Secrets of Swastik: స్వస్తిక్ గీసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. హిట్లర్ పతకానికి కారణం అదేనా!
Secrets of Swastik: శుభాకార్యాలు, మంగళప్రదమైన పనులు జరిగే ప్రదేశాల్లో స్వస్తిక్ సింబల్ గీస్తుంటారు. అయితే స్వస్తిక్ గీసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
Secrets of Swastik: గృహప్రవేశాలు, శుభకార్యాల సమయంలో స్వస్తిక్ ఆకారాన్ని ద్వారానికి గీస్తారు. వ్యాపారులు పుస్తకాల్లోనూ స్వస్తిక్ కనిపిస్తుంది. స్వస్తిక్ అంటే మరేంటో కాదు ఓంకారానికి సింబల్ స్వస్తిక్.
వాస్తవానికి సంస్కతానికి లిపి లేదు..సంస్కతం దేవభాష. వింటూ ఒకరి నుంచి మరొకరికి వచ్చింది. సంస్కృతానికి మూల భాష బ్రహ్మలిపి అని చెబుతారు. ఆ తర్వాత కాలంలో బ్రహ్మలిపి , దేవనాగరి లిపిని ఆధారంగా చేసుకుని సంస్కృతానికి లిపి తయారు చేశారు. బ్రహ్మలిపి ప్రకారం 'ఒ' అనే అక్షరం...స్వస్తిక్ లో ఓ గీతలా ఉంటుంది...అలాంటి రెండు గీతలను కలిపితే ఓం అయింది...అలా ఓంకారానికి సింబల్ స్వస్తిక్ అని చెబుతారు.
స్విస్తిక్ అంటే సంస్కృతంలో శుభప్రదం, మంగళప్రదం... అందుకే ఎక్కడైనా శుభకార్యాలు జరిగే ప్రదేశంలో స్వస్తిక్ గీస్తుంటారు. స్వస్తిక్ అనేది గణపతి స్వరూపం అని కొందరు, లక్ష్మీ స్వరూపం అని మరి కొందరు..సూర్య గమనాన్ని సూచిస్తుందని ఇంకొందరు ఉపాసకులు అంటారు. స్వస్తిక్ ను అదృష్టానికి, అనంతమైన సృష్టికి, అంతులేని విజయాలకు, చిహ్నంగా భావిస్తారు.
Also Read: మనసులో కోర్కెలు తీర్చే కామిక ఏకాదశి ( జూలై 31) - తులసి ఆకులతో ఇలా చేయండి!
స్వస్తిక్ గీసేటప్పుడు చేయకూడని పనులు
స్వస్తిక్ ను 4 నంబర్ రాస్తాంకదా అలానే ప్రారంభించాలి..రివర్స్ లో గీయకూడదు...
స్వస్తిక్ ను సరిగ్గా గీయాలి....అటు ఇటు వంచేలా అస్సలు గీయకూడదు..స్ట్రైయిట్ గా ఉండాలి
హిట్లర్ పతనానికి కారణం ఇదేనా!
అడాల్ఫ్ హిట్లర్ అప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో తన నాజీ ఉద్యమానికి, జర్మనీకి బలమైన భవిష్యత్తు సూచించే చిహ్నం కోసం ఆయన వెతుకున్న సమయంలో స్వస్తిక్ మంచి ఆప్షన్ లా కనపించింది. స్వస్తిక్ పవర్, దానికున్న విశిష్టత గురించి తెలుసుకున్న హిట్లర్ అది నాజీ ఆదర్శాలకు ఒక చారిత్రక పునాదిని ఇస్తుందని భావించారు. అలా 1920లో తన పార్టీకి, ఉద్యమానికి చిహ్నంగా సూచించే జెండాపై స్వస్తిక్ ను ముద్రించారు.
జెండాపై స్వస్తిక్ గుర్తు స్ట్రైయిట్ గా కాకుండా పక్కకు వంచి ఉంటుంది. ఇదే హిట్లర్ పతనానికి కారణం అయిందంటారు. అప్పటి నుంచి కొన్ని ప్రాంతాల్లో ద్వేషానికి కూడా చిహ్నంగా మారింది. భయానికి, జాతి విద్వేషానికి, మారణహోమానికి, చెడుకు ప్రతిరూపంగా స్వస్తిక్ మారింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వస్తిక్ ను బహిరంగంగా ప్రదర్శించడాన్ని జర్మనీలో నిషేధించారు. విదేశాల్లో ఈ సింబల్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ రైటిస్ట్ సిద్ధాంతాలకు, శ్వేతజాతి ఆధిపత్య వాదానికి చిహ్నంగా కొనసాగుతోంది. అగ్రరాజ్యంలో ఈ సింబల్ పై ఎలాంటి నిషేధం లేదు.
Also Read: రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, నాగపంచమి సహా 2024 ఆగష్టు నెలలో వచ్చే పండుగలివే..!
హిందువులకు మాత్రం స్వస్తిక్ అత్యంత పవిత్రమైన చిహ్నం...ఆలయ ప్రవేశాల నుంచి వాహనాల వరకూ, పండుగల నుంచి శుభకార్యాలవరకూ ఎక్కడచూసినా స్వస్తిక్ కనిపిస్తుంది. హిందువులతో పాటూ బౌద్ధులు, జైనులకు కూడా స్వస్తిక్ ఆరాధనీయ చిహ్నం. పండుగల సమయంలో లోగిళ్లలో ముగ్గులు కూడా స్వస్తిక్ రూపంలో వేసి రంగులద్దుతారు.
ఉత్తరాదివారి వివాహాలలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు నుదుట బాసికంలా స్వస్తిక్ ఉంటుంది. దేశంలో ఎన్నో మతాలకు చెందినవారు ఈ చిహ్నాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తారు. సుమారు 15 వేల సంవత్సరాల క్రితం నుంచి స్వస్తిక్ మనుగడలో ఉందంటారు చరిత్రకారులు. మనదేశంలో మాత్రమేకాదు జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజంలలో టిబెట్, చైనా, జపాన్, గ్రీస్, అజ్టెక్, సెయ్లాన్, హోపి, సెల్ట్, బాలి, మాల్టా, ల్యాప్‌లాండ్ వంటి దేశాల్లో స్వస్తిక్ సింబల్ శుభానికి సూచనగా వినియోగిస్తారు.
Also Read: శ్రావణమాసం ఎప్పటి నుంచి ప్రారంభం - వరలక్ష్మీ వ్రతం ఎప్పుడొచ్చింది!