Meghasandesam Serial Today August 6th: ‘మేఘసందేశం’ సీరియల్: బొమ్మ కోసం గగన్ ఇంటికి వెళ్లిన సుజాత – అఫీసు నుంచి వచ్చిన గగన్
Meghasandesam serial today episode August 6th: సుజాత గగన్ వాళ్ల ఇంటికి వెళ్లి బొమ్మ తీసుకుని వెళ్లిపోతుంటే అప్పుడే గగన్ వస్తాడు. గగన్ ను చూసిన సుజాత షాక్ అవుతుంది.

Meghasandesam Serial Today Episode: కింద అందరి ముందు డ్రామా ఆడిన నక్షత్ర పైకి రూంలోకి వెళ్లి నిద్ర పోతున్న చెర్రి ముఖం మీద కాపీ చల్లుతుంది. దీంతో చెర్రి గట్టిగా అరుస్తూ లేస్తాడు. కింద ఉన్న కేపీ ఆ అరుపుకు పైకి వస్తాడు. అప్పుడే చెర్రి కిందకు వస్తుంటాడు. ఇద్దరూ స్టెప్స్ మధ్యలో ఎదురుపడతారు.
కేపీ: చెర్రి ఏమైందిరా..?
చెర్రి: నక్షత్ర నా ముఖం మీద కాఫీ కొట్టి నిద్ర లేపింది నాన్న
కేపీ: నేను భూమి అనుకుంటూనే ఉన్నాము కింద అంత డ్రామా చేస్తుంటే..నిన్ను ఏదో చేయబోతుందటని వెంటనే వెళ్లి ఆయనతో మాట్లాడతాను.
చెర్రి: నాన్నా వద్దు నాన్న.. కింద అంత డ్రామా చేసిందని నువ్వే అంటున్నావు కదా నాన్న. ఇంక నా మాట ఎలా నమ్ముతారు. పర్వాలేదు నాన్న
కేపీ: ఏంట్రా నీకే ఈ కష్టాలు. అసలు నువ్వు ఆ నక్షత్రను ఎందుకు పెళ్లి చేసుకున్నావురా.?
చెర్రి: భూమితో నా పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి కనబడలేదు నాన్న.
కేపీ: ఓరేయ్ నువ్వు మీ అన్నయ్యను కాపాడటం కోసం నువ్వు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటావారా..? అసలు నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదురా..?
చెర్రి: ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న. ఇన్నాళ్లు అన్నయ్య ముళ్ల దారి మీద నడిచారు. నాక్కూడా కొంచెం అలవాటు అవనివ్వండి. అలవాటు అవని.. కానీ ఒక్కటి నాన్న అన్నయ్య భూమి ఒక్కటి అవడం కోసం ఇలాంటి అవమానాలు ఎన్నైనా భరిస్తాను.
కేపీ: అరేయ్.. ఎంత ఎదిగిపోయావురా..?
అంటూ ఎమోషనల్ అవుతూ వెళ్లిపోతాడు. మరోవైపు శారద వాళ్ల ఇంట్లో ఉన్న శివ కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతాడు.
శివ: ఆంటీ నేను రెడీ అయిపోయాను.
శారద: ఎంత బాగున్నావో శివ. నా దిష్టే తగిలేలా ఉంది. ఫస్ట్ డే కాలేజీకి వెళ్తున్నావు దేవుడికి దండం పెట్టుకో
అని చెప్పగానే.. శివ సరే అంటూ అప్పుడే అక్కడకు వచ్చిన గగన్ కాళ్ల మీద పడతాడు.
గగన్: శివ లే ఏం చేస్తున్నావు.
శివ: ఆంటీ నన్ను దేవుడికి దండం పెట్టుకోమంది సార్. అమ్మా నాన్న దూరమై జీవితం చీకటై పోయింది. రేపు ఏంటో కాదు కదా తర్వాత క్షణ ఎలా గడుస్తుందో తెలియని అయోమయంలో పడిపోయాను అలాంటి టైం మీరు నాకు కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. మీరు కాక నాకు ఇంకెవరు సార్ దేవుడు.
గగన్: ఇంకా నీకు జీవితం చాలా ఉంది. నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వేంటో నలుగురికి తెలియాలి. ఇలా దేవుడిలా చూడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఫస్ట్ డే కాలేజీకి వెళ్తున్నావు కదా నేనే డ్రాప్ చేస్తాను పదా
అనగానే ఇద్దరూ కలిసి ఆఫీసుకు వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక.. శివ దగ్గర ఉన్న బోమ్మ కోసం గోరింటాకు పిన్ని వస్తుంది. ఆమెను చూసిన శారద షాక్ అవుతుంది. సుజాత ఫోన్ లైన్‌లో అపూర్వతో మాట్లాడుతూనే ఉంటుంది.
శారద: మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి మా అబ్బాయి వచ్చే టైం అయింది. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్లండి.
సుజాత: విబూది అమ్మాయి. ఇది ఇల్లంతా చల్లితే ఎలాంటి ఆపదలు రావు అన్నారు.
అంటూ శారద కాపీ చేస్తుంటే.. సుజాత విబూది చల్లుతూ ఇల్లంతా బొమ్మ కోసం వెతుకుతుంది. బొమ్మ కనిపించగానే అపూర్వకు బొమ్మ దొరికింది అని చెప్తుంది. వెంటనే తీసుకుని వచ్చేయ్ అని అపూర్వ చెప్పగానే.. సరేనని బొమ్మ తీసుకుని వెళ్లబోతుంటే.. గగన్ వస్తాడు. గగన్ ను చూసిన సుజాత షాక్ అవుతుంది. గగన్ దగ్గరకు వచ్చి సుజాతను అనుమనంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















