరికో అప్పజెప్పడానికి అయితే నేను నిన్నెందుకు రమ్మంటాను అన్నయ్యా.. నీకు అప్పజెప్పడానికే నేను రమ్మన్నాను.
గగన్: రేయ్ ఏం మాట్లాడుతున్నావురా..? నీకు మైండ్ పని చేస్తుందా..?
చెర్రి: నేను చెప్పేది నిజం అదిగో భూమి వచ్చింది.
భూమి ఆటో దిగి దగ్గరకు వస్తుంది.
గగన్: నీకు ఇదొక ఆట అయిపోయింది భూమి. ప్రతిసారి నువ్వు ఆడిన ఆటలో నేను బలి అయిపోతున్నాను. కానీ ఈసారి నేను బలి అవడానికి సిద్దంగా లేను.
భూమి: బావ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మా పెళ్లి తప్పించుకోవడానికి చెర్రి ఏదో ప్లాన్ చేశాను అన్నాడు. ఆ ప్లాన్ లో భాగంగానే నన్ను ఇక్కడికి రమ్మన్నాడు.
చెర్రి: భూమి నువ్వు అన్నయ్యా వెళ్లిపోవడం ఒక్కటే దారి. అప్పుడే మా పెళ్లి ఆగిపోతుంది.
గగన్: ఏంట్రా నీ ఉద్దేశం ఈవిడ గారిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుని మీ ఇంటికి ఇల్లరికం రమ్మంటావా…?
చెర్రి: అలా అని నేను అనడం లేదు. అసలు ఆ రోజు పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా..?
గగన్: రేయ్ చాలురా నీ కహానీలు ఈ కహానీలు విని నేను అలిసిపోయాను. నీ మాట విని నేను ఈవిడ గారిని తీసుకెళ్లాను అనుకో.. తాళి కట్టే ముందే నాకు నాన్న కావాలి అంటుంది. ఓకే తాళి కట్టాను అనుకో అప్పుడు ఇల్లరికం రమ్మంటుంది. అప్పుడు తాళి కట్టిన ఈ చేతులను నేనే నరుక్కోవాలి.
చెర్రి: ఆఖరి నిమిషంలో పెళ్లి ఆపేసిందన్న కోపంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అసలు ఆరోజు పెళ్లి ఎందుకు ఆపేసిందో తెలుసా…?
అంటూ చెర్రి అసలు నిజం చెప్పబోతుంటే ఇంతలో అక్కడకు శరత్ చంద్ర, అపూర్వ వస్తారు.
శరత్: ఏంట్రా మళ్లీ మా ఇంటి పరువు తీయాలనుకున్నావా..? మళ్లీ మా మీద ఏం కుట్ర పన్నుతున్నావురా..? ఏమ్మా భూమి వీడు రమ్మంటే నువ్వు వచ్చేయడమేనా..? పెళ్లిలో జరిగిన అవమానాన్ని నువ్వు అప్పుడే మర్చిపోయావా..?
చెర్రి: మామయ్య భూమి తనంతట తాను రాలేదు. నేనే ప్లాన్ చేసి రప్పించాను.
శరత్: ఓ ప్లాన్ చేసి వీడితో భూమిని ఇక్కడికి రప్పించావా..?
చెర్రి: మామయ్య అన్నయ్యను కూడా నేనే ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించాను. అన్నయ్యకు కూడా నా ప్లాన్ తెలియదు.
అని చెర్రి చెప్పగానే.. శరత్ చంద్ర కోపంగా చెర్రిని కొడతాడు. మేనమామ కంటే నీకు వీడే ఎక్కువయిపోయాడా..? ఇంత నమ్మకద్రోహం చేస్తావా..? అంటూ వెళ్లి కర్ర తీసుకుని వచ్చి చెర్రిని కొడతాడు. భూమిని, చెర్రిని తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు.
తర్వాత చెర్రిని, భూమిని పెళ్లికి ముస్తాబు చేస్తుంటారు. భూమి దగ్గరకు నక్షత్ర వెళ్తుంది. ఈ పెళ్లి గెటప్‌లో మా అక్క కుందనపు బొమ్మలా ఉందని సంబరపడిపోతుంది. మరోవైపు శారద ఏడుస్తూ.. ఈ రోజు భూమికి పెళ్లి అంటుంది. దీంతో గగన్ కూల్‌గా చెర్రి కూడా నీ కొడుకే కదా అమ్మా ఏ అమ్మైనా కొడుక్కి పెళ్లి జరుగుతుంటే ఏడుస్తుందా..? మనం అనుకున్నది అవ్వలేన్నప్పుడు అవుతున్న వాస్తవంతోనే సర్దుకుపోవాలి అని చెప్తాడు గగన్.ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















