Meghasandesam Serial Today August 25th: ‘మేఘసందేశం’ సీరియల్: శోభాచంద్రన చంపిదెవరో తనకు తెలుసన్న శరత్ చంద్ర – అయోమయంలో పడిపోయిన అపూర్వ
Meghasandesam serial today episode August 25th: కేపీని తిడుతున్న శరత్ చంద్ర దగ్గరకు వచ్చిన భూమికి శోభాచంద్రను ఎవరు చంపారో తనకు తెలుసు అని చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: ఆఫీసు నుంచి వచ్చిన గగన్ కోపంగా పూర్నిని తిడతాడు. దీంతో పూర్ని లోపలికి వెల్లిపోతుంది. ఇంతలో అక్కడకు శారద వచ్చి ఏమైంది నాన్న అని ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది.
గగన్: మనం తీసుకునే నిర్ణయాల వల్ల మన జీవితాలు బలై పోతాయి. నేను ఆ భూమిని ప్రేమించాను ఇప్పుడు నా జీవితం బలై పోలేదు.
శారద: గగన్ ఎందుకు నాన్న అలా మాట్లాడతావు. ఏ కారణం చేత భూమి పెళ్లి ఆపుకుందో మనకు తెలియదు కదా..? తెలిసిన తర్వాత భూమి తీసుకుంది సరైన నిర్ణయమే అని మనకు అనిపించొచ్చు.
గగన్: ఎందుకమ్మా ఇంకా అమాయకంగా మాట్లాడతావు. తను ఏ కారణం చేత పెళ్లి ఆపుకుందో అదే కారణం చూపించి వాళ్లింట్లో వాళ్లు తనకు సంబంధం కుదిర్చారు. వాళ్లు ఎలాంటి సంబంధం కుదిర్చారో వాళ్లు తెలుసుకోలేదు. ఈ భూమి తెలుసుకోలేదు. పెళ్లి అయ్యాక వాడి రాక్షసత్వం గురించి తెలిస్తే అప్పుడు అర్థం అవుతుంది. ఎలాంటి వాణ్ని వదులుకుందో
శారద: అసలు ఏమైందిరా..?
గగన్: భూమిని ఆ ఉదయ్ తప్పుగా అర్తం చేసుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది అమ్మ. అంటే ఇప్పటి వరకు తను చూపించిన మంచితనం అంతా ఒక ముసుగు. పెళ్లి అయ్యాక ఆ భూమికి కనిపించేది అంతా నరకమే.
శారద: భూమి జీవితం ఏమైపోతుందోనన్న నీ భయానికి ప్రెస్టేషన్ అని పేరు పెట్టుకున్నావా నాన్న. ఇప్పటికీ నువ్వు భూమిని ఎంత ప్రేమిస్తున్నావో నీకు అర్థం కావడం లేదా..?
గగన్: అలాంటిదేం లేదు అమ్మా భూమిని ఎప్పుడో నా మనసులోంచి తీసేశాను.
అంటూ గగన్ కోపంగా పైకి వెళ్లిపోతాడు. మరోవైపు చెర్రి తన బట్టలు ఐరన్ చేసుకుంటుంటే నక్షత్ర వస్తుంది. చెర్రిని టార్చర్ చేయాలని ప్లాన్ చేస్తుంది. తన ప్లాన్ ప్రకారం నక్షత్ర ఏడుస్తూ అపూర్వ దగ్గరకు వెళ్లి చెర్రి టార్చర్ చేస్తున్నాడని నాటకం ఆడుతుంది. దీంతో అపూర్వ కోపంగా చెర్రిని పిలిచి తిడుతుంది.
అపూర్వ: ఓరేయ్ చెర్రి నా కూతురు నీకు ఏం ద్రోహం చేసిందని దాన్ని అలా ఏడిపిస్తున్నావు. అయినా నిన్ను కన్నవాళ్లను అనాలి మా ముద్దే తింటూ మీ మీదే విషం కక్కేలా పెంచారు మీ నాన్న..
కేపీ: అపూర్వ గారు ఎవరు సక్రమంగా పెంచారో ఎవరు వంకరగా పెంచారో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు..
శరత్: నోర్మూయ్.. మీరిద్దరూ నా ఇంటికి ద్రోహమే చేశారు. నేను నా శోభాచంద్ర చనిపోయిన విషాదంలో ఉన్నాను. లేదంటే.. అప్పటికప్పుడే నిన్ను చంపేయాల్సింది.
భూమి: చంపేయాల్సింది నాన్న మీరు ఆరోజు మామయ్యను చంపే ప్రయత్నం చేయాల్సింది. చావు భయంతోనైనా మామయ్య మీకు నిజం చెప్పే ప్రయత్నం చేసేవారు. అమ్మది ప్రమాదావశాత్తు జరిగిన మరణం కాదని ఎవరో తనని చంపారని అప్పుడే మీకు అర్థం అయ్యేది.
శరత్: అమ్మని ఎవరు మర్డర్ చేశారో నాకు తెలుసు..?
అందరూ షాక్ అవుతారు.
భూమి: ఏంటి నాన్న మీరు అనేది అమ్మను ఎవరు చంపారో మీకు తెలుసా…
అని అడగ్గానే.. అవును తెలుసు అని శరత్ చంద్ర చెప్పగానే.. అపూర్వ షాక్ అవుతుంది. భయపడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి





















