Nindu Noorella Saavasam Serial Today August 19th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరుకు వాయనం ఇచ్చిన మిస్సమ్మకు – ఆరు ఆత్మను కళ్లారా చూసిన మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: ఒక్క వాయనం మిగిలిందని నిర్మల చెప్పగానే అది పక్కింటి అక్కకు ఇస్తానని మిస్సమ్మ బయటకు వచ్చి ఆరుకు వాయనం ఇవ్వడం మనోహరి చూడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు భాదను చూసి కూడా నేను నీకు నిజం చెప్పలేనని గుప్త మనసులో అనుకుంటాడు. దీంతో ఆరు మీకు నిజం తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారా? గుప్త గారు. అంటూ ప్రశ్నిస్తుంది. మీకు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నిజం చెప్పకపోయినా పర్వాలేదండి అంటుంది. దీంతో గుప్త ఆరును మెచ్చుకుంటాడు. నిన్ను చంపిన పాపం ఆ మనోహరికి ఎన్ని జన్మలెత్తినా పోదని అంటాడు. మరోవైపు ఇంట్లో అందరూ కూర్చుని పాయసం తింటుంటారు.
నిర్మల: మిస్సమ్మ ఆరు బతికుండగా ఎంత నిష్టగా పూజ జరిగిందో ఈ రోజు కూడా అంతే నిష్టగా పూజ జరిగిందమ్మా.. ఆ వచ్చిన ముత్తైదువులు కూడా నిన్ను నీవు పూజ చేసిన విధానం చూసి అచ్చం ఆరు లాగే చేశావని మెచ్చుకున్నారమ్మా..
శివరాం: అవును మిస్సమ్మ వాళ్లు చెప్పింది అక్షరాలా నిజం. ఇవాళ నిన్ను పూజలో చూస్తుంటే అచ్చం మా ఆరును చూసినట్లే అనిసిస్తుంది.
అని ఇద్దరూ చెప్తుండగానే అమర్ ఆరును గుర్తు చేసుకుంటాడు.
నిర్మల: ఎందుకో అమ్మాయి పూజలో మన మధ్యనే ఉన్నట్లు అనిపించిందండి.
మనోహరి: అమర్ భార్య స్థానంలో ఈ ఇంటి కోడలు స్థానం నాది. అక్కాచెల్లెల్లు కలిసి నా దగ్గరి నుంచి లాక్కున్నారు. నాకు దక్కాల్సినవి అన్నీ మీ నుంచి లాక్కునే దాకా వదలను.( అని మనసులో అనుకుంటుంది. మనోహరి)
Also Read: ‘జగధాత్రి’ సీరియల్: భూపతి మనుషులను చితక్కొట్టిన ధాత్రి, కేదార్ – హ్యాపీగా ఫీలయిన పరంధామయ్య
ఇంతలో రాథోడ్ వస్తాడు. కమాండర్ సురేందర్ ఫైల్ పంపించాడని చెప్పడంతో బయటకు వెళ్లబోతూ అమర్, మిస్సమ్మకు థాంక్స్ చెప్పి.. మరోసారి ఆరును గుర్తు చేసుకుంటాడు. ఇవాళ పూజలో ఆరు నన్ను ముట్టుకున్నట్లు అనిపించింది. అని చెప్పగానే మిమ్మల్ని అందర్ని వదిలి అక్క ఎక్కడికి వెళ్లదండి.. తనను చంపిన వాళ్లకు శిక్ష పడేవరకు చూడటానికైనా ఇక్కడే ఉంటుందని మిస్సమ్మ అనగానే మనోహరి టెన్షన్ పడుతుంది.
నిర్మల: మిస్సమ్మ ఇంకొక వాయనం ఉంది కదా? లక్ష్మీ అక్కకు ఇద్దాం..
మిస్సమ్మ: ఎందుకు అత్తయ్యా.. పక్కింకి అక్కకు ఇద్దాం.. నేను వెళ్లి ఆవిడకు ఇచ్చేసి వస్తాను.
మనోహరి: కచ్చితంగా అక్కా అంటుందంటే వాయనం ఎవరికి ఇస్తుంది. ( అని మనసులో అనుకుంటుంది.)
మిస్సమ్మ బయటకు వెళ్లి ఆరుకు వాయనం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మేడ మీదకు వెళ్లి అంతా గమనిస్తున్న మనోహరిని గుప్త చూస్తాడు. మిస్సమ్మ మాత్రం ఆరుతో మాట్లాడుతుంది. మనోహరికి ఎవరూ కనిపించరు. మిస్సమ్మ సంతోషంగా అమర్ సంతోషాన్ని గురించి చెప్తుంది. తర్వాత మిస్సమ్మ ఆరుకు వాయనం ఇస్తుంది. వాయనం తీసుకున్న ఆరు మిస్సమ్మను దీవిస్తుంది. ఇదంతా పై నుంచి గమనిస్తున్న మనోహరి షాక్ అవుతుంది. తర్వాత ఘోర దగ్గరకు వెళ్లి విషయం చెప్తుంది మనోహరి.
Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: శంకర్, గౌరిల మధ్య చిచ్చు పెట్టిన ఇంటి ఓనరు – ఓనరు ను చితక్కొట్టిన అకి
మనోహరి: అసలు చచ్చిన దాని స్వర్శ వీళ్లకు తెలియడం ఏంటి? ఒక ఆత్మ వచ్చి పూజలో కూర్చోవడం ఏంటి? అమర్‌తో కలిసి వ్రతం చేయడం ఏంటి? ఈ చెల్లెలేమో అక్కకి వాయనం ఇవ్వడం ఏంటి?
ఘోర: ఆత్మ విషయంలో నువ్వేం చెప్పినా.. నేనేం విన్నా ఆశ్చర్యపోను మనోహరి.
మనోహరి: ఏందుకు ఘోర
అని అడగ్గానే ప్రతి పౌర్ణమికి ఆ ఆత్మకు శక్తి వస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయనుకున్నావు. ఆ ఆత్మకు దైవశక్తి తోడు అయ్యింది. మనం ఎదురువెళ్తుంది ఆత్మకే కాదు. పరమాత్రకు కూడా ఎదరే వెళ్తున్నాము. ఇవాళ సాక్ష్యాత్తు ఆ వరలక్ష్మీ దేవే దిగివచ్చి ఆ ఆత్మకు శక్తి ఇచ్చింది. అని ఘోర చెప్పగానే మనోహరి షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.