Meghasandesam Serial Today August 27th: ‘మేఘసందేశం’ సీరియల్: శారదను సర్‌ప్రైజ్ చేసిన గగన్ - ఎమోషనల్ అయిన కేపీ
Meghasandesam serial today episode August 27th: శారద పుట్టినరోజును సర్‌ఫ్రైజ్ ప్లాన్ చేస్తాడు గగన్. శారద్ ఎమోషనల్ అవుతాడు. కేపీ ఎమోషనల్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: భూమి తాను గగన్ ను ప్రేమించడం లేదని చెప్పగానే తాను నమ్మనని చెప్తాడు ఉదయ్. మరి ఎలా చెప్పాలి బాబు అని శరత్ అడుగుతాడు. వెంటనే ఉదయ్, అపూర్వను చూస్తాడు. అపూర్వ, శోభాచంద్ర ఫోటో చూపిస్తుంది.
ఉదయ్: అంకుల్ వాళ్ల అమ్మ మీద ఓట్టేసి చెబితే అప్పుడు నమ్ముతాను.
అపూర్వ: ఇప్పుడు చూడు పిన్ని చచ్చినా అది వాళ్ల అమ్మ మీద ఒట్టేసి అబద్దం చెప్పదు.
సుజాత: నిజం చెప్పాక అల్లుడి గారి చేతిలో బతకదు. ఇది కదా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ సీన్ అంటే..
మీరా: అదేంటి బాబు ఒట్టేసి మరీ మన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందంటావా..?
శరత్: మీరా చెప్తుంది కరెక్టే అమ్మా ఒట్టేసి ఏ ఆడపిల్లైనా తనను తాను ఫ్రూవ్ చేసుకోవాలంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ అల్లుడి గారితో నువ్వు జీవితాంతం కలిసి ఉండాల్సిన దానివి. అనుమానం మనసులో పెట్టుకుని ఆయన నీ మెడలో మూడు ముళ్లు వేయకూడదు. నిష్కల్మషంగా మీ ఇద్దరూ ఏడు అడుగులు వేయాలి. అప్పుడే జీవితాంతం మీ కాపురం విరబూసిన వెన్నెలలా ఉంటుంది అమ్మా. అందుకోసమైనా నువ్వు మీ అమ్మ మీద ఒట్టేయక తప్పదు. వెళ్లమ్మా వెళ్లి మీ అమ్మ మీద ఒట్టేసి గగన్‌ను ప్రేమిస్తున్నావో లేదో చెప్పు. ఏది నిజమైతే అదే చెప్పు.
సుజాత: అమ్మాయి దీనికి పోయే కాలం దాపరించింది అమ్మాయి. అల్లుడు గారికి అందించడానికి నన్ను వెళ్లి గన్ను తెమ్మంటావా..?
అపూర్వ: ఎందుకు పిన్ని అది పిట్టంత ఉంది. బావ చేతులు పట్టుకుని పిసికాడంటే పోతుంది.
సుజాత: అది కరెక్టే సుమీ..
ఉదయ్: ఏంటి భూమి ఆలోచిస్తున్నావు.. పోనీ మీ అమ్మ మీద ఒట్టేయనని చెప్పేయ్ నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాను.
శరత్: కంగారు పెట్టకండి అల్లుడు గారు. ముందే మనం అనుకున్నట్టు ఒట్టేసి ఫ్రూవ్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా..? వెళ్లమ్మ త్వరగా ఒట్టేసి చెప్పు.
అపూర్వ: ఏంటి భూమి ఆలోచిస్తున్నావు.. నువ్వు లేటు చేస్తున్న కొద్ది అల్లుడి గారిలో వచ్చిన అనుమానం పెనుభూతంలా మారుతుంది. వెళ్లి ఒట్టేసి చెప్పమ్మా..!
శరత్: ఒట్టేసి చెప్పమా..?
అపూర్వ: చెప్పు భూమి ఆలస్యం అయితే అందరికీ అనుమానం వస్తుంది.
భూమి శోభా చంద్ర ఫోటో దగ్గరకు వెళ్తుంది. చెయ్యి లేపి ఫోటో మీద పెట్టి తర్వాత అపూర్వ తల మీద పెడుతుంది.
భూమి: మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను గగన్‌ను ప్రేమించడం లేదు.
శరత్: అదేంటమ్మా నేను మీ అమ్మ మీద ఒట్టు వేయమంటే పిన్ని మీద ఒట్టేశావు..
భూమి: నాన్నా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే అమ్మ తర్వాత అమ్మే కద నాన్న పిన్ని. ఈ రోజు మా అమ్మ మన మధ్య లేదు. అమ్మ మీద ఒట్టేస్తే అమ్మకి ఏదో జరుగుతుందన్న భయమూ లేదు. అప్పుడు నేను నిజం చెప్పినా ఉదయ్ గారు అబద్దం అనుకుంటారు. అదే కదలాడే దేవత లాంటి పిన్ని మీద ఒట్టేసి అబద్దం చెప్తే పిన్నికి ఏమైనా జరుగుతుందనే భయం ఉంటుంది కదా..? అందుకే నేను బతికున్న ఈ అమ్మ మీద ఒట్టేశాను. ఉదయ్ మీకు ఇప్పుడు నమ్మకం వచ్చిందా..?
ఉదయ్: వచ్చింది.. అంకుల్ భూమి గగన్‌ను ప్రేమించడం లేదని తను ఇప్పుడు వాళ్ల అమ్మ మీద ఒట్టేశాక నేను మనఃస్పూర్తిగా నమ్ముతున్నాను. సారీ అంకుల్. సారీ భూమి
అని చెప్పగానే శరత్ చంద్ర, ఉదయ్‌ను తీసుకుని పక్కకు వెళ్లిపోతాడు. తర్వాత శారద పూజ చేసి బయటకు రాగానే అందరూ బర్తుడే విషెష్ చెప్తుంటే.. ఎవ్వరూ చెపొద్దని ముందు నా కొడుకు గగన్ చెప్పాకే అంటూ అందరినీ ఆపేస్తుంది. గగన్ మాత్రం ఏమీ తెలియనట్టు లేచి రెడీ అయి ఆఫీసుకు వెళ్లిపోతాడు. శారదకు ఫోన్ చేసి ఒక ఫైల్ ఇంట్లో మర్చిపోయానని ఏమీ అనుకోకుండా ఆఫీసుకు తీసుకురమ్మా అని చెప్తాడు. దీంతో శారద్ కోపంగా ఫైల్ గుర్తుంటుంది కానీ చెప్పాల్సిన విషయం మాత్రం గుర్తు ఉండదు అనుకుంటూ ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ శారద బర్తుడేకు గ్రాండ్ డెకరేషన్ చేసి ఉంటాడు గగన్. అదంతా చూసి శారద్ సర్‌ఫ్రైజ్ అవుతుంది. చాటునుంచి చూస్తున్న కేపీ ఎమోషనల్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















