అన్వేషించండి

Krishna mukunda Murari Serial Today May 22nd: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్‌ : మీరా అబార్షన్ చేయించుకోలేదన్న నిజం తెలుసుకున్న కృష్ణ – మీరాకు వార్నింగ్ ఇచ్చిన కృష్ణ

Krishna mukunda Murari Today Episode: మీరా అబార్షన్ చేయించుకోలేదని కృష్ణకు తెలియడంతో షాక్ అవుతుంది. తనతోనే ఆ నిజం చెప్పించాలని కృష్ణ అనుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Krishna mukunda Murari  Serial Today Episode : మీరా కూడా ముకుంద లాగే ప్రవర్తిస్తుందని అనుమానిస్తుంది కృష్ణ. దీంతో మీరా గదిలోకి వెళ్లి చెక్‌ చేస్తుంది. ఎంత వెతికినా ఏం కనిపించదు. మీరాను ఇలాగే వదిలేస్తే ఏం జరుగుతుందోనని భయంగా ఉందని అనుకుంటుంది. మీరా గదిలో ఉన్న డస్ట్ బిన్ చూస్తే అందులో కొన్ని వాడిన ట్యాబ్లెట్స్, పేపర్ కనిపిస్తుంది. ప్రిస్కిప్షన్ చూసి కృష్ణ షాక్‌ అవుతుంది. బేబీ గ్రోత్ కోసం ట్యాబ్లెట్ వేసుకుంటుంది అంటే మీరా అబార్షన్‌ చేయించుకోలేదు. ఎందుకు ఇలా చేస్తుంది. బిడ్డ ఉన్నందుకు సంతోషించాలా.. అబద్ధం చెప్పినందుకు బాధపడాలా.. అనుకుంటుంది. వాటిని తీసుకుని తన గదికి వచ్చి మనం మోసపోయామని మురారికి చెప్తుంది.

కృష్ణ: మీరా గర్భం తీయించుకోలేదు మనతో అబద్ధం చెప్పింది. మీరా కడుపులో మన బిడ్డ క్షేమంగా ఉంది. మన బాధ చూడలేక సరోగసికి ఒప్పుకున్నట్టు చెప్పింది. మన బిడ్డని కడుపులోకి వేసుకున్నాక గర్భం తీయించుకున్నానని అబద్ధం చెప్తుంది.

మురారి: మన బిడ్డని అడ్డం పెట్టుకుని ఎందుకు ఇలా చేస్తుంది. ఇలాంటి ఆడదాని కడుపులో మన బిడ్డ పెరుగుతుంది. తన నుంచి మన బిడ్డని ఎలా కాపాడుకోవాలి.

మీరా గర్భం ఉంచుకుందని తన నోటితో తనే చెప్పేలా చేయాలని కృష్ణ డిసైడ్ అవుతుంది. తర్వాత పెళ్లి ఎక్కడ చేయాలా అనే దాని గురించి భవానీ ఆలోచిస్తూ ఉంటే కృష్ణ డల్ గా కిందకు రావడం చూసి పిలుస్తుంది. పెళ్లి ఎక్కడ చేద్దామని కృష్ణని అడుగుతుంది. వాళ్ళు ఎంతో ఇష్టపడి చేసుకుంటున్నారని వాళ్ళనే అడగండి అని మీరాని పిలుస్తుంది. పెళ్లి ఎక్కడ చేసుకోవాలనే ఫాంటసీ ఏమైనా ఉందా చెప్పు అని కృష్ణ అడుగుతుంది.

మీరా: పెళ్లిది ఏముంది ఎక్కడ చేసుకుంటున్నామని కాదు ఎవరిని చేసుకుంటామనేది ముఖ్యం.

కృష్ణ: ఆదర్శ్‌, ముకుంద కంటే మీరాని ఎక్కువ ఇష్టపడుతున్నాడు. ఈ పెళ్లి వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోవాలి.

మీరా: అయితే పెళ్లి ఎక్కడ చేయాలో మీరే డిసైడ్ చేస్తే బాగుంటుంది.

అని మీరా వెళ్లిపోతుంది. మీరాని ఎందుకు రెచ్చగొడుతున్నావని మురారి, కృష్ణని అడుగుతాడు. తిక్కలేస్తే నీకు గర్భం లేదని చెప్పేస్తుందేమోనని అంటాడు. తను చెప్పదు నిజం బయట పెట్టి మనల్ని బుక్ చేయాలని అనుకుంటే ఎప్పుడో చెప్పేది. వేరే ప్లాన్ ఏదో ఉంది అందుకే ఇలా నాటకం ఆడుతుందని చెప్తుంది కృష్ణ. తర్వాత పెళ్ళికి ఎవరెవరిని పిలవాలో లిస్ట్ రాయమని భవానీ ముకుందకు చెప్తుంది. అప్పుడే కృష్ణ, మురారి వస్తారు. మీరా యాక్టింగ్ చూసి ఇది సామాన్యురాలు కాదని ఎంత త్వరగా తేల్చుకుంటే అంత మంచిదని అనుకుంటారు.

కృష్ణ: నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను నువ్వు నాతో పాటు వస్తావా? మీరా ఇంటికి వచ్చేటప్పుడు చిన్న షాపింగ్‌ ఉంది ఇద్దరం కలిసి చేద్దాం.

మీరా: సరే వస్తాను..  నేను రెడీ అవుతాను వెయిట్‌ చేస్తావా?

ఆదర్శ: ఎక్కడికి రెడీ అవుతానంటున్నావు. మనం షాపింగ్‌కు వెళ్దాం అనుకున్నాం కదా?

అని ఆదర్శ్‌ అనగానే నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావ్ అంటే పెళ్లి అయితే ముకుంద కొంగు వదిలేలా లేవని నందిని వాళ్ళు ఆదర్శ్‌ ను ఆటపట్టిస్తారు. తర్వాత మీరాను కృష్ణ రెస్టారెంట్‌కు తీసుకుపోతుంది.

మీరా: ఏమైంది ఇక్కడకి తీసుకొచ్చావు. నువ్వు ఏదో మాట్లాడటానికే ఇక్కడికి రమ్మన్నావ్ కానీ షాపింగ్ అని అబద్ధం చెప్పావ్ కదా

కృష్ణ: నాకోసం ఆలోచించి గర్భం తీయించుకున్నావ్‌ కదా?

మీరా: అవును మీ బిడ్డని మీకు ఇవ్వలేకపోయినందుకు చాలా బాధగా ఉంది.

కృష్ణ: మరీ అంత బాధపడకు. ఎందుకంటే మా బిడ్డ ఎక్కడికీ పోలేదు.

అని కృష్ణ చెప్పేసరికి ముకుంద షాక్ అవుతుంది. నేను గర్భం తీయించుకోలేదని తెలిసిపోయిందా? అని టెన్షన్ పడుతుంది ముకుంద. ఇంతలో  మేం మళ్ళీ సరోగసికి వెళ్దామని డిసైడ్ అయ్యామని కృష్ణ చెప్తుంది. వీళ్ళు ఇంకెవరితోనో బిడ్డని కంటే నా ఆటలు ఎలా సాగుతాయని మనసులో అనుకుంటుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావని కృష్ణ అడుగుతుంది. ఏం లేదని మీరా అనగానే కృష్ణ లాగిపెట్టి చెంప పగలగొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ డీల్ క్లోజ్... వామ్మో, అజిత్ సినిమాకు రికార్డ్ రేటు వచ్చిందిగా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
MLA Mal Reddy: కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి
కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి
Worldbank funds to Amaravati: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల  3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల 3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
Telangana Latest News: తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs SRH Match Preview IPL 2025  ఈడెన్ లో దుల్లగొట్టేసి ఫామ్ లోకి వచ్చేయాలని సన్ రైజర్స్Virat Kohli Sympathy Drama IPL 2025 | కొహ్లీ కావాలనే సింపతీ డ్రామాలు ఆడాడాSiraj Bowling vs RCB IPL 2025 | మియా మావ బౌలింగ్ కి..వణికిపోయిన ఆర్సీబీRCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
MLA Mal Reddy: కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి
కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ మంటలు - రాజీనామా ఆఫర్ చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి
Worldbank funds to Amaravati: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల  3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల 3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
Telangana Latest News: తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
Supreme Court judges Assets: ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
WhatsApp Blue Ticks: వాట్సాప్‌లో 'బ్లూ టిక్స్‌' ఎలా ఆఫ్ చేయాలి? మూడంటే మూడే సింపుల్‌ స్టెప్స్‌
వాట్సాప్‌లో 'బ్లూ టిక్స్‌' ఎలా ఆఫ్ చేయాలి? మూడంటే మూడే సింపుల్‌ స్టెప్స్‌
Prakash Raj: పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
MAD Square: 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ - బావమరిది కోసం
'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ - బావమరిది కోసం
Embed widget