Meghasandesam Serial Today August 5th: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి పెళ్లి ఇష్టమేనన్న ఉదయ్ - మనసులోనే బాధపడ్డ గగన్
Meghasandesam serial today episode August 5th: గగన్ వింటుండగానే.. ఉదయ్, భూమికి ఫోన్ చేసి షాపింగ్‌కు వెళ్దామని అడగ్గానే భూమి సరే అంటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: ఉదయమే నిద్ర లేచిన నక్షత్ర స్నానం చేసి దేవుడికి పూజ చేస్తుంది. అంతా గమనిస్తున్న అపూర్వ షాక్ అవుతుంది. సుజాత కూడా షాకింగ్ గా చూస్తుది.
సుజాత: అదేంటి అమ్మాయి.. సిల్క్ స్మితలో భక్తి రసం చూసినట్టు నీ కూతురేంటి ఇంత షాక్ ఇస్తుంది.
అపూర్వ: పిన్ని..( కోపంగా)
సుజాత: అంటే నా ఉద్దేశం సిల్క్‌స్మిత లాంటి పాపలో ఇంత పెద్ద మార్పు ఏంటా అని..?
అపూర్వ: సందర్భాన్ని బట్టి చాలా మంది మారుతూ ఉంటారు పిన్ని. నా కూతురు సందర్భాన్ని సృష్టించడం కోసం మారుతుంది. చూస్తూ ఉండు నెమ్మదిగా నక్షత్ర ఈ అపూర్వగా ఎలా మారుతుందో..
ఇంతలో నక్షత్ర దేవుడికి హారతి ఇస్తుంది. పూజగదిలో గంట సౌండ్ విని శరత్, కేపీ అందరూ హాల్లోకి వచ్చి విచిత్రంగా చూస్తుంటారు. నక్షత్ర హారతి తీసుకుని హాల్లోకి వస్తుంది.
నక్షత్ర: మమ్మీ హారతి తీసుకో.. గోరింటాకు నువ్వు కూడా డాడీ మీరు తీసుకోండి.. మామయ్య హారతి తీసుకోండి. టైంకు వచ్చావు భూమి ఇదిగో హారతి తీసుకో.. హారతి తీసుకోండి అత్తయ్యగారు.. ఎంతసేపు పని మీద పనేనా..? నాతో వచ్చి మీరు పూజలో కూర్చుంటే నేను మీతో వచ్చి కిచెన్‌లో హెల్ప్ చేసే దాన్ని కదండి..
మీరా: అదేంటి నక్షత్ర అత్తయ్య గారు అంటున్నావు. అండి అంటున్నావు. నువ్వు ఎప్పుడూ నన్ను అత్తయ్య అనే కదా పిలిచే దానివి.
నక్షత్ర: అది మీ కొడుకుతో నాకు పెళ్లి అవ్వక ముందు అత్తయ్యగారు. అప్పుడు మీరు నా మేనత్త.. ఇప్పుడు మీ కొడుకును పెళ్లి చేసుకున్న మీ కోడలిని నేను మర్యాద ఇవ్వడం మన సంప్రదాయం. బిందు ఇంకా లేవలేదా అత్తయ్యగారు.
మీరా: అమ్మా నక్షత్ర నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అత్తయ్య అని పిలువు.
నక్షత్ర: అలా ఎలా పిలవాలి అత్తయ్యగారు. ముందు మీరు బిందు గురించి చెప్పండి.
మీరా: లేవలేదు ఇంకా..
నక్షత్ర: మీ అబ్బాయి బిందు ఒకలాంటి వారే అంత త్వరగా లేవరు లేండి.. టైంకి మీరు టిఫిన్ చేశారు. సంతోషం.
అంటూ చెబుతూనే హారతి తీసుకెల్లి పూజగదిలో పెట్టి తిరిగి కిచెన్‌లోకి వెళ్లి ఇడ్లీ ప్లేట్‌లో పెట్టుకుని తీసుకుని వెళ్తుంది.
సుజాత: అదేంటి నక్షత్ర టిఫిన్ ఇక్కడే చేయోచ్చు కదా..? రూంలోకి వెళ్లి తినాలా..?
నక్షత్ర: ఇది నాకు కాదు. మా వారికి ఆయన లేపి కాఫీ ఇచ్చి ముఖం కడుక్కోగానే టిఫిన్ పెడదామని తీసుకెళ్తున్నాను.
శరత్: నిజంగా నీలో ఈ మార్పు చూస్తుంటే.. నాకు ఆశ్చర్యమో.. ఆనందమో అర్థం కావడం లేదు. నీలో ఈ మార్పు నమ్మలేకపోతున్నాను.
నక్షత్ర: డాడీ పెళ్లి తర్వాత ప్రతి అమ్మాయి మారుతుందంటే నేను నమ్మలేదు. పెళ్లి తర్వాతే నాకు అర్థం అయింది. మారుతుందని మీరు కూడా నమ్మండి.
అని చెప్పి నక్షత్ర చెర్రి రూంలోకి వెళ్తుంది.
భూమి: చెర్రి మీద ఇదేదో పెద్ద ప్లానే చేసినట్టు ఉంది మామయ్య. ఏదో ఒకటి చేసి మనం చెర్రిని సేవ్ చేయాలి.
కేపీ: అవును అమ్మా..
అని మెల్లగా మాట్లాడుకుంటుండగానే మీరా వచ్చి అందరూ టిఫిన్ చేద్దురు రండి అని పిలుస్తుంది. అందరూ టిఫిన్ చేస్తుంటే.. గగన్ కారులో వెళ్తున్న ఉదయ్, శరత్ చంద్రకు ఫోన్ చేస్తాడు.
ఉదయ్: హలో అంకుల్..
శరత్: చెప్పు ఉదయ్..
ఉదయ్: భూమి ఉందా అంకుల్..
శరత్: మాట్లాడతావా..? ఉదయ్
ఉదయ్: అవును అంకుల్ ఒకసారి ఇస్తారా..?
అని అడగ్గానే శరత్ చంద్ర ఫోన్ భూమికి ఇస్తాడు. భూమితో ఉదయ్ నీకు ఈ పెళ్లి ఇష్టేమనా అని అడుగుతాడు. భూమి ఇబ్బంది పడుతూ ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటుంది. మీ నాన్న గారు ఉన్నారని ఇబ్బంది పడుతున్నావా..? అందుకే ఇప్పుడు నేను మీ ఇంటికే వస్తున్నాను.. ఇద్దరం కలిసి షాపింగ్‌కు వెళ్దామా అని అడుగుతాడు. శరత్ చంద్ర బలవంతంతో వస్తానని చెప్తుంది భూమి. కాల్ కట్ చేస్తాడు ఉదయ్. ఏమన్నది భూమి అని గగన్ అడగ్గానే.. ఆల్మోస్ట్ ఇష్టమే అని చెప్పింది. లేకపోతే నాతో షాపింగ్‌కు వస్తానని చెప్పదు కదా అంటాడు ఉదయ్. దీంతో గగన్ మనసులోనే బాధపడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















