Meghasandesam Serial Today August 26th: ‘మేఘసందేశం’ సీరియల్: శరత్ చంద్రతో భూమి, గగన్‌ను ప్రేమిస్తుందన్న ఉదయ్ - అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పమన్న శరత్ చంద్ర
Meghasandesam serial today episode August 26th: శరత్ చంద్ర దగ్గరకు వెళ్లిన ఉదయ్ భూమి ఇంకా గగన్ ను ప్రేమిస్తుందని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: అమ్మని ఎవరు మర్డర్ చేశారో నాకు తెలుసు..? అంటూ శరత్ చంద్ర చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అపూర్వ భయంతో వణికిపోతుంది. కేపీ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అటు తిరిగి ఇటు తిరిగి అమ్మాయి నీ మెడకే చుట్టుకుంది అంటుంది సుజాత.
భూమి: ఏంటి నాన్న మీరు అనేది అమ్మను ఎవరు చంపారో మీకు తెలుసా…
శరత్ చంద్ర: అవును తెలుసు. నా శోభను చంపింది ఒక ఆడది.
భూమి: చంపింది ఆడదే అని తెలిసినప్పుడు ఇంకా ఎందుకు నాన్న మౌనంగా ఉన్నారు. ఆవిడను చంపేయండి నాన్న.
శరత్: చంపింది ఆడది అని తెలుసు కానీ ఆ ఆడది ఎవరనేది తెలియదు అమ్మ. ఈ మధ్య నాకు ఎస్సై నుంచి కాల్ వచ్చింది. అతనే చెప్పాడు నా శోభది యాక్సిడెంటల్ డెత్ కాదు. అది మర్డర్ అని. ఆయన ఏదో బలమైన సాక్ష్యమే చూశాడని నాకు అనిపించింది. అనుకున్నట్టు గానే ఆ ఎస్సై మన గెస్ట్‌హౌస్‌కు వచ్చాడు. నేను వెళ్లే సరికి ఆ ఎస్సైని చంపేశారు. ఆ చంపింది ఒక ఆడదని మన ఇంటికి వచ్చిన డీఎస్పీ చెప్పారు.
భూమి: నాన్న మీరు వాస్తవానికి చాలా దగ్గరగా వచ్చేశారు. ఎస్సై గారు మీకు ఫోన్ చేశారు. మీరు గెస్ట్‌హౌస్‌కు వెళ్లే సరికి ఎస్సైని చంపేశారంటే దాని అర్తం ఏంటి..? మీ కంటే ముందే వెళ్లి ఆ ఎస్సైని చంపేశారు. నాన్న బాగా గుర్తు చేసుకోండి నాన్న మీరు ఎస్సైతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీ పక్కన ఎవరున్నారు. చెప్పండి నాన్న మీ పక్కన ఎవరున్నారు.
అపూర్వ: పక్కన లేను కానీ బావ ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను. అంటే నీ ఉద్దేశం ఏంటి భూమి నేనే వెళ్లి ఆ ఎస్సైని చంపేశాననా..?
భూమి: మీరేంటి పిన్ని అంత కంగారు పడుతున్నారు. ఇక్కడ మేము మాట్లాడుకుంటుంది ఎస్సై చావు గురించి కాదు. మా అమ్మ మరణం గురించి గెస్ట్‌హౌస్‌లో ఎస్సైని ఎవరు చంపారో మా అమ్మను కూడా వాళ్లే చంపారని మా నాన్న బలంగా నమ్ముతున్నారు. నాన్న అంతే కదా..?
శరత్: అంతేనమ్మా.?
అపూర్వ: బావ అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా..?
శరత్: చీచీ నిన్నెందుకు అనుమానిస్తాను అపూర్వ.
భూమి: పిన్ని కాకుండా మీ ఫోన్ కాల్ ఇంకెవరు విని ఉంటారు నాన్న.
అపూర్వ: ఏ మీ నాన్న ఫోన్ కాల్ విని ఎస్సైని చంపి ఉంటారని ఎలా అనుకుంటున్నావు.. అటువైపు నుంచి ఎస్సై కాల్ విని అతనెవరో చంపి ఉండొచ్చు కదా..?
శరత్: అది కూడా లాజిక్కే కదమ్మా.. అనవసరంగా మీ పిన్నిని అనుమానించావు. మీ అమ్మంటే పిన్నికి ప్రాణం. తన ప్రాణాన్ని తనే తీసుకుంటుందని ఎలా అనుకుంటుందమ్మా..? అనవసరంగా లేనిపోని అనుమానాలు మీ పిన్ని మీద పెట్టుకోకమ్మా
అంటూ చెప్పి శరత్ చంద్ర వెళ్లిపోతాడు. తర్వాత అకాడమీలో భూమి, గగన్ మధ్య నడుస్తున్న లవ్ కెమిస్ర్టీ చూసిన ఉదయ్ కోపంగా శరత్ చంద్ర దగ్గరకు వెళ్లి భూమి ఇంకా గగన్‌ను లవ్ చేస్తుందని చెప్తాడు. దీంతో శరత్ చంద్ర కోపంగా లోపలికి వెళ్తాడు. భూమిని పిలుస్తాడు. భూమి వస్తుంది.
శరత్: ఇంకా నువ్వు గగన్‌ను ప్రేమిస్తున్నావని అల్లుడు గారు అనుమానపడుతున్నారు. చెప్పమ్మా గగన్‌న నువ్వు ప్రేమించడం లేదని అల్లుడు గారికి చెప్పు.
భూమి: నేను గగన్ ను ప్రేమించడం లేదు
ఉదయ్: భూమి నువ్వు ఇలా చెప్తే నేను నమ్మను..
శరత్: మరి ఎలా చెప్పాలో మీరే చెప్పండి..
అని శరత్ చంద్ర అడగ్గానే ఉదయ్, అపూర్వ వైపు చూస్తాడు. అపూర్వ శోభాచంద్ర ఫోటో చూపిస్తుంది.
ఉదయ్: వాళ్ల అమ్మ మీద ఒట్టేసి చెబితే అప్పుడు నమ్ముతాను
అంటూ ఉదయ్ చెప్పగానే.. భూమి షాక్ అవుతుంది. అపూర్వ నవ్వుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















