Krishna Mukunda Murari Serial Today January 2nd Episode - ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్: ఆర్టిస్ట్ శ్రీధర్‌ని చంపేసిన దేవ్, ముకుంద హస్తం ఉందని కృష్ణ అనుమానం
Krishna Mukunda Murari January 2nd Episode - ఆర్టిస్ట్ శ్రీధర్‌ని దేవ్ చంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari Serial Today Episode
మురారి: పెద్దమ్మ దీని వెనక పెద్ద కుట్రే ఉంది. మనకు బాగా దగ్గరి వాళ్లు ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
దేవ్: అంతే బావ మన ఫ్యామిలీకి చెందిన వాళ్లే అయుంటారు.
భవాని: వద్దు ఇంక ఇదంతా అనవసరమైన శ్రమ. అబద్దాన్ని ఎంత తవ్వాలి అని ప్రయత్నించినా అబద్ధమే బయట పడుతుంది కానీ నిజం కాదు కదా.. ఇప్పుడు జరుగుతుంది కూడా ఇదే..
కృష్ణ: పెద్దమ్మ నా మాట విని.. రేపే ఆ ఆర్టిస్ట్‌ని పట్టుకొని ఏసీపీ సార్ నాలుగు తగిలించి మరీ నిజం చెప్పిస్తారు. అదీ మీ సమక్షంలోనే..
మురారి: అవును పెద్దమ్మ లేకపోతే ఒక పని చేయండి.. మీకు నమ్మకం లేకపోతే.. మీకు తెలిసిన మరో పోలీస్‌తో వాడిని ఇంటరాగేట్ చేయించండి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
కృష్ణ: చచ్చిపోయిన మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా రేపే వాడిని ఇంటరాగేట్ చేయిస్తా.. నేను చచ్చి శవం అయి పడున్నా సరే.. ఏసీపీ సార్ నా శవాన్ని దాటుకుంటూ వెళ్లి ఆ పని చేయిస్తారు.
భవాని: ఇలా ఛాలెంజ్‌లు చేయడం ఈ మధ్య మీ ఇద్దరికీ బాగా అలవాటు అయిపోయింది.
కృష్ణ: ఏసీపీ సార్ ఎట్టిపరిస్థితుల్లోనూ వాడిని వదిలిపెట్టొద్దు.
ఇక ఉదయం కృష్ణ మురారి దగ్గరకు కాఫీ తీసుకొని వచ్చి.. మురారిని ఆటపట్టించాలి అని ముకుందలా మాట్లాడుతుంది. దీంతో మురారి తననే టెస్ట్ చేస్తావా అని అడుగుతాడు. ఇక ఇద్దరూ రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ చెప్పుకుంటారు. ఇక రేవతి భవానికి కాఫీ ఇస్తుంది. అక్కడే ఉన్న నందూ, మధు, శకుంతలకు కాఫీ కావాలా అని అడుగుతుంది. నువ్వేమైనా పనిమనిషివా అందరికి కాఫీ కావాలా అని అడుగుతున్నావని నందూ కోపమవుతుంది. ఇక అప్పుడే ముకుంద అక్కడికి వస్తుంది. ముకుందకు దేవ్ గురించి భవాని అడుగుతుంది. మరోవైపు మురారి, కృష్ణ కలిసి కిందకి వస్తారు. మరోవైపు దేవ్ తలకు కట్టుతో ఇంటికి వస్తాడు. అందరూ షాక్ అయి ఏమైందని అడుగుతారు.
దేవ్: నేను శ్రీధర్‌ని తీసుకురావడానికి వెళ్లాను. అక్కడికి వెళ్లే సరికి శ్రీధర్‌ని చంపేశారు. నేను అక్కడికి వెళ్లేసరికి శ్రీధర్‌ని నలుగురు కొడుతున్నారు. నేను వెళ్లి అడ్డుకునే సరికి ఒక రాడ్‌తో నా తలమీద కొట్టారు. రక్కపు మడుగులో శ్రీధర్ ఉన్నాడు. అంతే నేను హాస్పిటల్‌కి వెళ్లి ఇప్పుడు వస్తున్నా..
కృష్ణ: రాత్రి తన ఇంటి దగ్గర.. దేవ్ అన్నయ్యని కొట్టి శ్రీధర్‌ని చంపారు అంటే వాళ్లు ఎవరై ఉంటారు. దేవ్ అన్నయ్య నిన్న కాక మొన్న మా ఇంటికి వచ్చాడు. మా ఇంటి మనిషి లా చూస్తే. అంటే.. మా ఇంట్లో వాళ్లు ఎవరైనా అలా చేస్తున్నారా.. ఒక వేళ ఎవరైనా అలా చేస్తారు అంటే అది ఒక్క ముకుందే. ముకుంద నిజంగా అంత పని చేస్తుందా. దీని వెనుక ముకుంద హస్తం ఉంది అనిపిస్తుంది. రాజనర్శ్ ముకుందకు తెలుసు.
ఒకవేళ అప్పుడు ఫాం హౌస్‌కి వెళ్లినప్పుడు ఆయన ఫ్యామిలీతో పరిచయం చేసుకొని ఉండొచ్చు కదా. అవును దీని వెనక ముకుంద హస్తం ఉందనిపిస్తుంది. కానీ చెప్తే ఎవరు నమ్ముతారు. ఏసీపీ సార్‌తో చెప్తే ముకుందను అడగకుండా ఉండరు. దేవ్ అన్నయ్యకి చెప్తే నా చెల్లి అంత దుర్మార్గురాలా అని అడుగుతారు. నిజం తెలిసే వరకు నేను ముకుంద మీద ఓ కన్ను వేసి ఉంటాను.
దేవ్: బావ పెళ్లి రోజు దగ్గర పడుతుంది నీకు ఎలా ఉందో నాకు తెలీదు కానీ నాకు చాలా టెన్షన్‌గా ఉంది.
మురారి: బాధ పడకు బావ.. ఆ శ్రీధర్‌ని చంపి తన గొయ్యని తానే తవ్వుకున్నాడు.
దేవ్: మనసులో.. మురారి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి నేను వాడిని చంపి తప్పు చేశానా.. అదేంటి బావ మనకేసుకు మీ జీవితానికి ఉన్న ఏకైక ఆధారం ఆ ఆర్టిస్ట్. వాడు చనిపోతే తన గొయ్యి తనే తవ్వుకోవడం ఎలా అవుతుంది.
మురారి: అవుతుంది దేవ్.. మర్డర్ చేసిన వాడిని పట్టుకోవడం అన్నింటి కన్నా మాకు సులవైన పని.. ఎంతో కచ్చితంగా ఎవరికీ అనుమానం రాకుండా చేశామని అనుకుంటారు. కానీ ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. మర్డర్ చేసిన వాడి వెనక ఎవరు ఉన్నారని ఈజీగా తెలిసిపోతుంది. పైగా శ్రధర్‌ని పబ్లిక్ ప్లేస్‌లో చంపారు. అది ఇంకా ఈజీ అయింది.
నందూ: ఆ శ్రీధర్‌ని చంపింది ఎవరో కనుక్కోవచ్చుకదా మధు.
భవాని: ఇంకా అర్థం కాలేదా నందూ.. చూశావా ముకుంద ఒక వేళ పెద్దపల్లి ప్రభాకర్ ఇది చేయకపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించాం. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా నీకు.
మురారి: వాళ్ల చిన్నాన్నే చేశారు అని అప్పుడే కన్ఫ్మమ్ చేసేశారా పెద్దమ్మ.
భవాని: ప్రసాద్ నీకేమనిపిస్తుంది. పర్లేదు చెప్పు.
ప్రసాద్: మీరన్నది నిజమే అనిపిస్తుంది.
భవాని: చూశావు కదా మురారి ఇక్కడ అందరూ ఏం అనుకుంటున్నారో.. మీ అమ్మ కూడా బయటకు చెప్పలేకపోతుంది కానీ మనసులో అదే ఉంటుంది. కానీ మీరంతా ప్రాణాలు తీసిన వాళ్లతోనే కలిసి ఉంటాను అంటే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ఇంకొకసారి నా జోలికి రావద్దు, ఇదే రిపీట్ అయితే మాత్రం.. - బూతులతో అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్