అన్వేషించండి
Advertisement
Satyabhama Serial Today August 19th: సత్యభామ సీరియల్: మైత్రీ, హరి మధ్య ఉన్న సంబంధం గురించి నిలదీసిన భార్యకు హరి ఏం సమాధానం చెప్పాడు
Satyabhama Today Episode August 19th: తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న సత్యకు క్రిష్ ఎలాంటి సేవలు చేశాడు..నేటి సత్యభామ ఏపిసోడ్‌లో చూద్దాం.
Satyabhama Today Episode: బామ్మ మాటలకు భోజనం వద్ద నుంచి లేచి వెళ్లిపోయిన క్రిష్...సత్య బెడ్‌రూంలోకి వెళ్తాడు. నిద్రపోతున్న సత్యను చూసి నాకు నీపై నమ్మకం లేకకాదు సత్య(Satya)....నాపైనే నీకు నమ్మకం లేదు. అందుకే నీకు దూరం అవుదామనుకున్నా...కానీ నా వల్ల కావడం లేదంటాడు. ఆమె ముఖం మీద చేయి వేసి చూడగా....ఒళ్లు కాలిపోతుంది. జ్వరం వచ్చిందని అనుకుంటుంటగా సత్యకు మెలకువ వచ్చి లేస్తుంది. హడావుడిగా సారీ అండీ టైం చూసుకోలేదు పది నిమిషాల్లోనే వంట చేస్తాను అంటూ లేవబోతుంది. నీకు జ్వరం వచ్చింది పడుకోమని క్రిష్(Krish) అంటాడు. నా మీద కోపం లేదా అని సత్య అడగ్గా...ఎలాంటి కోపం లేదని, కొండంత నమ్మకం ఉందని క్రిష్ చెబుతాడు. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోమని చెబుతాడు. నేను డాక్టర్‌ను తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిపోతాడు.
Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: శంకర్, గౌరిల మధ్య చిచ్చు పెట్టిన ఇంటి ఓనరు – ఓనరు ను చితక్కొట్టిన అకి
మైత్రీ తల్లిదండ్రులను తీసుకుని హరి పెళ్లిపత్రికలు ఇవ్వడానికి వెళ్లబోతున్నాడని తెలుసుకున్న నందిని(Nandini)....అతన్ని ఆపేందుకు రేపు సినిమాకు వెళ్దామని ప్రపోజల్ పెడుతుంది. దీన్ని ముందే గ్రహించిన హరి(Hari)..నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో పెడతావని....నేను మైత్రీ వాళ్ల తల్లిదండ్రులతో బయటకు వెళ్తున్నాననే కదా నువ్వు ఈ ప్రోగ్రాం పెట్టావ్ అని మందలిస్తాడు. ప్రతిసారీ గొడవలు పెట్టుకోకుండా కాస్త అర్థం చేసుకోమంటాడు.
నందిని: లేదు..మనం రేపు ఖచ్చితంగా సినామాకు వెళ్లాల్సిందే.
హరి: ప్రతిసారీ మొండితనం చేయడం మానేయి నందిని. పరిస్థితి అర్థం చేసుకో.
నందినీ: మొండితనం చేస్తుంది ఎవరు..? నేనా నువ్వా..? ఏ భార్య అయినా భర్త లవర్‌ను ఇంటికి రానిస్తుందా..? ముచ్చట్లు పెట్టనిస్తుందా..? నేను కాబట్టి చూస్తూ చూడనట్లు వదిలేస్తున్నా.. పెళ్లికి ముందు మీ మధ్య ఏం జరిగిందా అని అడగడం లేదు.? కానీ ఇప్పుడు నా కళ్ల ముందు ఏం జరిగినా ఊరుకోను అంటున్నా...? అది తప్పా..?
హరి: నేను పెళ్లికి ముందు మైత్రీని ఇష్టపడ్డ మాట నిజం... ఆ చిన్న విషయాన్ని పెద్దది చేసి రాద్దాంతం చేస్తున్నావ్.
నందని: మగాడివి కదా నీకు అది చిన్న విషయమే...ఆడదాన్ని కదా నా భయాలు నాకు ఉంటాయి..
హరి: ఇప్పుడు ఇందులో భయపడాల్సింది ఏముంది..? మైత్రి తన పెళ్లి పనుల్లో నా హెల్ప్ అడిగింది చేస్తానన్నాను..
నందిని: మైత్రీ నిన్ను హెల్ఫ్ అడగటం కాదు...నిన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తోంది. నాకు తెలియదనుకున్నావా..?
హరి: ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఏంటి.?
నందిని: తప్పదు కాబట్టి మైత్రి నీకు దూరమైంది కానీ...మనసులో నుంచి నిన్ను ఇంకా దూరం చేసుకోలేదు. మీ ఇద్దరి చూపుల్లో అది అర్థమవుతోంది.
హరి: పిచ్చిపిచ్చిగా మాట్లాడకు..
నందిని: ఉన్నమాటే అంటున్నా.. నా మనసుకు అనిపించింది అంటున్నా...నేను చెప్పింది తప్పయితే రేపు నువ్వు నన్ను సినిమాకు తీసుకుని వెళ్లు నీ నిజాయితీ నిరూపించుకో.
హరి: నీ అనుమానాలు నీ దగ్గరే దాచిపెట్టుకో...రేపు నేను మైత్రీ పేరెంట్స్‌ను తీసుుకుని వెళ్తున్నా..అంతే
డాక్టర్ వచ్చి సత్యను పరిశీలించి జ్వరం ఎక్కువగా ఉందని ఇంజెక్షన్ చేసి వెళ్తుంది. ప్రతి రెండు గంటలకు ఒకసారి జ్యూస్ తాగించాలని చెబుతుంది. బామ్మ సత్యతో మీ అమ్మకు ఫోన్ చేసి పిలిపించమంటావా అంటుంది. మీరు ఉన్నారు కదా చూసుకోవడానికి అంటుంది. బామ్మ వెళ్లిపోగానే క్రిష్‌తో సత్య మాట్లాడుతుంది.
సత్య: మన బంధం రెండునెలల్లో విడిపోతుందని తెలుసు.. ఎవరికి వాళ్లు అయిపోతామని తెలుసు. అయినా ఎందుకు నా గురించి ఇలా తాపత్రయపడుతున్నావ్..ఎందుకు నాకు సేవలు చేస్తున్నావ్ తెలుసుకోవచ్చా..
క్రిష్: ఈ రెండు నెలల్లో ఏమైనా జరగొచ్చని ఎవరో నాతో అన్నారు..
సత్య: ఏం జరగొచ్చంటా..?
క్రిష్: తెలియదు.
సత్య: గట్టిగా అడగొచ్చు కదా
క్రిష్: ఎవరిని
సత్య: నీతో ఆ మాటలు అన్నవారిని.
క్రిష్: అడిగి ఇబ్బంది పెట్టుడు నాకు ఇష్టం లేదు
సత్య: అడగకపోతే ఎలా తెలుస్తుంది
క్రిష్: ఆ ముచ్చట చెప్పిన వాళ్లపై నాకు నమ్మకం ఉంది.
సత్య: కానీ చెప్పిన వాళ్లకు తాను చెప్పిన వాటిపై నమ్మకం ఉండాలి కదా
క్రిష్: పనికిరాని మాటలు చెప్పి విసిగించొద్దని మా బామ్మ చెప్పింది. కాబట్టి నువ్వు కళ్లు మూసుకుని రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్లిపోతాడు.
Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరుకు వాయనం ఇచ్చిన మిస్సమ్మకు – ఆరు ఆత్మను కళ్లారా చూసిన మనోహరి
అటు నందిని, హరి మాటలు విన్న వాళ్ల అమ్మ హరి వద్దకు వచ్చి మాట్లాడుతుంది. నందిని మాటలు పట్టించుకోకమ్మా అని హరి నచ్చజెబుతాడు. కానీ మైత్రీని ఇష్టపడిన సంగతి మా దగ్గర ఎందుకు దాచావ్ అని అడుగుతుంది. దాచాలని ఏం అనుకోలేదు కానీ చెప్పే లోపే అనుకోకుండా నందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటాడు. ఇక చెప్పాల్సిన అవసరం రాలేదంటాడు. చెల్లి పెళ్లి కోసం నీ ప్రేమను త్యాగం చేశావా అంటూ నిలదీస్తుంది.
ఇప్పటికీ నువ్వు మైత్రీనే ఇష్టపడుతున్నావా అని వాళ్ల అమ్మ అడుగుతుంది. కానీ నందినీ పెళ్లి చేసుకున్న తర్వాత....నందినీనే ఇష్టపడుతున్నానని వేరొకరిని మనసులోకి రానివ్వలేదని చెబుతాడు. ఈ విషయం నందినీకి చెప్పినా అర్థం కావడం లేదంటాడు. నమ్మించడం చేతకాకపోతే ఆ తప్పు నీదేనని...అనవసరంగా నందిని నిందించొద్దంటుంది. భర్త ప్రేమను గౌరవించే విశాల హృదయం ఏ భార్యకు ఉండదు అంటోంది. రేపు రావడం కుదరదని మైత్రీకి చెప్పు అని చెబుతుంది. నందినీకి మాటిచ్చాని చెప్పగా....ప్రేమించే వెనక్కి తగ్గావు..దానికన్నా ఇది పెద్ద విషయమేమీ కాదని చెబుతుంది. తను అర్థం చేసుకుంటుంది. రేపు మైత్రీకి పెళ్లయిన తర్వాత నువ్వు పదేపదే తన ఇంటికి వెళితే వాళ్ల ఆయన అపార్థం చేసుకోడా..? నందినీ కూడా అంతే. ఈ విషయం పెద్దదై మహాదేవయ్యగారి వద్దకు వెళ్తే ఏం జరుగుతుందో నువ్వు ఊహించు అంటుంది. మరుక్షణం సత్య ఈ ఇంట్లో ఉంటుంది. ఈ సమస్యను మొగ్గలోనే తుంచేయమంటుంది. నందినీని బాధపెట్టకుండా చూసుకోమంటుంది. దీంతో హరి నందిని వద్దకు వెళ్లి రేపు మనం సినిమాకు వెళ్తున్నామని చెబుతాడు. దీంతో ఆమె చాలా సంతోషిస్తుంది.
Also Read: ‘జగధాత్రి’ సీరియల్: భూపతి మనుషులను చితక్కొట్టిన ధాత్రి, కేదార్ – హ్యాపీగా ఫీలయిన పరంధామయ్య
జ్వరంతో బాధపడుతున్న సత్యకు రాత్రంతా సేవలు చేస్తాడు క్రిష్...అందుకు ప్రతిగా సత్య ఉదయమే రూమ్ డెకరేషన్ చేసి థ్యాంక్సు చెబుతుంది. అవసరమా ఇదంతా అంటూ క్రిష్ కోప్పడతాడు. ప్రతిదీ హైలెట్ చేయాల్సిన పనిలేదంటాడు.దీనికి సత్య నేను అత్తయ్య ఛాలెంజ్ తీసుకుని బోనం ఎత్తుకుని వెళ్తే...నువ్వు ఎందుకు అంత కేర్ తీసుకున్నావ్..నన్ను గెలిపించడానికి ఎందుకు తాపత్రయపడ్డావ్ అని అడుగుతుంది. జ్వరం వచ్చి ఎవరూ పట్టించుకోకపోయినా...నువ్వు మాత్రం ఎందుకు సేవలు చేశావ్ అని నిలదీస్తుంది. రొటీన్‌గా తీసుకుని నా ఖర్మకు నన్ను వదిలేయోచ్చు కదా..నువ్వు కూడా క్యాజువల్‌గా ఫీల్ అవ్వొచ్చు కదా అంటూ ప్రశ్నించడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion