Meghasandesam Serial Today August 8th: ‘మేఘసందేశం’ సీరియల్: గగన్ తో భూమిని పంపడానికి ఉదయ్ రెడీ – కోపంతో ఊగిపోయిన శరత్ చంద్ర
Meghasandesam serial today episode August 8th: హాస్పిటల్‌లో ఉన్న భూమి దగ్గరకు శరత్‌చంద్ర, ఉదయ్ వెళ్తారు. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ మరింత ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: హాస్పిటల్‌లో ఉన్న భూమి కోసం చిన్న పాప డాన్స్ చేస్తుంది. భూమి కోసం యముడినే పరిగెత్తించే ఆ నటరాజైన పరమశివుణ్నే ఇక్కడకు రప్పిస్తాను అంటూ డాన్స్ చేస్తుంది. పాప డాన్స్ అయిపోగానే భూమి కళ్లు తెరుస్తుంది. నర్సు బయటకు వచ్చి భూమి కళ్లు తెరిచిందని చెప్తుంది. దీంతో శారద హ్యాపీగా ఆ పాపను హగ్ చేసుకుంటుంది.
శారద: నువ్వు కారణ జన్మురాలి అమ్మా నువ్వు కరుణించమని అడిగితే ఆ పరమేశ్వరుడే కరుణిస్తాడు. కాపాడమని అడిగితే నువ్వు చెప్పినట్టు నిజంగా ఆ ఈశ్వరుడే దిగొచ్చాడమ్మా..? రామ్మా నీకు టీచర్‌ను పరిచయం చేస్తాను.
అంటూ శారద ఆ పాపను లోపలికి భూమి దగ్గరకు తీసుకెళ్తుంది.
శారద: ఈభూమి ఈ పాప నీ ప్రాణాలు కాపాడమని దేవుడి కోసం నాట్యం చేసిందమ్మా..?
భూమి: ఏం పేరమ్మా.?
పాప: రిషిత
భూమి: నీ పేరుకు అర్థం ఏంటో తెలుసా..?
రిషిత: సత్యం అని అర్థం..
భూమి: సత్యం ఒక్కటే కాదమ్మా.. పవిత్రమైనది అని మరోక అర్థం కూడా ఉంది. పవిత్రమైన నీ మనసుతో సత్యం లాంటి నాట్య కళ బతికుండాలని నా బతుకును కోరావే.. నిన్ను అభినందించకుండా ఎలా ఉండగలను..
రిషిత: థాంక్యూ టీచర్.. నాకు మీ బెస్ట్ స్టూడెంట్ కావాలని ఆశగా ఉంది.
భూమి: తప్పకుండా అవుతావు రిషిత. నేను మా అమ్మంత పేరు తెచ్చుకుంటానో లేదో కానీ నువ్వు భూమిని మించిన డాన్సర్ అవుతావు..
రిషిత: అలా అనకండి టీచర్ నన్ను దీవించండి..
భూమి: దీర్ఘాయుష్మాన్ భవ..
రిషిత: నేను వెళ్తాను టీచర్.. నేను వచ్చి చాలా టైం అవుతుంది. మా అమ్మ కంగారు పడుతుంది.
అని చెప్పి రిషిత వెళ్లిపోతుంది. ప్రమాదం అయితే గట్టేకింది భూమి అని శారద చెప్పగానే.. గగన్ అమ్మా ఇక వెళ్దామా అంటాడు. దీంతో భూమిని ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్దాం అంటుంది శారద. హాస్పిటల్ వాళ్లు వాళ్ల ఇంటి వాళ్లకు చెప్పారు. మనం వెళ్దాం పద అంటాడు.
శివ: పోనీ వాళ్ల వాళ్లు వచ్చే వరకు నన్ను ఉండమంటారా బావ.
గగన్: నువ్వు కూడా మా ఇంటి వాడివే.. మనకి పడని ఇంటి వాళ్ల కోసం తాపత్రయ పడాల్సిన అవసరం లేదు.
శారద: హాస్పిటల్‌లో ఉన్నవారికి వస్తాను అని చెప్పకూడదు అమ్మా వెళ్తున్నాం..
అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత హాస్పిటల్‌కు శరత్‌చంద్ర, ఉదయ్ వస్తారు.
శరత్: భూమి ఏం కాలేదు కదమ్మా నీకు..
భూమి: ఏం కాలేదు నాన్న.. నాన్న రేపు డాన్స్ అకాడమీ.. ఓపెనింగ్ నాన్న..
శరత్: నువ్వు ఆ డాన్స్ అకాడమీ ఓపెన్ చేయడం.. నాకిష్టం లేదు.
భూమి: నాన్నా ఫ్లీజ్ ఆ సర్టిఫికెట్ తెచ్చుకోవడం కోసం నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలియదా.?
ఉదయ్: అదేంట అంకుల్ ఎందుకు వద్దంటున్నారో చెప్పండి..?
శరత్: అకాడమీ పెట్టుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషనల్‌లో భూమి పేరుతో వాడి పేరు ఉంది. ఇద్దరూ కలిసి ఓపెన్ చేయాలి.
ఉదయ్: అందులో తప్పేం ఉంది అంకుల్..
శరత్: చూసే వాళ్లు ఏమనుకుంటారు అల్లుడు గారు.
ఉదయ్: భూమి మీద నాకు నమ్మకం ఉంది అంకుల్. అకాడమీ ఓపెన్ చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు
అంటూ ఉదయ్ చెప్పగానే శరత్‌చంద్ర కోపంగానే చూస్తుంటాడు. భూమి మాత్రం మరింత భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















