Krishna Mukunda Murari December 5th Episode - కృష్ణ ముకుంద మురారి సీరియల్: ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు వేణిగారు - ముకుంద కోసమే ఇదంతా!
Krishna Mukunda Murari Serial Episode : ముకుందతో పెళ్లి తనకు ఇష్టం లేదని మురారి కృష్ణతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Krishna Mukunda Murari Today Episode
భవాని: రేవతి మనం రేపటి నుంచి పెళ్లి పనులు ప్రారంభించాలి. మధు మంచి వీడియో గ్రాఫర్‌ని మాట్లాడు. ముకుంద రేపు గాని ఎల్లుండి గాని షాపింగ్ ప్లాన్ చెయ్. షాపింగ్ అనగానే రోజులు తరబడి చేయకు మనకి అసలే అంత టైం లేదు. ఏంటీ ఎవరూ మాట్లాడటం లేదు. ఇంట్లో జరిగేది పెళ్లి మరొకటి కాదు.
ముకుంద: ఇష్టం లేక అత్తయ్య ఇంత జరిగినా పాపం చిన్నత్తయ్యకి మనసు అటువైపే వెళ్తున్నట్టుంది.
భవాని: మనసు కదా అటువైపే వెళ్తుంది. ఎటు వెళ్లినా చివరికి అది ఇటు రావాల్సిందే. అందరూ అది గుర్తుపెట్టుకోండి
రేవతి: నాకు ఏం బాధ లేదు అక్కయ్య.. అలా అని సంతోషం కూడా లేదు. ఏంటో మన జీవితాలు ఇలా అయ్యాయి అన్న దిగులు ఒక్కటే
భవాని: ఈ దిగులు అన్నీ రేపటితో ముగిసిపోతాయి రేవతి. ఇంతలో ప్రసాద్, సుమ వాళ్లు వస్తారు. ఇక రేపు పసుపు దంచడం పనులు జరుగుతాయి.
సుమ: అక్క మీకో మాట చెప్తా ఏం అనుకోవద్దు.. ఈ పెళ్లికి మనం హడావుడి పడుతున్నాం కానీ మురారికి ఇష్టం లేదు అనిపిస్తోంది అక్క. ఎందుకంటే మేము వచ్చేసరికి ఆ కృష్ణ, మురారి అవుట్ హౌస్‌లోనే ఉన్నారు.
నందూ: మురారి ఈ పెళ్లి ఇష్టం లేదని చిన్న పిన్నిఅనుమానం మమ్మీ
భవాని: ప్రసాద్ నీకు కూడా ఏవైనా అనుమానాలు ఉన్నాయా.. పర్లేదు చెప్పు.. పెళ్లి అన్నప్పటినుంచి అందరి అనుమానాలు తీర్చడమే నా పని అయిపోతుంది. నీకు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు
ప్రసాద్: నాకు అనుమానం లేదు అక్క కానీ. ఒక భయం ఉంది. అది ఏం లేదు అక్క మన మురారికి ఇప్పుడు గతం గుర్తు రాలేదు. అందుకే మనం ముకుందతో పెళ్లి చేస్తున్నాం. కానీ రేపు పెళ్లి అయిన తర్వాత మురారికి గతం గుర్తొస్తే.. కృష్ణ తన భార్య అని తెలిస్తే అప్పుడు ముకుంద జీవితం ఏంటి. ఇదే వదినా నా డౌట్.
రేవతి: చెప్పాలి అంటే నా భయం కూడా అదే అక్కయ్య
భవాని: ఆపండి.. దయచేసి అందరూ ఆపండి.. ఏమన్నావ్ ప్రసాద్ పెళ్లి తర్వాత కృష్ణనే తన భార్య అని గుర్తొస్తే ఏంటి అని అడుగుతున్నావా.. అసలు దాన్ని పెళ్లి అని ఎవరైనా అంటారా.. సంవత్సరం వరకే మేము భార్యాభర్తలం తర్వాత ఎవరికి వారే అని అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని ఎవరైనా పెళ్లి అంటారా. ఏ మురారికి గతం గుర్తొచ్చినప్పుడు ఇది గుర్తుకురాదా.. వాడికి తెలీదా మనం చెప్పలేమా.. గతం గురించి వాడే కాదు మనందరం కూడా మర్చిపోతే మంచిది. వాళ్లంత క్రైం చేసినా కానీ మీరంతా వాళ్లని ఎందుకు దూరం పెట్టడం లేదో అర్థం కావడం లేదు
ముకుంద: మనం ఆ కృష్ణకి అండగా ఉన్నంత కాలం ఈ భయం తప్పదు అత్తయ్య
భవాని: నోర్మయ్ ముకుంద.. నువ్వు కూడా.. అయినా మురారి అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్. వాడిని నిన్ను అనుక్షణం కనిపెట్టుకొని ఉండమని చెప్పానా..
ముకుంద: చెప్పారు అత్తయ్య కానీ ఏం చేయను. అలా వెళ్లి ఇలా వచ్చిన లోపు మళ్లీ అక్కడికి వెళ్లిపోతున్నాడు. స్కూల్ పిల్లాడికి మురారికి తేడా లేకుండా పోతుంది. చూశారా అత్తయ్య ఇప్పుడు కూడా రేవతి అత్తయ్య కోపంగా చూస్తుంది. దాని అర్థం ఏంటో చెప్పమని చెప్పండి
రేవతి: అర్థం లేకుండా మాట్లాడకు ముకుంద. నాకు ఎందుకు కోపం వచ్చిందో తెలుసా.. నా కొడుకు పరిస్థితిని స్కూల్ పిల్లాడితో పోల్చినందుకు కోపం వచ్చింది
ముకుంద: మురారిని ఆపడం నా ఒక్కదాని వల్ల కావడం లేదు అత్తయ్య. వీళ్లందరూ కట్టడిగా చేస్తేనే మురారిని ఆపగలం. నేను ఒక్కదాన్ని అడ్డుకోవడం వల్ల శత్రువుని అవుతున్నా తప్పా భార్యని కాలేకపోతున్నా.
భవాని: సరే నువ్వు వెళ్లి మురారిని తీసుకురా. చూడండి నేను అందరికీ చెప్తున్నా ఇలాంటి చచ్చు ఐడియాలతో కాలం గడిపే కంటే పెళ్లి ఎలా గ్రాండ్‌గా చేయాలో ఆలోచిస్తే మంచిది. రేవతి రేపటి కార్యక్రమానికి ఏర్పాట్లు చెయ్యు.
మురారి: నేను ఎంత అనుమానిస్తున్నానో.. ఆరా తీస్తున్నానో వేణి గారు కూడా అంతే అనుమానిస్తున్నారు.
కృష్ణ: సార్ ఏంటి ఆలోచిస్తున్నారు
మురారి: నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు వేణి గారు. కానీ నన్ను ప్రేమించిన ముకుందకు నా ఇష్టాన్ని చెప్పలేక.. చెప్తే ముకుంద లైఫ్ నాశనం అవుతుంది అనే ఆలోచనలతో నాకు పిచ్చెక్కిపోతుంది
కృష్ణ: సార్ దయచేసి అలా మాట్లాడకండి. ప్లీజ్
మురారి: ఏం చేయమంటావ్ నన్ను
కృష్ణ: చెప్పొచ్చా సార్.. మీరు చేయాల్సింది అంతా వెయిట్ చేయడమే. మీరు కోరుకున్నది అంతా జరుగుతుంది. నా మీద నమ్మకం ఉంచండి సార్. అయినా ప్రతీ దానికి ఓ పరిష్కారం ఉంటుంది సార్
ముకుంద: మురారి పెద్దమ్మ పిలుస్తున్నారు(ఏంటి ఇంత ఆనందంగా ఉన్నాడు)
మురారి: తనలో తాను.. తింగరి అంటే ఏంటి.. కానీ ఆ మాట నాకు బాగా గుర్తొస్తుంది. వేణి గారు చదువుకునేటప్పుడు నేను అనేవాడినా. చదువుకి స్పాన్సన్ చేస్తే అంత చనువు ఉంటుందా.. మరి ఎందుకు వేణి గారు ఆ మాట అనగానే నాకు ఏదోలా అయింది. అసలు నాకు ఏమైంది.
నందూ: ఏంటి మురారి ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నావ్
మురారి: టైం కొచ్చారు.. తింగరి అంటే ఏంటి. ఏంటి ఏదో డౌట్ అడిగానని విసుక్కొంటున్నారా..
నందూ: మనసులో.. మురారి మీ ఇద్దరేరా మా జీవితాన్ని కాపాడింది. అసలు కృష్ణనే నీ భార్య అని చెప్తేస్తే.. ముందు అమ్మ కృష్ణని ఎక్కడికైనా పంపేస్తుంది. తింగరి అని నిన్ను ఎవరైనా అన్నారా
మురారి: కాదు.. వేణి గారిని అందరూ అలా అనేవాళ్లు అంట. తను ఆ మాట చెప్పగానే నేనే చాలా సార్లు అలా పిలిచినట్లు అనిపించింది. ఎందుకో తెలీదు.
నందూ, గౌతమ్: ఆలోచించు మురారి.. చాలా ఆలోచించు.. ఏమైనా జరిగితే నేను కృష్ణ ఉన్నాం కదా.. బాగా ఆలోచించు
మురారి దీపావళి రోజున తాను కృష్ణ సంతోషంగా గడిపిన క్షణాలు, తర్వాత కృష్ణ తనకు తినిపించడం ఇలా అన్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తాను ఏదో ఊహించుకుంటున్నా కానీ వేణి గారు తన గురించి ఏం అనుకుంటున్నారో అని అనుకుంటాడు మురారి. ఇక ఉదయం మురారి తన తల్లికి కాఫీ అడుగుతాడు.
మురారి: మనసులో.. ఏంటీ ఎవరూ ఇంకా రెడీ అవ్వలేదా.. అంతేలా నాలాగా ఎవరికి సమస్యలు ఉన్నాయి. ఏంటో అసలు ఏం జరుగుతుందో అనే టెన్షన్ కంటే గతంలో ఏం జరిగిందా అనే టెన్షనే ఎక్కువ అయింది. వీళ్లు ఎవరూ నా గతం గురించి నాకు నిజం చెప్పడం లేదని నా అనుమానం.. ఇంతలో నందూ, గౌతమ్ అక్కడికి వస్తారు.
ముకుంద: గుడ్ మార్నింగ్ మురారి
మురారి: మనసులో.. ముకుందతో నా పెళ్లి అంటున్నారు. పెళ్లి అయినతర్వాత నేను ముకుందతో ఉండలేను. కానీ నేను ప్రేమించా అంటున్నారు. నిజమే అనే రుజువులు కూడా ముకుంద చూపించింది.
సుమ: ముకుంద అప్పుడే పెళ్లి కల వచ్చేసినట్లుంది.
ముకుంద: మనసులో.. ఇంకెంత కాలం మురారి.. చెప్పాలి అంటే ఇంకా కొన్ని గంటలు.. పెళ్లి అయిన తర్వాత నిన్ను ఇక్కడ ఉంచుతానా.. అమెరికా తీసుకెళ్లిపోతాను.
భవాని: ఇప్పుడు చూడండి ఇళ్లు ఎంత అందంగా ఉందో.. రేవతి నాకు కాఫీ.. రేవతి నువ్వు కూడా తెచ్చుకో.. ముకుంద శ్రీనివాస్‌ను రమ్మన్నాను ఇంకా రాలేదా.. ముకుంద నువ్వు ఇలా వచ్చి మురారి పక్కన కూర్చొ..(రేవతి చిరాకుగా కిచెన్‌లోకి వెళ్లి పోతుంది) సరే అందరూ దేవుడి దగ్గరకు రండి
మురారి: మనసులో.. ఎందుకు నా మనసు ఈ పెళ్లికి అంగీకరించడం లేదు.. పెళ్లి వద్దని బలంగా అని పిస్తుంది.
భవాని: స్వామి మా అబ్బాయి పెళ్లి ఏ పరిస్థితుల్లో చేస్తున్నామో మా కంటే నీకు బాగా తెలుసు. ఎలాంటి ఆటంకం కలగకుండా సజావుగా జరిపేలా చేసి మా పిల్లల జీవితాలు కాపాడు స్వామి.. కాపాడు. దేవుడి దగ్గర శుభలేఖ తీసి.. మురారి కార్డు ఎలా ఉందో చూడు నాన్న.
మురారి: బాగుంది పెద్దమ్మ.. పెద్దమ్మ ఇప్పుడు మీరు దేవుడితో ఎలాంటి పరిస్థితిలో ఈ పెళ్లి చేస్తున్నాం అన్నారు. అంటే సింపతితో ఈ పెళ్లి చేస్తున్నారా అని మురారి అడగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘బహ్మముడి’ సీరియల్: దుగ్గిరాల ఇంట్లో తిష్టవేసిన కనకం - అరుణ్‌ను పట్టుకోవడానికి కావ్య కొత్త ప్లాన్