Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ డీల్ క్లోజ్... వామ్మో, అజిత్ సినిమాకు రికార్డ్ రేటు వచ్చిందిగా!
Good Bad Ugly OTT Rights: అజిత్ కుమార్ హీరోగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఓటీటీ రైట్స్ రికార్డు రేటుకు అమ్మేశారట.

Ajith's New Movie Good Bad Ugly OTT Deal Details: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. రీసెంట్‌గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. లేటెస్ట్ బజ్ ఏమిటంటే... ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఆల్రెడీ అమ్మేశారట. రికార్డు రేటు వచ్చిందని తెలుస్తోంది. ఆ డీల్ డీటెయిల్స్ ఏమిటో చూద్దామా?
'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఓటీటీ రైట్స్ @ 95 కోట్లు!?
Good Bad Ugly OTT Price and Digital Streaming Partner: 'గుడ్ బ్యాడ్ అగ్లీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకుందని టాక్. రూ. 95 కోట్లకు ఈ డీల్ క్లోజ్ అయ్యిందని కోలీవుడ్ టాక్. అజిత్ సినిమాల్లో హయ్యస్ట్ అని కొందరు అంటున్నారు. దీంతో బడ్జెట్ లో మూడో వంతు రికవరీ అయ్యిందని టాక్. శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ లెక్క వేసుకుంటే నిర్మాతలు లాభాల్లోకి వెళ్లినట్టే.
తెలుగు, తమిళ భాషల్లో సంక్రాంతికి విడుదల'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
#GoodBadUgly takes the internet by storm ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) May 21, 2024
41 MILLION+ VIEWS for the first look poster on 𝕏 💥💥
In Cinemas Pongal 2025 🔥
Shooting in Progress!
#AjithKumar @MythriOfficial @Adhikravi @ThisIsDSP @AbinandhanR @editorvijay @GoodBadUglyoffl… pic.twitter.com/zus0f2e1a5
ఇటీవల హైదరాబాద్ సిటీలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. జెట్ స్పీడులో షూటింగ్ చేస్తున్నారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'... ఈ టైటిల్‌కు తగ్గట్టు మూడు డిఫరెంట్ వేరియేషన్లలో అజిత్ (Ajith First Look Good Bad Ugly)ను చూపించారు దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్. ఇప్పటి వరకు చూసిన అజిత్ కంటే ఆ లుక్కులో అజిత్ వేరుగా ఉన్నారు. చేతి నిండా టాటూలు, కళ్లకు షేడ్స్ ధరించి కొత్తగా ఉన్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు
అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకు కూర్పు: విజయ్ వేలుకుట్టి, ప్రొడక్షన్ డిజైనర్: జి ఎం శేఖర్, పోరాటాలు: సుప్రీం సుందర్ - కలోయన్ వోడెనిచరోవ్, స్టైలిస్ట్: అను వర్ధన్ - రాజేష్ కమర్సు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దినేష్ నరసింహన్, సీఈవో: చెర్రీ, ఛాయాగ్రహణం: అభినందన్ రామానుజం, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని - వై రవిశంకర్, రచన & దర్శకత్వం: అధిక్ రవిచంద్రన్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

