అన్వేషించండి

Happy Raksha Bandhan: సిస్టర్ సెటిమెంట్ తో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే, రాఖీ రోజు ఫ్యామిలీతో చూసేయండి!

సిస్టర్ సెంటిమెంట్ తో తెలుగులో చాలా సినిమాలు తెరకెక్కాయి. కష్టాల్లో ఉన్న చెల్లికి అండగా నిలిచే ఈ ఫ్యామిలీ చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వాటిలో కొన్ని సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Best Brother Sister Sentiment Movies of Tollywood: తోబుట్టువులలో అన్నా చెల్లెలి అనుబంధానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చీటికీ మాటికీ కొట్లాడుకున్నా, కాసేపట్లోనే కలిసిపోతారు. చెల్లికి బాధ కలిగితే అన్న తట్టుకోలేదు. అన్న కన్నీళ్లు పెడితే చెల్లి విలవిలాడుతుంది. అన్నా చెల్లెలి మధ్య అనురాగాన్ని బేస్ చేసుకుని తెలుగులో బోలెడు సినిమాలు వచ్చాయి. మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. రాఖీ పండుగ సందర్భంగా సిస్టర్ సెంటిమెంట్స్ తో తెరకెక్కిన కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.అన్నవరం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నాగా, తమిళ నటి సంధ్య చెల్లిగా నటించిన చిత్రం ‘అన్నవరం‘. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్నవరం తన సోదరి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. స్థానిక దాదా నుంచి అన్నవరం చెల్లి కుటుంబానికి సమస్యలు వస్తాయి. ఆ సమస్యల నుంచి వారికి ఎలా ఉపశమనం కలిగించాడనేది ఈ సినిమాలో చూపించారు. అన్నాచెల్లెలి సెంటిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.   

2.రాఖీ

ఇబ్బందుల్లో ఉన్న ఆడపడుచులకు అండగా నిలిచే అన్నయ్య రాఖీగా జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో అమ్మాయిలను బాధపెట్టే వారి అంతు చూసే అన్నయ్యగా అలరించాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు మహిళా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. తన చెల్లిని చంపిన అత్తింటి వారిని, వారికి వత్తాసు పలికిన అధికారులను పెట్రోల్ పోసి తగలబెడతాడు. ఆ తర్వాత ఏ మహిళకు అన్యాయం జరిగినా అన్నలా అండగా నిలుస్తాడు.   

3.గోరింటాకు

ఈ చిత్రంలో రాజశేఖర్ చెల్లిగా మీరా జాస్మిన్ నటించింది. చిన్నతనంలోనే పేరెంట్స్ చనిపోవడంతో అన్నీ తానైన చెల్లిని పెంచి పెద్ద చేస్తాడు. చెల్లికి పెళ్లి అయ్యే వరకు తాను కూడా చేసుకోను అంటాడు. చెల్లెలికి ప్రేమ వివాహం చేస్తాడు. ఆస్తి కోసం అయిన వాళ్లు చెల్లి భర్తను జైలుకు పంపిస్తారు. సాయం కోసం అన్నయ్య ఇంటికి వచ్చిన చెల్లిని రాజశేఖర్ భార్య ఆర్తి అగర్వాల్ అవమానించి పంపుతుంది. ఏం చేయాలో తెలియని మీరా జాస్మిన్ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటుంది. చెల్లి డెడ్ బాడీ దగ్గర రాజశేఖర్ ఏడ్వడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది.    

4.పుట్టింటికి రా చెల్లి

యాక్షన్ హీరో అర్జున్ చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కిన చిత్రం ‘పుట్టింటికి రా చెల్లి’. ఈ చిత్రంలో అర్జున్ చెల్లిగా  మధుమిత అద్భుతంగా నటించింది. అన్నాచెల్లెలి మధ్య ఉండే సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. అర్జున్, మీనా హీరో, హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ తెరకెక్కించారు. అత్తారింటి వాళ్లు మధుమిత మీద వేసిన నిందను తొలగించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోతుంది. చివరకు ఆమెకు చనిపోయిన తర్వాత ఆమె మీద పడ్డ నింద నిజం కాదని తేలుతుంది. అప్పటికే చనిపోవడంతో ప్రేక్షకులు అందరూ కంటతడి పెడతారు. 

5.హిట్లర్

చిరంజీవి, రంభ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారు. తెలుగు సినిమా పరిశ్రమలో అన్నా చెల్లెళ్ల కథల్లో ఈ మూవీ బెస్ట్ మూవీ. ఇందులో ఐదుగురు అమ్మాయిలకు అన్నయ్యగా నటించారు. చెల్లెల్లు మంచి ఇళ్లకు కోడళ్లుగా వెళ్లాలని కష్టపడే అన్నయ్య పాత్రలో చిరంజీవి ఒదిగిపోయిన నటిస్తారు. చిరంజీవి చెల్లెల్లుగా శారద, అనుపమ, లక్ష్మి, గాయత్రి, సరస్వతి నటించారు.

6.హనుమాన్

రీసెంట్ గా తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమాలోనూ సిస్టర్ సెంటిమెంట్ ఆకట్టకుంది. తేజ సజ్జ అక్కగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. తన తమ్ముడి మీద ప్రేమతో పెళ్లి చేసుకునేందుకు కూడా ఇష్టం పడదు. చివరకు తన తమ్ముడి కోసం ప్రాణాలు కోల్పుతుంది. ఈ సినిమాలలో అక్కా తమ్ముడి సెంటిమెంట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన మరికొన్ని సినిమాలు.

1.శివరామరాజు

2.అర్జున్

3.రక్త సంబంధం

4.బంగారు గాజులు

5.చెల్లెలి కాపురం

6.పల్నాటి పౌరుషం

Read Also: నిర్మాతల చుట్టూ తిరిగిన రిషబ్... ఎయిర్ పోర్టులోనూ రిక్వెస్టులు... 'కాంతార' తెర వెనుక కహాని!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Embed widget