అన్వేషించండి

Chandrababu Skill Case: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?

Andhra Pradesh: చంద్రబాబు స్కిల్ కేసు ఫేక్ అని పీవీ రమేష్ డీజీపీకి రాసిన లేఖ కొత్త సంచలనాలకు కారణం కాబోతోంది. కుట్ర చేసి చంద్రబాబును ఇరికించారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Chandrababu Skill Case new sensation: ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అంటే దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. చంద్రబాబుకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే అరెస్టు చేసిన కేసు అది. ఆ తర్వాత ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదన్న విషయం బయటపడింది. ఇప్పుడు ఆ స్కిల్ కేసు మొత్తం ఫేక్ అని.. నాటి ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ డీజీపీకి లేఖ రాశారు. తన వాంగ్మూలం ఆధారంగానే అరెస్టు చేసినట్లుగా కోర్టుకు చెప్పారు.కానీ తన వాంగ్మూలం అంతా ఫేక్ అని... దీనిపై విచారణ చేయాలని ఆయన లేఖ రాశారు. మరో వైపు పీవీ రమేష్ రాసిన లేఖ విషయాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి అసెంబ్లీలో చర్చించారు. స్కిల్ కేసులో ఉన్న మొత్తం కుట్రను బయటకుతీయాలని ఆయన డిమాండ్ చేశారు. 

చంద్రబాబు అరెస్టు కోసం చేసిన కుట్ర స్కిల్ కేసు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడానికి ప్రధాన కారణంగా చంద్రబాబు హయాంలో ఐఏఎస్‌గా పని చేసిన పీవీ రమేష్ వాంగ్మూలం కీలకం. డబ్బులు రిలీజ్ చేయాలని చంద్రబాబు ఒత్తిడి చేశారని నిబంధనలను అతిక్రమించమని ఆయన చెప్పారని పీవీ రమేష్ చెప్పినట్లుగా సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే పీవీ రమేష్ తాను అలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని..అంతా స్వయంగా జరిగిందని చెప్పానని తాజాగా డీజీపీకి లేఖ రాశారు. ఆ కేసలో సీఐడీ అధికారులకు తానిచ్చిన స్టేట్ మెంట్ కాపీ తన వద్ద ఉందన్నారు. ఈ కేసు విషయంలో ఏం జరిగిందో సమగ్ర విచారణ చేయాలని పీవీ రమేష్ లేఖలో కోరారు. 

Also Read: మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల డబుల్ గేమ్ - టీడీపీతో సఖ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నారా ?

ఆడిటింగ్ సంస్థ సహా అనేక విషయాల్లో సమాచారం దాచినట్లు ఆరోపణలు

స్కిల్ కేసులో అసలు ఏం జరిగిందో చెప్పడం కన్నా.. తప్పుడు ప్రచారం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. స్కిల్ సెంటర్లు రాష్ట్రవ్యాప్తంగా పెట్టారు. కానీ ఈ అంశంపై ఆడిటింగ్ చేసిన సంస్థ సీమన్స్ కంపెనీ అన్నీ ఒప్పందం ప్రకారం సరఫరా చేసిందని.. కొన్ని వేల మంది విద్యార్థులు ట్రైనింగ్ తీసుకున్నారని  చెప్పలేదు. అది ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆడిటింగ్ చేసిన సంస్థ కుట్ర చేసిందని డిజైన్ టెక్ సంస్థ ఐసీఏఐలో ఫిర్యాదులో చేసింది.అలాగే ఇందులో ఒక్క రూపాయి కూడా చంద్రబాబుకు లేదా టీడీపీకి చేరాని కోర్టుకు చెప్పలేకపోయారు. టీడీపీ సభ్యత్వ రుసుము లెక్కలు కూడా చూశారు.చివరికి ఎలక్టోరల్ బాండ్ల లెక్కలుకూడా బయటకు వచ్చాయి. ఈ స్కిల్ కేసులో ఉన్న కంపెనీలేవీ టీడీపీకి విరాళాలివ్వలేదు. 

Also Read: TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

కనీసం నోటీసులు కూడాఇవ్వకుండా అరెస్టు చేయడం వెనుక ఏం జరిగింది ?

మాజీ ముఖ్యమంత్రి స్కాం చేస్తే కనీసం నోటీసులు ఇచ్చి విచారణ చేసి..ఆధారాలు ఉంటే అరెస్టు చేస్తారు.కానీ కనీసం ఎఫ్ఐఆర్‌లో పేరు కూడా లేకుండా ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఆ పని చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించాల్సిన వ్యవస్థలు కూడా అచేతనమయ్యాయి. ఈ కారణంగా యాభై రోజులకుపైగా చంద్రబాబు జైల్లో ఉండాల్సి వచ్చింది.ఇప్పుడీ కేసులో ఎవరి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ చెబుతోందో..ఆయన వాంగ్మూలం ట్యాంపర్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలోనూ సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు. త్వరలో డీజీపీ ఈ అంశంపై విచారణ జరిపితే.. చాలా మంది ఐపీఎస్‌లు.. నాటి రాజకీయ నేతలతో చేసిన కుట్రలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget