అన్వేషించండి

Podharillu Serial Today March 2nd: చక్రిపై కోపంతో ఇంటికి రాకుండా మహా ఎక్కడికి వెళ్లింది...? మహాను వెతుక్కుంటూ వెళ్లిన చక్రికి ఎలాంటి అనుభవం ఎదురైంది....?

Podharillu Serial Today Episode March 2nd: చక్రిపై కోపంతో ఇంటికి రాకుండా మహా ఎక్కడికి వెళ్లింది...? మహాను వెతుక్కుంటూ వెళ్లిన చక్రికి ఎలాంటి అనుభవం ఎదురైంది....?

Podharillu Serial Today Episode: మహాకు మాధవ్‌ నిజం చెప్పేయడంతో  ఆమె చక్రిని పిలిచి చెడామడా తిడుతుంది.నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడతావని అనుకోలేదని...నిన్ను నమ్మి అనవసరంగా  నీ వెంట వచ్చానని అంటుంది. మహాలక్ష్మీ మాటలకు ఏం చెప్పాలోఅర్థంకానీ చక్రి చాలాసేపు ఆమెను కన్విన్స్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ పదేపదే ఆమె అబద్ధాలకోరు అని అనడంతో చక్రికి చాలా కోపం వస్తుంది. నేను నిజం దాచును తప్ప...మిమ్మల్ని మోసం చేయాలని చూడలేదని అంటాడు. అయినా నేను మీకు అబద్ధం చెప్పి కోట్లు ఏమైనా సంపాధించానా  అని అంటాడు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు వందల అబద్ధాలు చెప్పావని చక్రిపై ఇంకాస్త మండిపడుతుంది. అయినా నేను చేసిన దానిలో తప్పేముందని చక్రి నిలదీస్తాడు.

నేను ఏమైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని కలకన్నానా...లేక మీరు నా వెంట నడిచొస్తారని మీఇంట్లో చేరిన రోజే తెలుసా అంటాడు.  ఓ యజమానికి,డ్రైవర్‌ కుటుంబం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటుంది. రోజుకు వందల మంది నా టాక్సీ ఎక్కుతుంటారు. వాళ్లందరికీ  మాఇంటి పరిస్థితి ఇదీ...మా అన్నయ్య తాపీ మేస్త్రీ అని చెప్పుకుంటూ కూర్చోమంటారా అని మండిపడతాడు.  మా అన్నయ్య గురించి గొప్పగా  చెప్పుకోవాలని...మాఇంటి గురించి గొప్పగా మాట్లాడుకోవాలని అలా చెప్పానని అంటాడు. అయినా నాలుగురు రోజు ఉండిపోయేవాడికి  నా ఇంటికి గురించి నిజాలు చెప్పాల్సిన  పనిలేదని అలా అబద్ధాలు చెబుతుంటామని అంటాడు. దీనివల్ల మీకు వచ్చిన నష్టమేమీ ఉండదు కాబట్టి అలా చెబుతామని అంటాడు.

మా అన్నయ్య ఆర్కిటెక్‌ అని చెప్పడం వల్ల నాకు కలిసొచ్చే కోట్లు ఏమీ ఉండవు కదా అంటాడు. తప్పించుకోవాలని చూడొద్దని మహా మండిపడుతుంది. ఆ తర్వాత అయినా నిజం చెప్పొచ్చుకదా అని అంటే....ఎలాగూ అబద్ధం చెప్పేశాం కదా మళ్లీ నిజం చెబితే మీరు ఎక్కడ  అసహ్యించుకుంటారోనని  చెప్పలేదని అంటుంది. ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగిన తర్వాత....మహా కోపంగా ఆటోలో వెళ్లిపోతుంది.
                           

మహాలక్ష్మీ ఇంటికి రాకపోవడంతో కన్నా చాలా కంగారుపడుతుంటాడు.అప్పుడే ఇంటికి వచ్చిన కేశవ్‌కు విషయం చెబుతాడు. మాధవ్‌ అన్నయ్య వదినను తీసుకుని వెళ్లాడని చెబుతాడు.ఇంతలో మాధవ్ కూడా ఇంటికి రాకవడంతో వాళ్లిద్దరూ మాధవ్‌ను అడుగుతారు. తనవల్లే ఇంటర్వూ పోయిందని బాధపడుతుంటే...ఇంకా ఆమెను భ్రమలో ఉంచడం ఇష్టంలేక నిజం చెప్పేశానని...నేను చేస్తున్న పనేంటో స్వయంగా తీసుకెళ్లి చూపించానని అంటాడు. నా దగ్గర నుంచి చక్రితో మాట్లాడి ఇంటికి వెళ్తానని చెప్పిందని అంటాడు. ఇంకా ఇంటికి రాకపోవడంతో ఏంటని అనుకుంటారు.ఇంతలో చక్రి రాగానే....వాడిని అడుగుతారు. వాళ్ల అన్నయ్య నిజం చెప్పేశాడని అప్పటికే  కోపంతో రగిలిపోతున్న చక్రి...వాళ్లపై గట్టిగా అరిచి మహాను వెతుక్కుంటూ వెళ్లిపోతాడు. చక్రిపై కోపంతో మహాలక్ష్మీ గుడికి వెళ్లి అక్కడ కూర్చుంటుంది.

అప్పుడే అక్కడికి వచ్చిన చక్రివాళ్ల మేనత్త....మహాను చూసి దగ్గరకు వచ్చి ఆ ఇంటి గురించి..మేనళ్లుల గురించి చెడుగా చెబుతుంది. వాళ్లంతా  రౌడీలని...అసలు ఏం చూసి నువ్వు ఆ చక్రిని పెళ్లిచేసుకున్నావని నిలదీస్తుంది. మీ అన్నయ్య కుటుంబం గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారని  మహా అనగా....మా అన్నయ్య ఓ తాగుబోతని, సొంత పెళ్లాన్ని చంపి జైలుకు వెళ్లివచ్చాడని చెప్పడంతో మహా చాలా భయపడుతుంది.చక్రి వాళ్ల ఇంటి గురించి  ఒక్కొక్క నిజం తెలిసిపోతుండంతో  చక్రి ఎన్ని అబద్ధాలు ఆడాడో అర్థంగాక తలపట్టుకుని కూర్చుంటుంది. ఊరంతా వెతికి చక్రి కూడా  గుడికి రాగా....అక్కడ మహాలక్ష్మీ కనిపిస్తుంది. ఇంటికి వెళ్తాం రమ్మంటే మళ్లీ గొడవ మొదలవుతుంది.

అసలు నువ్వు నాతో మాట్లాడొద్దని...నిన్న చూస్తేనే అసహ్యం వేస్తోందని అంటుంది. మా ఇంట్లో వాళ్ల నా సర్టిఫికేట్లు కాల్చి నా కలలు నాశనం చేస్తే....దొంగ ఇంటర్వూ పేరిట ఉన్న  నా ఆశలు బూడిద చేశావని మండిపడుతుంది. ఇంటర్వూ మా అన్నయ్య ఇప్పించాడన్నది మాత్రం అబద్ధమైన....ఇంటర్వూ మాత్రం నిజమేనని చక్రి అంటాడు. కావాలంటే మా ప్రెండ్‌కు ఫోన్ చేసి మాట్లాడిస్తానని ఫ్రెండ్‌కు ఫోన్ చేయగా....వాడు జరిగిందంతా చెబుతాడు. దీంతో చక్రిపై మహా లక్ష్మీ ఇంకా మండిపడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కన్నా...ఇంటికి వెళ్తామని చెప్పడంతో వాడితోపాటు మహా ఇంటికి వెళ్తుంది.  ఇంటికి తిరిగి వచ్చిన చక్రి....వాళ్ల అన్నయ్యపై తీవ్రస్థాయిలో మండిపడతాడు. నిన్ను నిజం ఎవరు చెప్పమన్నారంటూ  ఆగ్రహం వ్యక్తం చేస్తాడు..
  

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget