Meghasandesam Serial Today April 18th: ‘మేఘసందేశం’ సీరియల్: కోల్డ్ స్టేరేజీలో గగన్, భూమి – మీడియాకు దొరికిపోయిన జంట
Meghasandesam Today Episode: కోల్డ్ స్టేరేజీ నుంచి బయటకు వస్తున్న గగన్, భూమిలను మీడియా చూస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Meghasandesam Serial Today Episode: మియాపూర్ ఔట్‌స్కట్ లో ఉన్న కోల్డ్ స్టోరేజీలో భూమిని బంధించానని ఆ కూల్‌కు భూమి గడ్డ కట్టుకుని చనిపోతుందని నక్షత్ర, అపూర్వకు చెప్తుంది. అపూర్వ చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అయితే స్టోరేజీలో గగన్ ఉన్నట్టు నక్షత్రకు తెలియదు. మరోవైపు స్టోరేజీలో ఉన్న భూమి వణుకుతూ స్పృహ తప్పుతుంది. గగన్ ఎంత ప్రయత్నించినా కళ్లు తెరవదు.
గగన్: భూమి నీకేం కాదు.. హలో..
అంటూ డోర్ కొడుతుంటాడు. మరోవైపు ఏడుస్తూ మీరా ఇంటికి వస్తుంది.
అపూర్వ: మీరా ఏంటి.. ఎందుకిలా ఏడుస్తున్నావు..
మీరా: వదిన ఘోరం జరిగిపోయింది.
అపూర్వ: ఏమైంది మీరా ఎందుకిలా అరుస్తున్నావు.. హాస్పిటల్ ఏంటి..? భూమి ఏంటి.. చెప్పు..
మీరా: భూమి గురించే వదిన నా ఏడుపంతా..? అప్పటికే నేను స్పృహలో లేను. మన డ్రైవర్ చెప్పాడు. భూమిని ఎవరో రౌడీలు ఎత్తుకుపోయారట. భూమిని వాళ్లు ఏం చేస్తారో అని నాకు చాలా భయంగా ఉంది వదిన. నువ్వే ఏదో ఒకటి చేయ్ వదిన.
అపూర్వ: ఏడవకు మీరా మన భూమికి ఏమైనా అయితే నేను మాత్రం తట్టుకోగలనా.. చెప్పు. నాకు తెలిసిన ఒక ఎస్పీ గారు ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతాను ఉండు. హాలో సార్ మా అమ్మాయి భూమి ఉంది కదా తను మీరాను హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటే.. ఎవరో రౌడీలు అడ్డగించి భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంట. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఎస్పీ గారు ఉదయాని కల్లా మా అమ్మాయి భూమి మా ఇంట్లో ఉండాలి.
మీరా: ఏమన్నారు వదిన
అపూర్వ: మీరా ఇక మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉదయానికి కల్లా.. భూమి మన ఇంట్లో సేప్‌గా ఉంటుంది. ఎస్పీగారు మాటిచ్చారు. మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా తీసుకెళ్తా అన్నారు.
మీరా: నిజంగానే భూమి ఇంటికి వస్తుందా వదిన.
అపూర్వ: నీ ముందే కదమ్మా ఫోన్‌లో మాట్లాడాను. అంత పెద్ద ఆయన తలుచుకుంటే అవకుండా ఎలా ఉంటుంది చెప్పు. పిన్ని గారు మీరైనా తనకు నచ్చజెప్పండి తనకు రెస్ట్ చాలా అవసరం.
మీరా: భూమిని రౌడీలు ఎత్తుకెళ్లారు.
అనగానే.. మీరాను ప్రసాద్ దగ్గరకు తీసుకెళ్తుంది వాళ్ల అత్తయ్య. ప్రసాద్ రూంలో మీరాను ఉంచి కొడుకును బయలకు తీసుకెళ్లి.. మియాపూర్ అవుట్‌స్కట్ లో కోల్డ్ స్టోరేజీలో భూమిని నక్షత్ర లాక్ చేసిన విషయం చెప్తుంది.
ప్రసాద్: వాళ్లు అలాంటి వాళ్లే అమ్మా .. వాళ్ల గురించి నీకు తెలిసింది చాలా తక్కువ తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. మనం అందరం ఇప్పుడు పాము పడగ నీడలో బతుకుతున్నాం. వాళ్లు మాట్లాడుకుంది నువ్వు విన్నట్టు వాళ్లకు తెలియకూడదు. తెలిస్తే నీకు ప్రమాదం.
అమ్మ: తెలియదురా..నువ్వు త్వరగా వెళ్లి భూమిని రక్షించు
ప్రసాద్: సరే అమ్మా నువ్వు జాగ్రత్త.
అంటూ ప్రసాద్ కోల్డ్ స్టోరేజ్ దగ్గరకు వెళ్లి డోర్ లాక్ పగులగొట్టి లోపల గగన్ ఉన్నాడన్న విషయం తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లాక్ పగులగొట్టింది చూసిన గగన్ వెంటనే ఆ రూంలోంచి భూమిని బయటకు తీసుకొస్తాడు. పక్కనే మంట పెట్టి భూమిని వేడి చేస్తుంటాడు. మరోవైపు ప్రసాద్, శారదకు ఫోన్ చేస్తాడు.
శారద: మీరేంటి ఈ టైంలో ఫోన్ చేశారు.
ప్రసాద్: గగన్, భూమిలు పెళ్లి చేసుకుంటారో లేదనని మనం టెన్షన్ పడుతున్నాం దానికి సమాధానం కూడా రేపే వస్తుంది.
శారద: ఎలా అండి
అంటూ శారద అడగ్గానే.. చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అంటూ ఫోన్ కట్ చేస్తాడు ప్రసాద్. మరుసటి రోజు స్టోరేజీ లోంచి బయటకు వస్తున్న గగన్, భూమిలను మీడియా వాళ్లు చూస్తారు. వాళ్లను చూసిన గగన్, భూమి షాక్ అవుతారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















