అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 19h: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రాను కిడ్నాప్ - షాక్‌లో లక్ష్మీ, వివేక్‌, జయదేవ్! లక్కీతో ఫోన్‌లో మాట్లాడింది ఏవరు?

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode: మిత్రాను కిడ్నాప్ చేసినట్లు సీసీఫుటేజ్‌లో చూసి లక్ష్మీ పోలీసులకు ఏం చెప్పంది. లక్కీతో ఫోన్‌లో ఏం మాట్లాడించింది.

 
Chiranjeevi Lakshmi Sowbhagyavathi : లక్ష్మీ చెప్పడంతో వివేక్(Vivek) మిత్రాను తీసుకొచ్చేందుకు ఆడిటర్ ఇంటి వెళ్లిపోతాడు. అరవింద మాత్రం మిత్రాకు ఏమైందోనని కంగారుపడుతుంది. జాను అత్తగారిని ఇంట్లోకి తీసుకెళ్లడంతో ఎటువాళ్లు అటు వెళ్లిపోతారు. జయదేవ్‌  లక్ష్మీని పక్కకు పిలిచి అసలు ఏంటని అడుగుతాడు. మిత్రా  ఆడిటర్ ఇంటికి వెళ్లలేదని...ఫోన్ చేస్తుంటే లిప్ట్ చేయడం లేదని ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని చెబుతుంది. 
 
దేవయాని మనీషాను  పిలిచి అడుగుతుంది. లక్ష్మీ, సంయుక్త ఒక్కటేనని నిరూపించడం కోసం మిత్రపై ఏమైనా ప్రయోగం చేశావా అని అడుగుతుంది. మిత్రాను నువ్వే కావాలని దాచిపెట్టి..లక్ష్మీని బయటకు లాగాలని చూస్తున్నావా అంటుంది. నాకు అసలు అలాంటి ఆలోచనే రాలేదని మనీషా బోరుమంటుంది
 
మిత్రా కోసం బయటకు వచ్చిన వివేక్‌కు మిత్రా ఫోన్ నుంచి కాల్ వస్తుంది. అన్నయ్యే ఫోన్ చేశాడని ఆనందంగా ఎత్తగా...అవతలి నుంచి ఎస్‌ఐ వాయిస్ వినిపిస్తుంది. బీచ్‌రోడ్డుకు దగ్గరలో ఓ కారు ఆగిపోయి ఉందని...అక్కడే ఈ ఫోన్ కూడా దొరికిందని చెబుతాడు. మీ అన్నయ్యను ఎవరో కిడ్నాప్ చేశారన్న అనుమానం కలుగుతోందని చెబుతాడు.
 
దీక్షితులుగారు మిత్రాకు గండం ముంచెత్తబోతుందని చెప్పారని జయదేవ్ లక్ష్మీకి చెబుతాడు. మిత్రాకు ప్రమాదం పొంచి ఉందని చెబుతుండగానే...వివేక్ పరుగెత్తుకుంటూ వచ్చి అసలు విషయం చెబుతాడు. అన్నయ్యను ఎవరో కిడ్నాప్ చేశారని...ఫోన్‌, కారు కూడా పోలీసుల వద్దే ఉన్నాయని చెప్పడంతో లక్ష్మీ, జయదేవ్ కంగారుపడతారు.
మనీషా మాటలను నమ్మని దేవయాని...మరోసారి ఆమెను రెట్టించి అడుగుతుంది. నువ్వు ఈ మధ్య తిక్కతిక్కగా ఆలోచిస్తున్నావని కోప్పడుతుంది. నీమీదే నాకు డౌట్ ఉందని చెబుతుంది. మిత్ర విషయంలో నేనేమీ చేయలేదని చెబుతుంది. 
 
అటు లక్ష్మీ సైతం ఈ విషయం అత్తగారికి తెలియకుండా దాచాలని జయదేవ్‌తో అంటుంది. తెలిస్తే మరింత కంగారుపడుతుందని ఆమె చెబుతుంది. మిత్రను ఈ గండం నుంచి ముందు బయటపడేయాలని లక్ష్మీ చెబుతుంది.
కిడ్నాపర్లు మిత్రాను తీసుకెళ్లి ఓ చీకటి గదిలో బందిస్తారు. అర్జునే నన్ను కిడ్నాప్ చేయించాడు కదా అంటూ మిత్రా కిడ్నాపర్లతో అనడంతో వారు కంగారుపడిపోతారు. సంయుక్త నాకు ఎక్కడ ప్రాజెక్ట్‌ ఇస్తుందోనని వాడే కిడ్నాప్ చేయించాడా అని అంటాడు. దీంతోవాళ్లు మిత్రాను హెచ్చరించి వెళ్లిపోతారు.
ఇంతలో వివేక్ అర్జున్‌కు ఫోన్ చేసి అసలు విషయం చెబుతాడు. మా అన్నయ్యను ఎవరో కిడ్నాప్ చేయించారని చెప్పగానే...అర్జున్ షాక్‌కు గురవుతాడు. బీచ్‌రోడ్డులో జరిగిందని చెప్పగానే తాను అక్కడికి వస్తున్నాని చెబుతాడు. అందరూ కలిసి మిత్రను కిడ్నాప్ చేసిన ప్రాంతానికి చేరుకుంటారు.
అంతలోనే పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ పెన్‌డ్రైవ్‌లోకి తీసుకుంటారు. అర్జున్ ల్యాప్‌టాప్‌లో ఆ ఫుటేజీ పరిశీలించగా...కిడ్నాప్ ఉదంతం మొత్తం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పోలీసులు మేం వారిని త్వరగానే పట్టుకుంటామని చెప్పగా....ఈ మేటర్‌ కొంచెం ఎవరికి తెలియకుండా ఎంక్వాయిరీ చేయాలని లక్ష్మీ కోరుతుంది. మనం వారిని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నట్లు తెలిస్తే...నిందితులు మిత్రాకు ఏమైనా ఆపద తలపెట్టే అవకాశం ఉందని చెబుతుంది.
 
స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన లక్కీ నానమ్మను చూసి ఆనందంతో ముద్దులు పెడుతోంది. తాను తయారు చేసిన ఫ్యామిలీ ట్రీ ఆమెకు చూపెడుతుంది. అందులో ఉన్న లక్ష్మీ ఫొటో చూసి ఈ ఫొటో నీకు ఎవరు ఇచ్చారని అడుగుతుంది. అమ్మ స్థానంలో ఈ ఫొటో పెట్టమని ఎవరు చెప్పారని అడగ్గా...సంయుక్త ఆంటీ  పెట్టమని చెప్పిందని చెబుతుంది. అంతలో లక్ష్మీ, వివేక్ అక్కడికి వస్తారు. వాళ్లను చూసిన లక్కీ నాన్న కావాలి ఎక్కడని అడుగుతుంది. మిత్రాను తీసుకుని రమ్మంటే ఉట్టి చేతులతోనే ఎందుకు వచ్చావని వివేక్‌పై అరవింద కోప్పడుతుంది. అన్నయ్య బిజీగా ఉన్నాడని చెప్పినా వినదు.వెంటనే వాడికి ఫోన్ చేయమని చెబుతుంది. లక్కీ కూడా మిత్రతో మాట్లాడాని గొడవ పెట్టడంతో లక్ష్మీ అర్జున్‌కు ఫోన్ చేస్తుంది. అర్జునే మిత్రాలా లక్కీతో మాట్లాడతాడు. త్వరగా ఇంటికి వస్తానని చెప్పడంతో లక్కీ ఫోన్ కట్‌ చేసి ఇంట్లోకి వెళ్లిపోవడంతో ఈ రోజు ఏపిసోడ్ ముగుస్తుంది.
 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget