Allu Arha - Allu Arjun: మనుచరిత్రలో పద్యం చెప్పిన అల్లు అర్హ ..ఆ పద్యానికి భావం, సందర్భం ఏంటో తెలుసా!
Atajani Kaanche: ఎన్నడూ ఊరైనా దాటని వ్యక్తి మొదటిసారి హిమాలయాల్లో అడుగుపెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ క్షణం కలిగిన భావమే అల్లసాని పెద్దన రాసిన ఈ పద్యం..అన్ స్టాపబుల్ షో లో అల్లు అర్హ చెప్పింది..
Allu Arha - Allu Arjun: నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. సెలబ్రెటీలు సందడి చేసే ఈ షోలో లేటెస్ట్ గా అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేశాడు. రీసెంట్ ఎపిసోడ్ లో బన్నీ తల్లి నిర్మల కూడా పాల్గొని..పుత్రోత్సాహంతో పొంగిపోయారు.. అల్లు అర్జున్ గురించి చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు బన్నీ ఎపిసోడ్ పార్ట్ 2 లో అల్లు వారి చిన్నారులు సందడి చేశారు. అల్లు అయాన్, అర్హ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తూనే బాలకృష్ణ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా అర్హని ఉద్దేశించి బాలకృష్ణ నీకు తెలుగు మాట్లాడడం వచ్చా అని అడిగారు.. వచ్చానా..అని బన్నీ ఆశ్చర్యపోయేలోగానే తెలుగులో పద్యం అందుకుంది అర్హ...
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
ఈ పద్యాన్ని అందరూ చదువుకునే ఉంటారు. పదో తరగతి పాఠ్యపుస్తకంలోది. అర్థం తెలిసినా, తెలియకపోయినా కానీ చదువుతుంటే మాత్రం అద్భుతంగా ఉందనిపిస్తుంది. ఇది మనుచరిత్రలో పద్యం...
View this post on Instagram
Also Read: కడప దర్గాకి రామ్ చరణ్ - అయ్యప్ప మాలధారులు మసీదు, దర్గాలకు వెళ్లొచ్చా!
వాస్తవానికి మనుచరిత్ర.. మనుచరిత్ర కాదు.. మను సంభవ చరిత్ర, "స్వారోచిష మను సంభవం". మనువుల్లో ఒకడైన స్వారోచిషుడి వృత్తాంతం. సాధారణంగా మనుచరిత్ర అనగానే వరూధిని ప్రవరాఖ్యులు గుర్తొస్తారు.. ఇంతకీ వీళ్లకి ఆ స్వారోచిష మనువుకి ఉన్న సంబంధం ఏంటి? ఆ మనువు నానమ్మ, తాతయ్యలే వరూదిని ప్రవరాఖ్యులు..అల్లసాని పెద్దన అక్కడి నుంచే ప్రారంభించారు.
ప్రవరుడి కథ వింటుంటే చిన్నారులకు సూపర్ మ్యాన్ గుర్తొస్తాడు. మనువుకి తాతగారైన ప్రవరాఖ్యుడి బాల్యానికి వెళితే.. ప్రవరుడు నివశించే ఊరు పేరు అరుణాస్పదపురం. చిన్నప్పటి నుంచీ ఊరు దాటి ఎక్కడకీ అడుగుపెట్టలేదు. అలాంటి ప్రవరుడి ఇంటికి ఓరోజు ఓ సిద్ధుడు వచ్చాడు. నేను భూమంతా చుట్టేశాను, అవి చూశాను, ఇవి చూశాను అంటూ చాలా విషయాలు చెప్పేస్తుంటాడు. అవన్నీ విన్న ప్రవరుడికి కూడా ఎలాగైనా ఎక్కడికైనా వెళ్లాలనే ఆశ పుడుతుంది. ఎట్టకేలకు తన మనసులో కోరిక సిద్ధుడికి చెప్పి..తన నుంచి పాదలేపనం పొందుతాడు. ఆ పాదలేపనం రాసుకుని మనసులో ఏ ప్రదేశం తలుచుకుంటే అక్కడికి వెళ్లిపోవచ్చన్నమాట. అలా హిమాలయాల్లో అడుగుపెడతాడు ప్రవరాఖ్యుడు. పుట్టినప్పటి నుంచి ఊరు కూడా దాటని ప్రవరుడు..ఒక్కసారిగా హిమాలయాలు చూసేసరికి తనకి కలిగిన భావనే ఈ పద్యం...
శిరస్-సరజ్-ఝరీ - పైనుంచి కిందకి దూకే సెలయేళ్ళు
ముహుర్-ముహుర్-లుఠత్ - ఆ సెలయేటి నీళ్ళు రాళ్ళకి తాకే సవ్వడి
అభంగ తరంగ మృదంగ - అవి చేసే మృదంగ నాదం
Also Read: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం మరింత వేగంగా!
పదాలకు ఉండే శబ్దాలను వాటి అర్థాల ద్వారా ప్రతిధ్వనించేలా చేశారు అల్లసాని పెద్దన. మొత్తంగా భావం చెప్పుకుంటే.. మంచుకొండ కొమ్ములు ఆకాశాన్ని తాకుతున్నాయి..వాటి నుంచి సెలయేళ్లు జాలువారుతున్నాయి లేచిపడే అలల సవ్వడి మృదంగనాదంలా ఉంది..ఆ నాదానికి పరవశించిన నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి
ఓ విషయాన్ని చెప్పడంతో పాటూ కళ్లకు కట్టినట్టు చూపించడమే కదా కవి హృదయం..అలాగే... ఈ పద్యంలో అర్థం కన్నా ఆ పదాలు, వాటి పొందిక, పాడుతుంటే మనసులో కలిగే సంతోషం ఇవన్నీ మంత్రముగ్ధులను చేస్తాయి. మనుచరిత్రలో ఇలాంటి పద్యాలెన్నో..
ఈ పద్యం అల్లు అర్హ నోట విన్న బాలకృష్ణ..తెలుగు పదికాలాల పాటూ బతికి ఉంటుందనే నమ్మకం కలిగిందన్నారు. నిజమే ఈ రోజుల్లో పోటా పోటీగా ఇంగ్లీష్ చదువులు చదవడమే కాదు.. స్కూల్లో, ఇంట్లో కూడా ఇంగ్లీష్ తప్ప మరో భాష మాట్లాడడం లేదు పిల్లలు.. ఇలాంటి జనరేషన్లో పుట్టిన అర్హ.. మను చరిత్రలో పద్యం స్పష్టంగా చెప్పిందంటే అభినందనీయమే...