Shravana Masam 2024: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!
Shravana Masam 2024:శ్రావణమాసం మొదలవుతోంది. శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు అమ్మవారికి స్త్రీసూక్త విధానంతో ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే శ్రీ సూక్తం చదివేటప్పుడు ఈ శ్లోకంలో తప్పులు అస్సలు చదవకూడదు
Shravana Masam 2024: వేదంలో ఉండే అద్భుతమైన మంత్రాలను ఓ చోటుకి చేర్చి మన మహర్షులు సూక్తాలు తయారు చేశారు. అందుకే ప్రతి సూక్తానికి అద్భుతమైన శక్తి ఉంటుంది. దుర్గాసూక్తం, శ్రీ సూక్తం ఇలా...శత్రు బాధలు తొలగించి ధైర్యాన్నిచ్చేది దుర్గాసూక్తం...ఆర్థిక బాధల నుంచి ఉపశమనం కలిగించేది శ్రీ సూక్తం. అయితే వీటిలో ఎక్కువమంది చదివి సూక్తం శ్రీ సూక్తం. అయితే ఈ సూక్తాలు భక్తిశ్రద్ధలతో స్పష్టంగా చదివితే ఎంత మంచి ఫలితాలు ఇస్తాయో..తప్పులు చదివితే చెడు ఫలితాలు వస్తాయంటారు. ఎందుకంటే తెలుగు శ్లోకాలలో ఓ అక్షరం అటు ఇటు అయినా అర్థం మారిపోతుంది. అలా శ్రీ సూక్తంలో చాలామంది చదివే తప్పులు..వాటిని ఎలా సరిచేసుకోవాలో చెప్పేందుకే ఈ కథనం.
Also Read: స్వస్తిక్ గీసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హిట్లర్ పతకానికి కారణం అదేనా!
శ్రావణమాసం వచ్చేస్తోంది. ఈ నెలంతా మంగళగౌరీ పూజ, వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ప్రతి శుక్రవారం శ్రీ సూక్తం విధానంలో అమ్మవారికి పూజలు చేస్తారు. మీరు నిత్యం శ్రీ సూక్తం చదివేవారైతే..ఈ తప్పులు దొర్లుతున్నాయేమో చూసుకుని సరిచేసుకోండి...
చంద్రాం ప్ర’భాసాం యశసా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్
తాం పద్మినీ’మీం శరణమహం ప్రప’ద్యే உ(అ) లక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే
తాం పద్మినీం...ఈం..శరణ మహం ప్రపద్యే అని చదవాలి. శక్తి ప్రణవాన్ని స్పష్టంగా ఉచ్ఛరించాలి. తాం పద్మినీ’మీం శర’ణమహం ప్రప’ద్యే పక్కనే 'உ' గుర్తు ఉంది గమనించారా...సంస్కృతంలో ఈ గుర్తుకు 'అ' అని అర్థం. నిన్ను శరణు వేడుకుంటున్నాను అలక్ష్మీర్నే నశ్యతాం అంటే...దరిద్ర దేవతను నశింపచేయమని అర్థం. ఆ సింబల్ ను గుర్తించకుండా 'లక్ష్మీర్మే’ నశ్యతాం అని చదివితే నా సంపదలు నాశనం చేయి అని అర్థం.
లక్ష్మీదేవిని ఎవరైనా కానీ సంపద ప్రసాదించమని కోరుకోవాలి...కానీ.. మీరు ఈ శ్లోకాన్ని సరిగా చదవకపోతే నా సంపదను నాశనం చేయమ్మా అని అర్థం వస్తుంది. అందుకే శ్రీ సూక్తంలో ఐదో శ్లోకం ఇది...దీన్ని మీరు ఇప్పటివరకూ సరిగా చదివితే సరే కానీ లేదంటే సరిచేసుకోండి. వేదం చదివేటప్పుడు, సూక్తాలు చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి.
Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!
శ్రావణమాసంలో అమ్మవారి పూజా సమయంలో చదువుకోవాల్సిన శ్రీ సూక్తం ఇదే..!
ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||
తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షానహమ్ ||
అశ్వపూర్వాం ర’థమధ్యాం హస్తినా”ద-ప్రబోధి’నీమ్ |
శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ ||
కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం తర్పయం’తీమ్ |
పద్మే స్థితాం పద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ |
తాం పద్మినీ’మీం శరణమహం ప్రప’ద్యే உ(అ)లక్ష్మీర్మే’ నశ్యతాం త్వాంవృణే ||
ఆదిత్యవర్ణే తపసో உధి జాతో వనస్పతిస్తవ వృక్షో உథ బిల్వః|
తస్య ఫలాని తపసాను’దంతు మాయాంతరాయాశ్చ’ బాహ్యా అ’లక్ష్మీః ||
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి’నా సహ |
ప్రాదుర్భూతో உస్మి రాష్ట్రే உస్మిన్ కీర్తిమృద్ధిం దదాదుమే||
క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’లక్షీం నా’శయామ్యహమ్ |
అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ ||
గంధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్‍మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||
మన’సః కామమాకూతిం వాచః సత్యమ’శీమహి |
పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ ||
కర్దమే’న ప్ర’జాభూతా మయి సంభ’వ కర్దమ |
శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ ||
ఆపః సృజంతుస్నిగ్దాని చిక్లీత వసమేగృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే||
ఆర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |
సూర్యాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||
ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||
తాం మ ఆవ’హ జాత’వేదో లక్షీమన’పగామినీ”మ్ |
యస్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యో உశ్వా”న్, విందేయం పురు’షానహమ్ ||
ఓం మహాదేవ్యై చ విద్మహే’
విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో’ లక్ష్మీః ప్రచోదయాత్ ||
శ్రీ-ర్వర్చ’స్వ-మాయు’ష్య-మారో”గ్యమావీ’ధాత్ పవ’మానం మహీయతే” |
ధాన్యం ధనం పశుం బహుపు’త్రలాభం శతసం”వత్సరం దీర్ఘమాయుః’ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
Also Read: శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం - వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది!